Monday, September 23

CURRENT AFFAIRS – JAN 22

తెలంగాణ
01) విశ్వవిద్యాలయాల నిధుల సంఘం (UGC) స్వయంప్రతిపత్తి పొందిన కళాశాలల సంఖ్యలో తెలంగాణ ఎన్నో స్థానంలో నిలిచింది ?
జ: నాలుగో స్థానం (59 కాలేజీలు)
(నోట్: 183 కళాశాలలతో తమిళనాడు మొదటి స్థానంలో ఉంది)
02) ఫేమ్ ఇండియా - ఆసియా పోస్ట్ మేగజైన్ నిర్వహించిన శ్రేష్ట్ సంసద్ ( ఉత్తమ పార్లమెంటేరియన్ ) సర్వేలో ఎంపికైన రాష్ట్రానికి చెందిన ఎంపీ ఎవరు ?
జ: కల్వకుంట్ల కవిత
03) తెలంగాణ రాష్ట్ర వైద్యసేవలు - మౌలిక సదుపాలయ అభివృద్ధి సంస్థ (TS MSIDC) ఎండీగా ఎవరు నియమితులయ్యారు ?
జ: కె.చంద్రశేఖర్ రెడ్డి
04) రాష్ట్రంలో ధరణి వెబ్ సైట్ దేనికి సంబంధించినది ?
జ: రైతుల భూములకు సంబంధించి రెవెన్యూ, రిజిష్ట్రేషన్ వ్యవస్థలను అనుసంధానించేది

జాతీయం
05) యువ ప్రవాస భారతీయుల దినోత్సవ కార్యక్రమం ఎక్కడ జరుగుతోంది ?
జ: వారణాసిలో
06) 2018లో దేశంలో 18మంది కొత్తగా కుబేరులవడంతో వీరి సంఖ్య 119కి చేరినట్టు ఏ సర్వే వెల్లడించింది ?
జ: ఆక్స్ ఫామ్
07) 2018లో దేశంలోని 119మంది అత్యంత ధనవంతుల దగ్గరున్న ధనం ఎంత ?
జ: రూ.28లక్షల కోట్లు ( 44 వేల కోట్ల డాలర్లు )
08) IDBI బ్యాంకులో 51శాతం వాటా కొనుగోలు చేసిన ప్రభుత్వ రంగ సంస్థ ఏది ?
జ: LIC
09) IDBI ప్రస్తుత మేనేజింగ్ డైరెక్టర్ ఎవరు ?
జ: రాకేశ్ శర్మ
10) భారత ఆర్థిక వ్యవస్థ రాణిస్తుందనీ... 2019, 2020ల్లో ఎంత శాతం వృద్ధి రేటు ఉంటుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (IMF) అంచనా వేసింది ?
జ: 2019 - 7.5 శాతం, 2020 లో 7.7శాతం
11) ది వన్ పేరుతో ప్రీమియం పొదుపు ఖాతాని ప్రారంభించిన బ్యాంక్ ఏది ?
జ: ICICI
12) నడిచే దేవుడు,త్రవిధ దాసోహి, శతాయుషిగా పిలిచే తుమకూరు సిద్ధ గంగ మఠాధిపతి కర్ణాటకలో చనిపోయారు. ఆయన పేరేంటి ?
జ: శివకుమార స్వామి (111)

అంతర్జాతీయం
13) ప్రపంచ ఆర్థిక వేదిక (WEF) వార్షిక సదస్సు ఎక్కడ జరుగుతోంది ?
జ: దావోస్
14) చైనాకి 28యేళ్ళ తర్వాత అతి పెద్ద కష్టం వచ్చింది. 2018లో ఆ దేశ ఆర్థిక వృద్ధి రేటు ఎంతగా నమోదైంది ?
జ: 6.6శాతంగా
15) రూ.100కి మించి విలువ ఉన్న భారతీయ కరెన్సీని నిషేధించిన దేశం ఏది ?
జ: నేపాల్

SI/PC(M)/GR.1,2 & 3- 50రోజుల్లో 325 TESTS

మొత్తం టైమ్ టేబుల్ వివరాలను ఈ లింక్ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి:

50 DAYS PLAN TS SI-PC (M) & TSPSC GR.2

మీరు మాక్ టెస్టులు, గ్రాండ్ టెస్టులకు ఫీజులు చెల్లించడానికి ఈ కింది లింక్ క్లిక్ చేయండి

https://telanganaexams.com/mocktests/