Friday, November 16
Log In

CURRENT AFFAIRS JAN 26

రాష్ట్రీయం
1) వరంగల్ లో ఐటీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చిన కంపెనీ ఏది?
జ: టెక్ మహీంద్రా
2) దేశంలోనే మొదటి సారిగా ప్రభుత్వ హయాంలో సంతాన సాఫల్య కేంద్రం ఎక్కడ ఏర్పాటు చేశారు ?
జ: గాంధీ హాస్పిటల్ ( హైదరాబాద్ )
3) పరుష పదజాలంతో తిడితే న్యాయస్థానం అనుమతి లేకుండానే నేరాలను విచారించే దస్త్రంపై ముఖ్యమంత్రి కేసీఆర్ సంతకం చేశారు. వీటికి ఏయే సెక్షన్లు వర్తిస్తాయి ?
జ: 506, 507 సెక్షన్లు
4) హైదరాబాద్ కి చెందిన సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ ( CISF) చీఫ్ కమాండెంట్ యశ్వంత్ సింగ్ కు ఏ అత్యున్నత పురస్కారం లభించింది ?
జ: రాష్ట్రపతి పురస్కారం
5) తెలంగాణలోని ఆరోగ్యశ్రీ పథకాన్ని ఇటీవల ఏ దేశానికి చెందిన బృందం అధ్యయనం చేసింది ?
జ: దక్షిణ కొరియా


6) L & T మెట్రో ఎండీ/CEOగా ఎవరు నియమితులయ్యారు ?
జ: కేవీబీ రెడ్డి
7) హైదరాబాద్ లో అంతర్జాతీయ జీవకణ సదస్సు ఎప్పుడు జరగనుంది ?
జ: జనవరి 27 నుంచి 31 వరకూ
8) జాతీయ స్థాయిలో పరిశోధనలకు హైదరాబాద్ కు చెందిన డాక్టర్ సుబ్బయ్యకి అవార్డు దక్కింది. ఆయన దేనిపై పరిశోధనలు చేశారు ?
జ: జన్యు థెరపీతో డిస్క్ చికిత్స
9) జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం నివేదిక ప్రకారం తెలంగాణ, ఏపీల్లో ఎంతమందికి మరణశిక్షలు ఖరారయ్యాయి ?
జ: తెలంగాణలో - ఆరుగురు, ఏపీలో - ఇద్దరికి
10) సింగూరు పరివాహక ప్రాంతాల నుంచి వచ్చే జలాలతో ఏ లిఫ్ట్ ఇరిగేషన్ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ?
జ: తాలెల్మ
11) కుటుంబ నియంత్రణ కోసం మహిళలకు ఇంజెక్షన్ ఇచ్చే విధానం పేరు ఏంటి ?
జ: అంతర
12) బ్యాడ్మింటన్ స్టార్ కిదాంబి శ్రీకాంత్ కి ఏ అవార్డు దక్కింది ?
జ: పద్మశ్రీ


జాతీయం
13) ఆసియాన్ దేశాలతో అనుబంధం పెంచుకోవడంలో భాగంగా ఆ దేశాల ప్రముఖులకు ఎన్ని పద్మశ్రీ అవార్డులను ప్రకటించారు ?
జ: 10 (దేశానికి ఒకటి చొప్పున)
14) ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజాకి ఏ అవార్డు దక్కింది ?
జ: పద్మ విభూషణ్
15) పద్మ విభూషణ్ దక్కించుకున్న ప్రముఖులు ఎవరు ?
జ: పరమేశ్వరన్ ( కన్యాకుమారిలోని వివేకానంద కేంద్రం అధ్యక్షుడు)
గులాం ముస్తాఫా ఖాన్ ( గాయకుడు)
16) పద్మ భూషణ్ అందుకున్న క్రీడాకారులు ఎవరు ?
జ: ఎం.ఎస్. ధోని, పంకజ్ అద్వానీ
17) దేశంలో మరణశిక్షలు తగ్గాయి.  జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం నివేదిక ప్రకారం 2017 చివరి నాటికి ఎంతమందికి ఉరిశిక్షలు ఖరారయ్యాయి ?
జ: 371 మందికి
18) జీవిత భీమాతో పాటు తీవ్ర అనారోగ్యానికి కూడా రక్షణ అందేలా పూర్ణ సురక్ష పేరుతో పాలసీని విడుదల చేసిన సంస్థ ఏది ?
జ: SBI లైఫ్ ఇన్సూరెన్స్
19) విమానాల లోపల ఇంటర్నెట్, ఎంటర్ టైన్ మెంట్ అందించే అంతర్జాతీయ సంస్థ గోగో తన టెక్నాలజీ అభివృద్ధి కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేయనుంది ?
జ: చెన్నైలో

అంతర్జాతీయం
20) దక్షిణ చైనా సముద్రంలో ప్రవర్తనా నియమావళిని అమల్లోకి తేవాలని ఏ సమావేశం తీర్మానించింది ?
జ: ఢిల్లీలో జరిగిన భారత్ - ఆసియాన్ సదస్సు
21) ప్రస్తుతం భారత్ - ఆసియాన్ దేశాల కూటమి వాణిజ్యం ఎంతకు చేరింది ?
జ: 70 బిలియన్ డాలర్లు
22) 8 వందల యేళ్ళ చరిత్రలో ఓ యూనివర్సిటీలో అడ్మిషన్ పొందినవారిలో పురుషుల కంటే మహిళలే ఎక్కువ మంది ఉన్నారు. ఆ యూనివర్సిటీ ఏది
జ: ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ (లండన్ )
23) భూవాతావరణం, అంతరిక్షం కలిసేచోట వాతావరణ పొరల్లోని మార్పులను అధ్యయనం చేయడానికి అంతరిక్ష సంస్థ నాసా ఏ మిషన్ ను రంగంలోకి దింపుతోంది ?
జ: The Global Scale Observations of the Limb and Disc (GOLD)

 

SI/CONSTABLE/VRO/GROUP.IV
పూర్తి వివరాలకు విజిట్ చేయండి:
http://telanganaexams.com/siconstable-4steps/

TRT జాబ్ కి 40 రోజుల ప్లాన్
SGT /SA (SOCIAL, BIOLOGY, TELUGU ) కి మాక్ టెస్ట్ లు, ప్రిపరేషన్ మెటీరియల్ (ఆన్ లైన్లో)
https://tsexams.com/trt-50days/

TRANCO ఎగ్జామ్స్ కి గ్రాండ్ టెస్టులు
(General Awarenes + Electrical Subject)
15 గ్రాండ్ టెస్టులు-1200 ప్రశ్నల కవరేజ్

AE/SUB ENGR...GS లో కొన్ని టాపిక్స్ పై ప్రిపరేషన్ మెటీరియల్ కూడా ఇవ్వబడును)
పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి:
https://tsexams.com/tranco-announce/

AEE ఎగ్జామ్స్ డేట్ ను TSPSC ప్రకటించింది.  మార్చి 18న జరుగుతాయి.  అందువల్ల మీరు ఆన్ లైన్ లో జనరల్ స్టడీస్ + CURRENT AFFAIRS మాక్ టెస్టులు రాసుకోడానికి మంచి అవకాశం

ఇంగ్లీష్, తెలుగు మీడియంల్లో మాక్ టెస్టులు... పూర్తి వివరాలకు : http://telanganaexams.com/aee-mock-tests/