Monday, September 23

CURRENT AFFAIRS – JAN 15

తెలంగాణ
01) రాష్ట్ర మంత్రివర్గంలో 34 శాఖలను ఎన్నింటికి కుదిస్తున్నారు ?
జ: 18 శాఖలకు

జాతీయం
02) ప్రజలు (పీపుల్), ప్రయోజనం (ప్రాఫిట్), ప్రపంచం (ప్లానెట్) కోసం కృషి చేస్తున్నందుకు ఏ దేశనేతకి తొలి ఫిలిప్ కాట్లర్ అవార్డు ప్రదానం చేశారు ?
జ: ప్రధాన నరేంద్ర మోడీ (భారత్ )
03) ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో జనరల్ కేటగిరీలో కల్పించిన 10శాతం కోటా - రాజ్యాంగ (103వ సవరణ) చట్టం 2019 ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చినట్టు కేంద్ర సామాజిక న్యాయ, సాధికరత మంత్రిత్వ శాఖ గెజిట్ నోటిఫికేషన్ ద్వారా వెల్లడించింది ?
జ: 2019 జనవరి 14 నుంచి
04) 10శాతం EWS కోటాని దేశంలో మొదటగా అమలు చేసిన రాష్ట్రం ఏది ?
జ: గుజరాత్ (2019 జనవరి 14 నుంచి )
05) దారిద్ర్య రేఖకు దిగువన (Below poverty line) నిర్వచనం ప్రకారం ఐదుగురు సభ్యులున్న గ్రామీణ, పట్టణ కుటుంబాలు నెలకు ఎంత ఖర్చు చేస్తుండాలి ?
జ: గ్రామీణ కుటుంబం: రూ.4,080
పట్టణ కుటుంబం రూ.5,000
06) ప్రస్తుతం కేంద్ర ఆర్థిక కార్యదర్శి గా పనిచేస్తున్న నారాయణ్ ఝా పదవీ కాలాన్ని మరో నెల పెంచుతూ కేంద్ర సిబ్బంది శాఖ ఆదేశాలిచ్చింది. ఆయన పదవీకాలం ఎప్పటితో ముగుస్తోంది ?
జ: 2019 జనవరి 31 వరకూ
07) కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ) పై 6 నెలల సర్టిఫికెట్ కోర్సు ప్రారంభించిన విద్యా సంస్థ ఏది ?
జ: ఐఐటీ ఖరగ్ పూర్
08) విమాన ప్రయాణాల్లో కాగితం పని తగ్గించేందుకు దేశంలోనే మొదటిసారిగా బోర్డింగ్ పాస్ లపై స్టాంపింగ్ లేని విధానాన్ని ఏ విమానాశ్రయంలో ప్రవేశపెట్టారు ?
జ: ముంబైలోని ఛత్రపతి శివాజా మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం
09) కేరళలో ఎన్నోయేళ్ళుగా స్త్రీలకు అనుమతి లేని అతస్త్యర్ కూడమ్ ను అధిరోహించిన మహిళా అధికారి ఎవరు ? ( అత్యంత ఎత్తయిన రెండో పర్వత శిఖరం)
జ: కె.ధన్యా సనాల్
10) రైలు కదులుతున్నట్టుగా తెలిపేందుకు ఏ లైట్ ద్వారా ప్రయాణీకులను హెచ్చరించాలని రైల్వేశాఖ నిర్ణయించింది ?
జ: నీలం లైట్

అంతర్జాతీయం
11) అధిక దిగుబడిని ఇచ్చే కొత్తరకం వరి వంగడాలను చైనా వ్యవసాయ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఈ బృందానికి ఎవరు నాయకత్వం వహించారు ?
జ: జిన్ జియాంగ్ పెంగ్ బృందం ( సౌత్ చైనా అగ్రికల్చరల్ యూనివర్సిటీ )
12) చంద్రుడిపై అంతర్జాతీయ పరిశోధనా కేంద్రం ఏర్పాటుకు ప్రతిపాదించిన దేశం ఏది ?
జ: చైనా

SI/PC(M)/GR.1,2 & 3- 50రోజుల్లో 325 TESTS

మొత్తం టైమ్ టేబుల్ వివరాలను ఈ లింక్ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి:

50 DAYS PLAN TS SI-PC (M) & TSPSC GR.2

మీరు మాక్ టెస్టులు, గ్రాండ్ టెస్టులకు ఫీజులు చెల్లించడానికి ఈ కింది లింక్ క్లిక్ చేయండి

https://telanganaexams.com/mocktests/