Wednesday, October 23

CURRENT AFFAIRS – FEB 3 &4

తెలంగాణ
01) రాష్ట్ర ప్రజారవాణాని ఒకే కార్పోరేషన్ కిందికి తీసుకు రావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఏయే విభాగాలను ఇందులో భాగం చేయనున్నారు ?
జ: ఆర్టీసీ, మెట్రో రైలు, MMTS
02) రాష్ట్రంలో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ కేసులు ఎక్కువగా ఎక్కడ నమోదవుతున్నాయి ?
జ: సిరిసిల్ల జిల్లాలో ( 144), అత్యల్పంగా మెదక్ జిల్లాలో 73 కేసులు
03) సినారె పురస్కారాన్ని ఏ ఏడాదికి మౌనశ్రీ మల్లిక్ కి అందించారు. ఏ గ్రంథానికి ఈ అవార్డు దక్కింది ?
జ: తప్త స్పృహ
04) ఆదివాసీల ఆరాధ్య దైవం కేస్లాపూర్ నాగోబాకి పుష్యమాస అమావాస్య సందర్భంగా 2019 ఫిబ్రవరి 4నాడు మహాపూజ నిర్వహిస్తున్నారు. ఏ వంశీయులు ఈ మహాపూజలో పాల్గొంటారు ?
జ: మైస్రం వంశీయులు

జాతీయం
05) రాష్ట్రీయ ఉచ్చతార్ శిక్ష అభియాన్ (రూసా) పథకంను దేశంలోని 10 విశ్వవిద్యాలయాల్లో జమ్మూ కశ్మీర్ నుంచి ఆన్ లైన్ లో ప్రారంభించినది ఎవరు ?
జ: ప్రధాని నరేంద్రమోడీ
06) కేంద్ర దర్యాప్తు సంస్థ ( CBI) డైరెక్టర్ గా ఎవరు నియమితులయ్యారు ?
జ: రిషి కుమార్ ( 1983 బ్యాచ్ కు చెందిన మధ్యప్రదేశ్ క్యాడర్ IPS అధికారి)
07) మల్టీ లెవల్ మార్కెటింగ్ కేసు (శారదా కుంభకోణం)లో CBI ఆరోపణలు ఎదుర్కొంటున్న కోల్ కతా పోలీస్ కమిషనర్ ఎవరు ?
జ: రాజీవ్ కుమార్
08) ఏ దేశం నుంచి 73వేల ఆధునిక రైఫిళ్ళ దిగుమతికి భారత్ ఆమోదం తెలిపింది ?
జ: అమెరికా
09) అమెరికాలో భారత రాయబారి ఎవరు ?
జ: హర్షవర్ధన్ శృంగ్లా
10) కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల బోర్డు ( CBDT) ఛైర్మన్ ఎవరు ?
జ: సుశీల్ చంద్ర
11) కార్పోరేషన్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్, CEO గా ఎవరు నియమితులయ్యారు ?
జ: పీవీ భారతి
12) ICC మహిళల వన్డే ర్యాంకింగ్స్ లో మొదటి స్థానంలో నిలిచిన భారతీయ క్రికెటర్ ఎవరు ?
జ: స్మృతి మంధాన

అంతర్జాతీయం
13) ప్రచ్చన్న యుద్ధకాలం నాటి మధ్యశ్రేణి అణ్వస్త్ర దేశాల ఒడంబడిక ( INF) నుంచి అమెరికా గతంలో వైదొలగింది. తాజాగా ఏ దేశం కూడా తప్పుకుంటున్నట్టు ప్రకటించింది ?
జ: రష్యా ( అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ )
14) మధ్యశ్రేణి క్షిపణులను నిషేధిస్తూ 1987లో INF ఒప్పందం చేసుకున్న దేశాలు ఏవి ?
జ: అమెరికా, USSR ( మునుపటి రష్యా రిపబ్లిక్ )
15) రూ.21వేల కోట్లతో చైనా ఏ దేశం నుంచి గాడిదలను దిగుమతి చేసుకుంటోంది ?
జ: పాకిస్థాన్
16) అంతర్జాతీయ క్రికెట్ లో అత్యంత పిన్న వయసున్న (16యేళ్ళ 146రోజులు) అర్థసెంచరీ చేసిన నేపాలీ క్రికెటర్ ఎవరు ?
జ: రోహిత్ కుమార్ పౌడెల్
17) మార్కెట్లో రూ.93వేలు పలికే... హ్యాకింగ్ కి ఆవకాశం లేని మొబైల్ ఫోన్ ను ఏ దేశానికి చెందిన ప్రభుత్వ రంగ సంస్థ రాస్ టెక్ రూపొందించింది ?
జ: రష్యా
(నోట్: క్రుయిజ్ -కే అనే క్రిప్టో పరిరక్షణ సాంకేతిక పరిజ్ఞానంతో దీన్ని రూపొందించారు )

SI/PC(M)/GR.1,2,3 - 40రోజుల్లో 325 TESTS

మీరు మా మాక్ టెస్టులు, గ్రాండ్ టెస్టులకు ఫీజులు చెల్లించడానికి ఈ కింది లింక్ క్లిక్ చేయండి

https://telanganaexams.com/mocktests/

మొత్తం టైమ్ టేబుల్ వివరాలను ఈ లింక్ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి:

FEB REVISED 40 DAYS PLAN-converted(1)