Wednesday, October 23

CURRENT AFFAIRS – FEB 5

తెలంగాణ
01) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బయ్యారం దగ్గర జెన్ కో నిర్మిస్తున్న భద్రాద్రి విద్యుత్కేంద్రంలో 4 యూనిట్లలో ఎన్ని మెగావాట్ల విద్యుత్ ను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు ?
జ: 1080 మెగావాట్లు ( ఒక్కోటి 270 మెగావాట్ల చొప్పున 4 యూనిట్లు )
02) మేలైన రకం పట్టు ఉత్పత్తిలో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. ఆ మేలైన రకం ఏది ?
జ: బైఓల్టిన్ రకం
03) జాతీయ పశుగణన వివరాల సేకరణలో దేశంలో మన రాష్ట్రం ఎన్నో స్థానంలో నిలిచింది ?
జ: మూడో స్థానం
04) ప్రభుత్వ ఉద్యోగుల సాధారణ భవిష్యనిధి (GPF) పై వడ్డీరేటును రాష్ట్ర ప్రభుత్వం ఎంతగా నిర్ణయించింది ?
జ: 8శాతం
05) నరుని సేవలో నారాయణుడు పేరుతో రిటైర్డ్ IAS అధికారి APVS శర్మ ఆత్మకథ పుస్తకాన్ని గవర్నర్ నరసింహన్ దంపతులు ఆవిష్కరించారు. దీన్ని ఎవరు రాశారు ?
జ: డాక్టర్ అనంత పద్మనాభరావు
06) ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ సాఫ్ట్ వేర్ ప్రమోషన్ కౌన్సిల్ ఆధ్వర్యంలో 19వ ఇండియా సాఫ్ట్ అంతర్జాతీయ ప్రదర్శన, సదస్సు ఎక్కడ జరిగింది ?
జ: హైదరాబాద్ లోని HICC లో
07) వరంగల్ కేంద్రంగా పనిచేస్తోన్న ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ ( APGVB) కొత్త ఛైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు ?
జ: కె.ప్రవీణ్ కుమార్
08) హైదరాబాద్ నుంచి జెడ్డాకు ప్రతి రోజూ విమాన సర్వీసును ప్రారంభించిన ప్రైవేటు విమాన యాన సంస్థ ఏది ?
జ: స్పైస్ జెట్

జాతీయం
09) పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఎవరు ?
జ: కేసరినాథ్ త్రిపాఠి
10) దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గా ఎవరు నియమితులయ్యారు ?
జ: జి. మల్య
11) కేంద్ర సామాజిక ఫించన్ కింద కేంద్ర ప్రభుత్వం నెలకు ఎంత మొత్తం ఇస్తోంది ?
జ: రూ.200 (దీన్ని రూ.600కు పెంచాలని భావిస్తోంది )
12) దేశంలో ఏ లావాదేవీలకు కూడా అంబుడ్స్ మన్ వ్యవస్థను ఏర్పాటు చేసి... జనవరి 31, 2019 నుంచి అమల్లోకి తెస్తూ ఆర్భీఐ నిర్ణయం తీసుకుంది?
జ: డిజిటల్ లావాదేవీలు
13) దక్షిణాది రాష్ట్రాల (ఆరు) పోలీస్ డీజీపీల సమావేశం ఎక్కడ జరుగుతోంది ?
జ: తిరుపతిలో
14) 2018 ఏప్రిల్ - డిసెంబర్ నాటికి ద్రవ్యలోటుగా ఎంతకు చేరుకుంది ?
జ: రూ.7.01లక్షల కోట్లు
15) అంతర్జాతీయంగా ఐటీ ఎగుమతుల్లో గత ఆర్థిక సంవత్సరంలో ఎంత వృద్ధి సాధించినట్టు కేంద్ర వాణిజ్య శాఖ కార్యదర్శి అనూప్ వధావన్ తెలిపారు ?
జ: 5.79 శాతం

అంతర్జాతీయం
16) రుణాలు ఎగ్గొట్టి లండన్ లో తలదాచుకున్న మద్యం వ్యాపారి విజయ్ మాల్యాను భారత్ కి అప్పగించడానికి అధికారిక పత్రాలపై బ్రిటన్ హోంమంత్రి సంతకం చేశారు. ఆయన పేరేంటి ?
జ: సాజిద్ జావిద్
17) హోటళ్ళలో అతిథులు కోరిన ఆహారం, వస్తువులు అందించేందుకు సింగపూర్ సోఫీ టెల్ సెంటర్లో ఏర్పాటు చేసిన రోబోల పేర్లేంటి ?
జ: సోఫీ, జేవియర్

SI/PC(M)/GR.1,2,3 - 40రోజుల్లో 325 TESTS

మీరు మా మాక్ టెస్టులు, గ్రాండ్ టెస్టులకు ఫీజులు చెల్లించడానికి ఈ కింది లింక్ క్లిక్ చేయండి

https://telanganaexams.com/mocktests/

మొత్తం టైమ్ టేబుల్ వివరాలను ఈ లింక్ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి:

FEB REVISED 40 DAYS PLAN-converted(1)