Monday, November 18

CURRENT AFFAIRS – FEB 23

తెలంగాణ
01) ఓటాన్ అకౌంట్ బడ్జెట్ 2019-20ని ఎన్ని కోట్లతో ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభలో ప్రవేశపెట్టారు ?
జ: 1.82 లక్షల కోట్లు (1,82,017 కోట్లు)
02) నిర్వహణ, ప్రగతి పద్దుల కింద బడ్జెట్ లో ఎంత మొత్తం కేటాయించారు ?
జ: నిర్వహణ : రూ.1,31,629 కోట్లు, ప్రగతి పద్దు : 32,815 కోట్లు
03) 2019-20 రాష్ట్ర బడ్జెట్ లో సంక్షేమ శాఖలకు ఎంత మొత్తం కేటాయించారు ?
జ: రూ.29,507.45 కోట్లు
04) బడ్జెట్ లో సాగునీటి రంగానికి ప్రభుత్వం ప్రాధాన్యత కల్పించింది. ఈ రంగానికి కేటాయించిన మొత్తం ఎంత ?
జ: రూ.22,500 కోట్లు
05) వృద్దాప్య ఫించన్ (ఆసరా) ఫించన్ దారుల కనీస వయస్సును 60యేళ్ళ నుంచి ఎంతకు తగ్గించారు ?
జ: 57 యేళ్లకి
06) 2019-20 సంవత్సరపు బడ్జెట్ లో కేంద్ర పన్నుల్లో ఎంత వాటా వస్తుందని ప్రభుత్వం అంచనా వేసింది ?
జ: రూ.20,583.05 కోట్లు
07) పుల్వామా వీర జవాన్ల (40) కుటుంబాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంత మొత్తం పరిహారం ప్రకటించారు ?(ఒక్కో కుటుంబానికి)
జ: రూ.25 లక్షలు చొప్పున
08) ఉపసభాపతిగా నామినేషన్ వేస్తున్న పద్మారావు గౌడ్ ఏ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలిచారు ?
జ: సికింద్రాబాద్ ఎమ్మెల్యే
09) రాష్ట్ర శాసనసభలో ప్యానల్ స్పీకర్లుగా ఎవరెవరిని నియమితుస్తున్నట్టు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు ?
జ: సబితా ఇంద్రారెడ్డి (కాంగ్రెస్), ముంతాజ్ అహ్మద్ ఖాన్ (మజ్లిస్), రెడ్యా నాయక్ ( టీఆర్ఎస్), హన్మంత్ షిండే ( టీఆర్ఎస్)
(నోట్: స్పీకర్ లేనప్పుడు వీరు శాసనసభా కార్యకలాపాలను నిర్వహిస్తారు )
10) రాష్ట్రంలో మొత్తం ఎంతమంది ఓటర్లు ఉన్నట్టు తుది జాబితా తర్వాత ఎన్నిక కమిషన్ ప్రకటించింది ?
జ: 2,95,18,964 ( 2.95 కోట్ల మంది )
11) రాష్ట్రంలోని 2.95 కోట్ల మంది ఓటర్లలో పురుషులు, స్త్రీలు ఎంతమంది ?
జ: పురుషులు: 1,48,42,619 మంది, స్త్రీలు : 1,46,74,977 మంది
12) పౌరసేవలను సకాలంలో సమర్థంగా నిర్వహిస్తున్నందుకు ఏ సంస్థకి డిజిటల్ ఇండియా 2018 అవార్డు దక్కింది ?
జ: హైదరాబాద్ మహానగర పాలక సంస్థ ( GHMC)
(నోట్: స్థానిక సంస్థలకు చెందిన Outstanding Initiation విభాగంలో ప్లాటినమ్ ఐకాన్ పురస్కారం దక్కింది)
13) జిల్లాకు చెందిన విభాగంలో పూర్తి సమాచారంతో వెబ్ రత్న విభాగంలో గోల్డెన్ ఐకాన్ అవార్డుకి ఎంపికైన జిల్లా ఏది ?
జ: మహబూబ్ నగర్ జిల్లా
14) ప్రపంచంలోని జీవశాస్త్ర రంగంలో పనిచేస్తున్న సంస్థలను ఒకే వేదిక మీదకి తీసుకొచ్చేందుకు ఉద్దేశించిన ఏ సదస్సు 2019 ఫిబ్రవరి 25 నుంచి 27 వరకూ హైదరాబాద్ లో జరుగుతోంది ?
జ: బయో ఏషియా 2019
15) నాణ్యత హామీ (క్వాలిటీ అస్యూరెన్స్) రంగంలో సేవలు అందిస్తున్న నిపుణులను ప్రోత్సహించేందుకు ఆసియా ఇంక్ 400 క్వాలిటీ ఇంజనీరింగ్ సదస్సు హైదరాబాద్ లో ఎక్కడ జరిగింది ? ( 2019 ఫిబ్రవరి 22న)
జ: టీ-హబ్ లో
16) శతాధిక చిత్ర దర్శకుడు కోడి రామకృష్ణ కన్నుమూశారు. ఆయన తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో మొత్తం ఎన్ని చిత్రాలకు దర్శకత్వం వహించారు ?
జ: 140 చిత్రాలకు

జాతీయం
17) అంతర్జాతీయ సహకారం, ప్రపంచ ఆర్థిక ప్రగతికి సహకరిస్తున్నందుకు 2018 వ సంవత్సర సియోల్ శాంతి పురస్కారం ఎవరికి దక్కింది ?
జ: ప్రధాని నరేంద్ర మోడీ
18) ప్రధాని నరేంద్ర మోడీకి సియోల్ శాంతి పురస్కారం ప్రదానం చేసిన దేశం ఏది ?
జ: దక్షిణ కొరియా
19) సియోల్ పురస్కారం కింద ఇచ్చిన రెండు లక్షల డాలర్లు ( రూ.1.40 కోట్లు) దేనికి విరాళంగా ఇస్తున్నట్టు ప్రధాని మోడీ ప్రకటించారు ?
జ: గంగా నది ప్రక్షాళనకు ఉద్దేశించిన నమామి గంగే ప్రాజెక్టుకు
20) భారత్ పాకిస్తాన్ మధ్య సింధు నదీ జలాల ఒప్పందం ఎప్పుడు కుదిరింది ?
జ: 9 సెప్టెంబర్, 1960లో
21) ప్రతి యేటా ఎంత నీటిని పాకిస్తాన్ కి భారత్ త్యాగం చేస్తోంది ?
జ: 5900 ట్రిలియన్ మీటర్ల క్యూబిక్ అడుగుల నీరు
22) జమ్మూకశ్మీర్ మీదుగా ప్రవహించే చీనాబ్, జీలం, సింధు నదీ జలాలతో పాకిస్తాన్ లోని పంజాబ్, సింధు ప్రాంతాల్లో ఎంత మేర విస్తీర్ణంలో వ్యవసాయం పండుతోంది ?
జ: 1,10,000 చ.కి.మీ.
23) భారత తొలి హెవీ లిఫ్ట్ హైబ్రిడ్ డ్రోన్ ( HLH) ను ఎక్కడ జరుగుతున్న వైమానిక ప్రదర్శనలో ఆవిష్కరించారు ?
జ: బెంగళూరు
24) HLH ఎవరు తయారు చేశారు ?
జ: భారత్ కు చెందిన పయర్ జెట్, స్పెయిన్ కు చెందిన డ్రోన్ హాపర్
25) భారత సైన్యానికి మరో మూడు ధృవ అధునాతన తేలికపాటి హెలికాప్టర్లను బెంగళూరులోఅందజేశారు. వీటిని ఏ సంస్థ తయారు చేస్తోంది ?
జ: హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL)
26) రెండు శక్తివంతమైన యంత్రాలతో యుద్ధ విమానం మాదిరిగే పనిచేసే, స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ధృవ ALH ఎన్ని టన్నుల బరువు ఉంటుంది ?
జ: 5.5 టన్నలు
27) ప్రస్తుతం నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు ఎవరు ?
జ: రాజీవ్ కుమార్
28) సాంకేతిక ఆధారిత ఆవిష్కరణలతో సేవలు అందిస్తున్నందుకు ఇండియన్ బ్యాంక్ ఆఫ్ అసోసియేషన్ ( IBA) నుంచి అవార్డు అందుకున్న ఏపీ మహేశ్ బ్యాంక్ హెడ్డాఫీస్ ఎక్కడ ఉంది ?
జ: హైదరాబాద్
29) హైదరాబాద్ లో జరిగిన ముస్తాక్ అలీ ట్రోఫీలో నాగాలాండ్ పై 179 పరుగుల విజయం ద్వారా ప్రపంచ రికార్డు సాధించిన జట్టు ఏది ?
జ: ఆంధ్ర జట్టు
30) IPL 12 వ సీజన్ 2019 మార్చి 23న ప్రారంభమవుతుంది. అయితే పుల్వామా దాడితో ఈ సీజన్ ప్రారంభ వేడుకలను రద్దు చేశారు. దానికి కేటాయించిన ఎంత మొత్తాన్ని జవాన్ల మృతుల కుటుంబాలకు ఇవ్వాలనిి BCCI నిర్ణయించింది ?
జ: రూ.5కోట్లకు పైగా

అంతర్జాతీయం
31) పుల్వామా ఉగ్రదాడికి కారణమైన జేష్ ఎ మహ్మద్ ఉగ్రవాద సంస్థ ప్రధాన కార్యాలయంలో పాకిస్తాన్ లో ఎక్కడ ఉంది ?
జ: బహావల్ పూర్ (లాహోర్ కి 400కిమీ దగ్గర్లో - పంజాబ్ రాష్ట్రంలో )
32) ఉగ్రవాద సంస్థలకు ఆర్థిక సాయం అందిస్తున్న కారణంగా పాకిస్తాన్ ను ఏ లిస్ట్ లో కొనసాగిస్తున్నట్టు ఆర్థిక చర్యల కార్యదళం ( FATF) ప్రకటించింది ?
జ: గ్రే లిస్ట్
33) ముందస్తు చెకింగ్స్ లేకుండా TSA ప్రీచెక్ కోసం భారత్ కు చెందిన ఏ విమానయాన సంస్థకి అమెరికా వెసులుబాటు కల్పించింది ?
జ: ఎయిర్ ఇండియా

తక్కువ టైమ్ లో మీరు మెయిన్స్ కి ప్రిపేర్ అయ్యేలా మా మాక్ టెస్టులు ఉపయోగపడతాయి. మెయిన్స్ కోసం (1) స్టేట్ మెంట్స్ (2) జతపరచండి (3) కాలక్రమంలో రాయండి మోడల్స్ లో ఇస్తున్నాం. (మెయిన్స్ ఎగ్జామ్స్ కంటే ముందే మాక్ టెస్టులు పూర్తయ్యేలా ప్లాన్ చేస్తున్నాం.. )

SI/PC(M)/GR.1,2,3 - 325 TESTS ( Telugu Medium)

మీరు మా మాక్ టెస్టులు, గ్రాండ్ టెస్టులకు ఫీజులు చెల్లించడానికి ఈ కింది లింక్ క్లిక్ చేయండి

https://telanganaexams.com/mocktests/

మొత్తం టైమ్ టేబుల్ వివరాలను ఈ లింక్ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి:

FEB REVISED 40 DAYS PLAN-converted(1)