Monday, November 18

CURRENT AFFAIRS FEB 28

తెలంగాణ
01) పిల్లల్లో రక్తహీనత సమస్య తప్పించేందుకు మధ్యాహ్న భోజన పథకంలో ఏ ఖనిజం కలిసిన బియ్యం, ఇతర ఆహార పదార్థాలను అందించాలని జాతీయ పోషకాహార సంస్థ నిపుణులు తెలిపారు ?
జ: ఐరన్
02) రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శిగా ఎవర్ని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ?
జ: బి. జనార్ధన్ రెడ్డి
03) తెలంగాణలో గిరిజనుల విచారణ కమిషన్ ఛైర్మన్ పదవికి రాజీనామా చేసింది ఎవరు ?
జ: రాజా చెల్లప్ప
04) ఉత్తమ పాలన అందించినందుకు ఇండియన్ ఎక్స్ ప్రెస్ గ్రూపు జాతీయ అవార్డుకు ఎవరు ఎంపికయ్యారు ?
జ: జగిత్యాల కలెక్టర్ శరత్

జాతీయం
05) పాకిస్తాన్ విమానాలను అడ్డుకునే క్రమంలో భారత్ కు చెందిన మిగ్ 21 విమానం కూలి ఆ దేశసైనికులకు చిక్కిన వింగ్ కమాండర్ ఎవరు ?
జ: అభినందన్
06) 1949లో కుదిరిన జెనీవా ఒప్పందంపై ఎన్ని దేశాలు సంతకాలు చేశాయి ?
జ: 196 దేశాలు
07) దక్షిణ మధ్య రైల్వే నుంచి విడదీస్తూ విశాఖ కేంద్రంగా ఏర్పడిన కొత్త రైల్వే జోన్ పేరేంటి ?
జ: దక్షిణ కోస్తా రైల్వే జోన్
08) దక్షిణ మధ్య రైల్వేలో ప్రస్తుతం ఎన్ని డివిజన్లు మిగిలాయి ?
జ: సికింద్రాబాద్, హైదరాబాద్, నాందేడ్
09) దక్షిణ మధ్య రైల్వే ఆదాయం ప్రస్తుతం రూ.11వేల కోట్లుగా ఉంది. దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పడటంతో ఆదాయంలో ఎన్ని వేల కోట్లు కోత పడనుంది ?
జ: రూ.5 వేల కోట్లు
10) భారత్ పాకిస్తాన్ మధ్య నడుస్తున్న సంఝౌతా ఎక్స్ ప్రెస్ రైలును రద్దు చేశారు. అయితే ఈ ట్రైన్ ఏ రెండు స్టేషన్ల మధ్య నడుస్తోంది ?
జ: ఢిల్లీ - అటారీ
11) ఏపీలోని విశాఖపట్నం తీరంలో కొలువుదీరనున్న మరో యుద్ధ విమానం పేరేంటి ?
జ: సీహారియర్
(నోట్: ఇప్పటికే విశాఖలో జలాంతర్గామి INS కురుసురా, TU-142 యుద్ధ విమానం ఉన్నాయి )
12) 1980లో భారత్ కి వచ్చిన సీహారియర్ యుద్ధ విమానాన్ని ఏ కంపెనీ తయారు చేసింది ?
జ: బ్రిటన్ కు చెందిన హాకర్ సిడెల్లీ బ్రిటీష్ ఏరో స్పేస్ సంస్థ
13) సీహారియర్ యుద్ధ విమానం ఏయే యుద్ధ నౌకల మీద నుంచి విన్యాసాలు చేయగలదు
జ: INS విరాట్, INS విక్రాంత్
14) ఇండియా నెక్ట్స్ 2018 ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో పీవీ నర్సింహారావు నాయకత్వం, లైఫ్ టైమ్ ఎచీవ్ మెంట్ అవార్డును మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఎవరికి ప్రదానం చేశారు ?
జ: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు
15) క్యాన్సర్ చికిత్సలో ఉపయోగించే ఎన్ని రకాల నాన్ షెడ్యూల్డ్ ఔషధాలను ధరల నియంత్రణ పరిధిలోకి తెస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది ?
జ: 42 క్యాన్సర్ ఔషధాలు
16) ఢిల్లీలో జరుగుతున్న ISSF ప్రపంచ కప్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్ డ్ ఈవెంట్ లో స్వర్ణం దక్కించుకున్న జోడీ ఎవరు ?
జ: సౌరభ్ చౌదరి, మను బాకర్

అంతర్జాతీయం
17) అణ్వాయుధాల తగ్గింపు విషయమై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తరకొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ మధ్య శిఖరాగ్ర చర్చలు జరుగుతున్నాయి ?
జ.: వియత్నాం రాజధాని హనోయిలో ( సోఫిటెల్ లెజండ్ మెట్రోపోల్ హోటల్)
18) 5G పరిజ్ఞానంతో ప్రపంచంలోనే రోబోలతో శస్త్ర చికిత్స చేసే పరిజ్ఞానాన్ని ఎక్కడ అమలు చేయబోతున్నారు
జ: బార్సిలోనా (స్పెయిన్)
19) ప్రపంచంలోనే అతి బుల్లి నవజాత శిశువు (268 గ్రాములు) ఎక్కడ పుట్టాడు ?
జ: జపాన్ రాజధాని టోక్యోలో

తక్కువ టైమ్ లో మీరు మెయిన్స్ కి ప్రిపేర్ అయ్యేలా మా మాక్ టెస్టులు ఉపయోగపడతాయి. మెయిన్స్ కోసం (1) స్టేట్ మెంట్స్ (2) జతపరచండి (3) కాలక్రమంలో రాయండి మోడల్స్ లో ఇస్తున్నాం. (మెయిన్స్ ఎగ్జామ్స్ కంటే ముందే మాక్ టెస్టులు పూర్తయ్యేలా ప్లాన్ చేస్తున్నాం.. )

SI/PC(M)/GR.1,2,3 - 325 TESTS ( Telugu Medium)

మీరు మా మాక్ టెస్టులు, గ్రాండ్ టెస్టులకు ఫీజులు చెల్లించడానికి ఈ కింది లింక్ క్లిక్ చేయండి

https://telanganaexams.com/mocktests/