Wednesday, October 23

CURRENT AFFAIRS – FEB 7

తెలంగాణ
01) ఏ గ్రామ సర్పంచ్ ని ఆదర్శంగా తీసుకొని గ్రామజ్యోతి కార్యక్రమాన్ని ప్రారంభించినట్టు ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు ?
జ: గంగదేవిపల్లి మాజీ సర్పంచ్ కూసం రాజమౌళి
02) కేంద్ర మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ, రాష్ట్ర మహిళా శిశు సంక్షే శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఉమెన్ ఆఫ్ ఇండియా ఆర్గానిక్ ఫెస్టివల్ ఎక్కడ ప్రారంభమైంది ?
జ: శిల్పారామం (హైదరాబాద్ )
03) రైల్వే స్టేషన్ల ఆధునీకరణలో తెలంగాణకి సంబంధించి ఎన్ని స్టేషన్లు ఉన్నట్టు రైల్వేశాఖ సహాయ మంత్రి రాజెన్ గొహైన్ లోక్ సభలో తెలిపారు ?
జ: 25 స్టేషన్లు
04) తెలంగాణకి సంబంధించిన ఎంపీ ల్యాడ్స్ లో గత నాలుగేళ్ళల్లో ఎన్నికోట్ల రూపాయల ఖర్చు చేశారు ?
జ: రూ.448 కోట్లు
05) రామగుండంలో నిర్మిస్తున్న 4వేల మెగావాట్ల సూపర్ థర్మల్ విద్యుత్ కేంద్రం నుంచి అయ్యే విద్యుదుత్పత్తిలో తెలంగాణకి ఎంత శాతం కేటాయిస్తూ కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది ?
జ: 85శాతం
(నోట్: 2020-21 చివరి త్రైమాసికం నుంచి విద్యుత్ ఉత్పత్తి ప్రారంభం అవుతుంది. ప్రాజెక్ట్ వ్యయం : రూ.11,811.26 కోట్లు)
06) ఏ విశ్వ విద్యాలయంలో చరిత్ర విభాగం మొదలుపెట్టి వందేళ్ళయిన సందర్భంగా హస్టరీ కాంగ్రెస్ నిర్వహిస్తున్నారు ?
జ: ఉస్మానియా విశ్వవిద్యాలయం

జాతీయం
07) 2019 ఫిబ్రవరి 6న జీశాట్ - 31 ఉపగ్రహాన్ని PSLV-C44 వాహక నౌక ద్వారా ఎక్కడ నుంచి ఇస్రో విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది ?
జ: దక్షిణ అమెరికాలోని ఫ్రెంచ్ గయానా నుంచి
08) జీశాట్ 31 ఉపగ్రహం ఇస్రోకి చెందిన 40వ కమ్యూనికేషన్ ఉపగ్రహం. ఇది 15యేళ్ళ పాటు ఏ విభాగంలో సేవలు అందించనుంది ?
జ: విశాట్ నెట్ వర్క్స్, టెలివిజన్ అప్ లింక్స్. మారుమూలల్లో ఉండే దీవులకు కూడా డీటీహెచ్ సేవలు అందించవచ్చు
09) కాగ్నిజెంట్ CEO గా ఎవరు నియమితులయ్యారు ?
జ: బ్రయాన్ హంప్రైస్
10) రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఐదు కేటగిరీల్లో సంగీత్ నాటక్ అకాడమీ అవార్డులను అందజేశారు. ఈ అవార్డు అందుకున్న కూచిపూడి నర్తకి ఎవరు ?
జ: దీపికా రెడ్డి
11) పెళ్ళి చేసుకొని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టే వధువుకి ప్రభుత్వం తరపున తులం బంగారం (11.66 గ్రాములు) అందిస్తానని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం ఏది ?
జ: అసోం ( ముఖ్యమంత్రి : సోనోవాల్ )

తక్కువ టైమ్ లో మీరు మెయిన్స్ కి ప్రిపేర్ అయ్యేలా మా మాక్ టెస్టులు ఉపయోగపడతాయి. మెయిన్స్ కోసం (1) స్టేట్ మెంట్స్ (2) జతపరచండి (3) కాలక్రమంలో రాయండి మోడల్స్ లో ఇస్తున్నాం. (మెయిన్స్ ఎగ్జామ్స్ కంటే ముందే మాక్ టెస్టులు పూర్తయ్యేలా ప్లాన్ చేస్తున్నాం.. )

SI/PC(M)/GR.1,2,3 - 40రోజుల్లో 325 TESTS

మీరు మా మాక్ టెస్టులు, గ్రాండ్ టెస్టులకు ఫీజులు చెల్లించడానికి ఈ కింది లింక్ క్లిక్ చేయండి

https://telanganaexams.com/mocktests/

మొత్తం టైమ్ టేబుల్ వివరాలను ఈ లింక్ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి:

FEB REVISED 40 DAYS PLAN-converted(1)