Monday, September 23

CURRENT AFFAIRS – JAN 1

తెలంగాణ
01) కాళేశ్వరం ప్రాజెక్టు అంచనా వ్యయం ఎంత ?
జ: రూ.80,500 కోట్లు
02) ఇప్పటిదాకా కాళేశ్వరం ప్రాజెక్టుకి ప్రభుత్వం ఎంత ఖర్చు చేసింది ?
జ: రూ.40,500 కోట్లు
03) రాష్ట్రంలో కాళేశ్వరం తర్వాత మరో ప్రాజెక్ట్ పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకం. మూడేళ్ళ్లో పూర్తయ్యేలా రూపొందించిన ఈ పథకాన్ని ఎంత మొత్తం అంచనా వ్యయం వేశారు ?
జ: రూ.35,200 కోట్లు
04) ప్రస్తుతం రాష్ట్ర హైకోర్టు రిజిష్ట్రార్ జనరల్ ఎవరు ?
జ: ఎ.వెంకటేశ్వర రెడ్డి
05) తెలంగాణలో ఇంటర్నేషనల్ స్వీట్ ఫెస్టివల్ ఎప్పటి నుంచి జరుగుతోంది ?
జ: జనవరి 13 నుంచి 15 వరకూ ( 20దేశాల ప్రతినిధులు ఇందులో పాల్గొంటున్నారు )

జాతీయం
06) కేంద్ర ప్రధాన సమాచార కమిషనర్ గా ఎవరిని నియమిస్తూ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింది ఉత్తర్వులు జారీ చేశారు.
జ: సుధీర్ భార్గవ
07) రైల్వే బోర్డు ఛైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు ?
జ: వినోద్ కుమార్ యాదవ్
(నోట్: ప్రస్తుతం ఈయన దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గా ఉన్నారు )
08) సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదవీ విరమణ చేసినది ఎవరు ?
జ: జస్టిస్ మదన్ బి లోకుర్
09) జస్టిస్ మదన్ బి లోకుర్ పదవీ విరమణతో ప్రస్తుతం సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య ఎంతగా ఉంది ?
జ: 26 మంది
10) సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల ఖాళీల సంఖ్య ఎంత ?
జ: ఐదు మంది
11) రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ జీఎంగా ఎవరు బాధ్యతలు స్వీకరించారు ?
జ: ఎం. ఉమాశంకర్ కుమార్ (దక్షిణమధ్య రైల్వే సీపీఆర్ఓ)
12) కొత్తసంవత్సరం సందర్భంగా ఏ రాష్ట్రంలో రైతు బంధు, రైతు బీమా పథకాలను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభించారు ?
జ: పశ్చిమ బెంగాల్ లో ( ముఖ్యమంత్రి మమతా బెనర్జీ)
13) బెంగాల్ లో ఏడాదికి ఎంత మొత్తాన్ని రైతు బంధు పథకం కింద ఇవ్వనున్నారు ?
జ: ఎకరాకి రూ.5 వేలు (మొత్తం 72 లక్షల రైతు కుటుంబాలకి ప్రయోజనం )
14) ఐసీసీ టెస్ట్ బ్యాట్స్ మన్ ర్యాంకింగ్ లో అగ్రస్థానంలో నిలిచిన క్రికెటర్ ఎవరు ?
జ: టీమిండియా సారధి విరాట్ కోహ్లీ
15) ఐసీసీ ఈ ఏడాది ఉత్తమ మహిళా క్రికెటర్ గా ఎవరు ఎంపికయ్యారు ?
జ: స్మృతి మంధాన
(నోట్: ఈ సీజన్ లో 12 వన్డేలు ఆడి 689 పరుగులు, 25 టీ20ల్లో 622 పరుగులు చేసింది.

అంతర్జాతీయం
16) బంగ్లా దేశ్ ఎన్నికల్లో నరైల్ నుంచి అవామీ లీగ్ తరపున గెలిచి ఎంపీ అయిన క్రికెటర్ ఎవరు ?
జ: ముష్రాఫె మొర్తజా (రికార్డు మెజార్టీతో గెలిచాడు )

SI/PC(M)/GR.1,2 & 3- 50రోజుల్లో 325 TESTS

మొత్తం టైమ్ టేబుల్ వివరాలను ఈ లింక్ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి:

50 DAYS PLAN TS SI-PC (M) & TSPSC GR.2

మీరు మా మాక్ టెస్టులు, గ్రాండ్ టెస్టులకు ఫీజులు చెల్లించడానికి ఈ కింది లింక్ క్లిక్ చేయండి

https://telanganaexams.com/mocktests/