Monday, November 18

CURRENT AFFAIRS – FEB 8

తెలంగాణ
01) ఇంగ్లీష్ మరియు విదేశీ భాషల విశ్వవిద్యాలయం (ఇఫ్లూ) వజ్రోత్సవాలు 75 యేళ్ళు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఇఫ్లూ ఆవరణలో వజ్రోత్సవాల పైలాన్ ను ఎవరు ఆవిష్కరించారు ?
జ: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
02) రాష్ట్రంలో కోరుట్ల, కొల్లాపూర్ లను రెవెన్యూ డివిజన్లుగా చేయడంతో మొత్తం సంఖ్య ఎంతకు చేరుకుంది ?
జ: 71 కి
03) గర్భిణీల్లో 20వ వారంలో వచ్చే గుర్రపు వాతం (ప్రీఎక్లాంప్సియా)ను గుర్తించేందుకు ర్యాపిడ్ టెస్టును డయాబెటోమిక్స్ కంపెనీ అందుబాటులోకి తెచ్చింది. ఆ టెస్ట్ పేరేంటి ?
జ: లుమెల్లా కిట్
04) రాష్ట్రంలో విద్యుత్ వాహనాలకు ఛార్జింగ్ మౌలిక సదుపాలయ కల్పనకు నోడల్ ఏజెన్సీగా దేన్ని నామినేట్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది ?
జ: తెలంగాణ రాష్ట్ర సాంప్రదాయేతర ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ (TS REDCO)
05) TS IPASS అనుమతుల్లో భాగంగా ప్రొఫెషనల్ ట్యాక్స్ ( వృత్తి పన్ను) నమోదును ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తామని వాణిజ్య పన్నుల శాఖ ప్రకటించింది ?
జ: ఒక్క రోజులోనే
(నోట్: తెలంగాణ పారిశ్రామిక అనుమతులు, స్వీయ ధృవీకరణ విధానం( TS IPASS ) కింద దరఖాస్తు చేసుకున్న పారిశ్రామికవేత్తలకు అనుమతులను 15రోజుల్లోపు పూర్తి చేయాల్సి ఉంటుంది.
06) తెలంగాణ రాష్ట్ర రహదారి భద్రతా సంస్థ ఛైర్మన్ ఎవరు ?
జ: టి. కృష్ణ ప్రసాద్
07) రాష్ట్రంలో మరో 1840 ఆలయాలకు దూప దీప నైవేద్యం పథకం కింద నిధులను మంజూరు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. అయితే 2015 నుంచి ఒక్కో ఆలయానికి ఎంత మొత్తాన్ని ప్రభుత్వం ఇస్తోంది ?
జ: రూ.2,500లు

జాతీయం
08) రాష్ట్రపతి, ప్రధాని ప్రయాణించే ఎయిర్ ఇండియా వన్ విమానాలకు రెండు అధునాతన క్షిపణి రక్షణ వ్యవస్థలను అమ్మేందుకు అంగీకరించిన దేశం ఏది ?
జ: అమెరికా
09) 19కోట్ల డాలర్లతో భారత్ కొనుగోలు చేయబోయే ఈ అధునాతన వ్యవస్థ పేర్లేంటి ?
జ: లార్జ్ ఎయిర్ క్రాఫ్ట్ ఇన్ ఫ్రారెడ్ కౌంటర్ మెజర్స్ (LAIRCM), సెల్ఫ్ ప్రొటెక్షన్ స్వీట్స్ ( SPS)
10) అధునాతన రక్షణ వ్యవస్థతో రాష్ట్రపతి, ప్రధాని కోసం ఎయిర్ ఇండియా కొనుగోలు చేయబోయే విమానాల పేర్లేంటి ?
జ: బోయింగ్ - 777
11) ఎలాంటి పూచీకత్తు లేకుండా రైతులకు ఎంత మొత్తం రుణం ఇవ్వాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ణయించింది ?
జ: రూ.1.60 లక్షలు
(నోట్: 2010 నుంచి రైతులకు లక్ష రుణం ఇస్తున్నారు )
12) హైదరాబాద్ లో జరిగిన జల సంరక్షణ - మన బాధ్యత జాతీయ సదస్సులో పాల్గొన్న కేంద్ర జల సంఘం (CWC) ఛైర్మన్ ఎవరు ?
జ: ఎస్. మసూద్ హుస్సేన్
13) EVMలతో ఖచ్చితమైన ఫలితాలు వస్తున్నాయా ? ఓటింగ్ ను తప్పనిసరి చేయాలా... లాంటి అనేక అంశాలపై జనం అభిప్రాయాలను కోరుతూ ఏ సంస్థతో కలసి 18 పేజీల పత్రాన్ని కేంద్ర ఎన్నికల సంఘం తయారు చేసింది ?
జ: టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (టిస్)
14) అంతర్జాతీయ మేధో హక్కుల సూచీలో భారత్ స్థానం (మొత్తం దేశాలు 50) ఎంత ?
జ: 36 ( గతం కంటే 8 స్థానాలు మెరుగయ్యాయి )
15) ప్రతి యేటా అంతర్జాతీయ మేధో హక్కుల (IP) సూచీని ఎ సంస్థ విడుదల చేస్తుంది ?
జ: అమెరికా ఛాంబర్ ఆఫ్ కామర్స్ కు చెందిన గ్లోబల్ ఇన్నోవేషన్ పాలసీ సెంటర్ (GIPC)
16) 2019 ఫిబ్రవరి 20 నుంచి 23 వరకూ సిడ్నీ, మెల్ బోర్న్ లో జరిగే ది ఆస్ట్రేలియా ఇండియా యూత్ డైలాగ్ (AIYD-2019) కు ఎంపికైన తెలుగు వ్యక్తి ఎవరు ?
జ: రాజా కార్తికేయ గుండు
(నోట్: భారత్ నుంచి ఎంపికైన 11మందిలో ఒకరు. ప్రస్తుతం కార్తికేయ న్యూయార్క్ లోని ఐరాస సచివాలయంలో రాజకీయ వ్యవహారాల అధికారిగా పనిచేస్తున్నారు )
17) 2G స్పెక్ట్రమ్ కి సంబంధించి CBI, ED దాఖలు చేసిన కేసుల్లో సమాధానం చెప్పేందుకు గడువు కోరిన సంస్థలు, వ్యక్తులకు 16వేల మొక్కలు నాటాలని జరిమానా విధించిన కోర్టు ఏది ?
జ: ఢిల్లీ హైకోర్టు
18) రంజీ ట్రోఫిని వరుసగా రెండోసారి గెలుచుకున్న జట్టు ఏది ?
జ: విదర్భ జట్టు
19) విదర్భ జట్టు ఏ జట్టుని 78 పరుగుల తేడాతో ఓడించింది ?
జ: సౌరాష్ట్ర జట్టుని

అంతర్జాతీయం
20) 2018లో కూడా భూతాపం అధికంగా నమోదైంది. 1880 తర్వాత కాలంలో ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక భూతాపం నమోదైన సంవత్సరాల జాబితాలో 2018కి ఎంత స్థానం వచ్చింది ?
జ: నాలుగో స్థానం
(నోట్: 1951-1980 మధ్య కాలపు సగటు కన్నా 2018 లో 0.83 డిగ్రీల సెల్షియస్ అధికంగా ఉంది )

తక్కువ టైమ్ లో మీరు మెయిన్స్ కి ప్రిపేర్ అయ్యేలా మా మాక్ టెస్టులు ఉపయోగపడతాయి. మెయిన్స్ కోసం (1) స్టేట్ మెంట్స్ (2) జతపరచండి (3) కాలక్రమంలో రాయండి మోడల్స్ లో ఇస్తున్నాం. (మెయిన్స్ ఎగ్జామ్స్ కంటే ముందే మాక్ టెస్టులు పూర్తయ్యేలా ప్లాన్ చేస్తున్నాం.. )

SI/PC(M)/GR.1,2,3 - 40రోజుల్లో 325 TESTS

మీరు మా మాక్ టెస్టులు, గ్రాండ్ టెస్టులకు ఫీజులు చెల్లించడానికి ఈ కింది లింక్ క్లిక్ చేయండి

https://telanganaexams.com/mocktests/

మొత్తం టైమ్ టేబుల్ వివరాలను ఈ లింక్ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి:

FEB REVISED 40 DAYS PLAN-converted(1)