Monday, September 23

CURRENT AFFAIRS – JAN 23

తెలంగాణ
01) గత 20యేళ్ళల్లో ఎన్నడూ లేనంతగా అత్యధికంగా ఖరీఫ్ సీజన్ లో రికార్డు స్థాయిలో ఎంత వరి దిగుబడి వచ్చినట్టు వ్యవసాయ ప్రకటించింది ?
జ: 61 లక్షల టన్నులు
(నోట్: 2013-14 ఖరీఫ్ లో 56.56 లక్షల టన్నులు వచ్చింది )
02) తెలంగాణలో పంటల ఉత్పాదకత తక్కువగా ఉందనీ... పంటల కాలనీల ఏర్పాటుతో ఈ సమస్య అధిగమించవచ్చని ప్రభుత్వానికి నివేదికి ఇచ్చిన యూనివర్సిటీ ఏది ?
జ: ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం
03) రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాల సందర్శన కోసం తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ తెచ్చిన కొత్త యాప్ పేరేంటి ?
జ: i Explore Telangana
04) నష్టాలు వస్తున్నాయన్న కారణంతో భద్రాద్రి జిల్లా పాల్వంచలో మూతపడిన ఏ కర్మాగారం తిరిగి తెరుచుకుంది ?
జ: స్పాంజ్ ఐరన్ కర్మాగారం
05) నేషనల్ వాటర్ మిషన్ డైరెక్టర్ గా నియమితులైన ఢిల్లీలోని తెలంగాణ భవన్ ముఖ్య రెసిడెంట్ కమిషనర్ ఎవరు ?
జ: జి.అశోక్ కుమార్

జాతీయం
06) కేంద్ర జలసంఘం (CWC), జాతీయ భూగర్భ జలమండలి స్థానంలో కొత్తగా జాతీయ జల సంఘం (నేషనల్ వాటర్ కమిషన్ - NWC)ను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఏ కమిటీ నివేదిక సిఫార్సుల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకుంటున్నారు ?
జ: మిహిర్ షా కమిటీ
07) 2019 జనవరి 23 అర్థరాత్రి నింగిలోకి వెళ్తున్న PSLV C-44 ఏయే ఉపగ్రహాలను నింగిలోకి తీసుకెళ్తోంది ?
జ: కలాం శాట్ తో పాటు , మైక్రో శాట్ ఉపగ్రహాలు
08) మన దేశంలో నీటి లభ్యత క్రమేపీ తగ్గిపోతుందని పార్లమెంటరీ స్థాయీ సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. దీనిపై సంఘం రిలీజ్ చేసిన నివేదిక ఏది ?
జ: నీటి లభ్యత - జలవనరులపై వాతావరణ ప్రభావం
09) 1951లో తలసరి నీటి లభ్యత ఏడాదికి 5177 క్యూబిక్ మీటర్లు ఉంటే 2011 నాటికి 1545 క్యూమీ ఉంది. ఇది 2021 నాటికి ఎంతకు తగ్గుతుందని పార్లమెంటరీ స్థాయీ సంఘం అంచనా వేసింది ?
జ: 1341 క్యూబిక్ మీటర్లు
10) టాంజానియా దేశంలో ఖనిజాల అన్వేషణ కోసం ఆ దేశ స్టేట్ మైనింగ్ కార్పోరేషన్ (స్టామిగో)తో ఒప్పుందం కుదుర్చుకుంటున్న సంస్థ ఏది ?
జ: NMDC
11) దేశంలోని 7 వేల 516 కిలోమీటర్ల తీరం పొడవునా ఏ పేరుతో భారీ విన్యాసాలను భారత నౌకాదళం ప్రారంభించింది ?
జ: సీ -విజిల్
12) 2018 ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ తో పాటు టెస్టులు, వన్డేల్లో ఉత్తమ ఆటగాడిగా ఒకే ఏడాదిలో మూడు ICC అవార్డులు గెలుచుకున్న భారతీయ క్రికెటర్ ఎవరు ?
జ: విరాట్ కోహ్లీ

SI/PC(M)/GR.1,2 & 3- 50రోజుల్లో 325 TESTS

మొత్తం టైమ్ టేబుల్ వివరాలను ఈ లింక్ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి:

50 DAYS PLAN TS SI-PC (M) & TSPSC GR.2

మీరు మాక్ టెస్టులు, గ్రాండ్ టెస్టులకు ఫీజులు చెల్లించడానికి ఈ కింది లింక్ క్లిక్ చేయండి

https://telanganaexams.com/mocktests/