Monday, November 18

CURRENT AFFAIRS – FEB 20

తెలంగాణ
01) రాష్ట్రంలో మంత్రి వర్గ విస్తరణ తర్వాత ఎవరి దగ్గర ఏ శాఖలు ఉన్నాయి ?
జ: 1) జగదీష్ రెడ్డి - విద్యా శాఖ

2) తలసాని శ్రీనివాస్ యాదవ్ - పశుసంవర్థక శాఖ

3) నిరంజన్ రెడ్డి - వ్యవసాయ శాఖ

4) ఎర్రబెల్లి దయాకర్ రావు - పంచాయతీ రాజ్ శాఖ

5) ఈటల రాజేందర్ - వైద్య, ఆరోగ్య శాఖ

6) కొప్పుల ఈశ్వర్ - సంక్షేమ శాఖ

7) ఇంద్రకరణ్ రెడ్డి - అటవీ, న్యాయ, దేవాదాయ శాఖ

8) సీహెచ్ మల్లారెడ్డి - కార్మిక శాఖ

9) శ్రీనివాస్ గౌడ్ - ఎక్సైజ్, క్రీడలు, టూరిజం, యువజన సర్వీసులు

10) వేముల ప్రశాంత్ రెడ్డి - రోడ్లు, భవనాలు, రవాణా శాఖ

11) మహమూద్ అలీ - డిప్యూటీ సీఎం - హోంశాఖ

02) ఈసారి రాష్ట్ర బడ్జెట్ ను ఎవరు ప్రవేశపెట్టనున్నారు ?
జ: ముఖ్యమంత్రి కేసీఆర్
03) రాష్ట్రంలో పర్యటించిన 15వ ఆర్థిక సంఘం ఛైర్మన్ ఎవరు ?
జ: ఎన్. కె. సింగ్
04) బాల్యపు క్యాన్సర్ గా పరిగణించే ఆక్యూట్ లింఫోబ్లాస్టిక్ ల్యుకేమియాను నయం చేసేందుకు పనికివచ్చే అంటార్కిటికా శిలీంధ్రం నుంచి కనుగొన్నారు దాని పేరేంటి ?
జ: ఎల్ - ఆస్పర్ జినేజ్
05) ఈ ఎల్ -ఆస్పర్ జినేజ్ కారకాన్ని కనుగొన్న పరిశోధకులు ఎవరు ?
జ: హైదరాబాద్ ఐఐటీ
06) మేడారంలో మహాజాతర ముగిశాక ఏడాదికి ఏ రోజున పూజారులు మండ మలిగే పండగను నిర్వహిస్తారు ?
జ: మాఘమాసం శుద్ధ పౌర్ణమి నాడు (దీన్నే మేడారం చిన్న జాతర అంటారు )
07) హైదరాబాద్ లో రూ.290కోట్లతో విమాన విడిభాగాలను తయారు చేసేందుకు ముందుకు వచ్చిన సంస్థ ఏది ?
జ: ఫ్రాన్స్ కు చెందిన సఫ్రాన్ సంస్థ
08) సఫ్రాన్ సంస్థ విమాన లీఫ్ టర్భో ఫ్యాన్ ఇంజిన్ల విడిభాగాలను ఎక్కడ తయారు చేయనుంది ?
జ: శంషాబాద్ లోని GMR ప్రత్యేక ఆర్థికమండలిలో

జాతీయం
09) భారత్ కు చేరుకున్న సౌదీ అరేబియా యువ రాజు ఎవరు ?
జ: మహ్మద్ బిన్ సల్మాన్
10) ఇకపై ఎన్ని నెలలు చందా ప్రీమియం చెల్లించిన వారికి ESIC సూపర్ స్పెషాలిటీ వైద్యం అందుబాటులోకి రానుంది ?
జ: 6 నెలలు
11) కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2019 జనవరి 1 నుంచి ఎంత శాతం కరువు భత్యాన్ని ప్రభుత్వం పెంచింది ?
జ: 3శాతం
(నోట్ : ఇప్పటికే ఉన్న 9శాతం డీఏకి అదనం. దీంతో 48.41 లక్షల మంది ఉద్యోగులు, 62.03 లక్షల మంది ఫించన్ దారులకు లబ్ది చేకూరుతుంది )
12) రైతులు బంజరు భూముల్లో సౌర విద్యుత్ కేంద్రాలు ఏర్పాటు చేసుకొని విద్యుత్ ను విక్రయించే ఏ పథకాన్ని తీసుకురావాలని కేంద్ర మంత్రి మండలి నిర్ణయించింది ?
జ: కుసుం పథకం
13) 2022 కల్లా అందరికీ ఇళ్ళు సమకూరాలన్న లక్ష్యంతో 2019-20, 2021-22 సంవత్సరాల్లో కొత్తగా 1.95 కోట్ల ఇళ్ళు నిర్మించాలని కేబినెట్ ఆమోదించింది. ఈ పథకం పేరేంటి ?
జ: ప్రధానమంత్రి ఇందిరా ఆవాస్ యోజన
14) మధ్యాహ్న భోజనం పథకం కింద ప్రస్తుతం ఒక్కో విద్యార్థికి ఇస్తున్న రూ.4.35 ను ఎంతకు పెంచేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది ?
జ: రూ.6.51 పైసలు
15) కేంద్ర మంత్రి మండలి ఆమోదించిన జాతీయ ఎలక్ట్రానిక్స్ విధానం - 2019 లక్ష్యాలు ఏవి ?
1) ఎలక్ట్రానిక్ సిస్టం, డిజైన్, ఉత్పత్తి రంగంలో భారత్ ను ప్రపంచ కేంద్రంగా తీర్చిదిద్దాలన్నదే లక్ష్యం
2) 2025 నాటికి ఎలక్ట్రానిక్ సిస్టమ్, డిజైన్, ఉత్పత్తి రంగంలో రూ.26వేల కోట్ల ఎగుముతలు సాధించడం లక్ష్యం
3) 2025 నాటికి రూ.13 లక్షల కోట్ల విలువైన వంద కోట్ల మొబైల్ ఫోన్లు తయారు చేయడం. వీటిల్లో రూ.7లక్షల కోట్ల విలువైన ఫోన్లు ఎగుముతి చేయడం
4) ఈ రంగంలో 2025 నాటికి దేశంలో కోటి ఉద్యోగాలు సృష్టించాలన్నది ప్రభుత్వ లక్ష్యం
16) ఓటర్లంతా తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు దేశంలోని ఎన్ని రేడియో కేంద్రాల ద్వారా (11 భాషల్లో) చైతన్యం తేవాలని నిర్ణయించిన కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది.
జ: 72 MF రేడియో కేంద్రాలు
17) తెలుగు రాష్ట్రాల్లో కార్యక్రమాలను రూపొందిస్తున్న యూనివర్సిటీ ఏది ?
జ: HCU
18) స్టార్టప్ కంపెనీల్లో ఏంజెల్ ట్యాక్స్ మినహాయింపు పెట్టుబడి పరిమితిని కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న రూ.10కోట్ల నుంచి ఎంతకు పెంచింది ?
జ: రూ.25 కోట్లు
19) ఢిల్లీలో ఎస్టీ కమిషన్ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహించారు. ఈ కాార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పాల్గొన్నారు.
జ: 2019 ఫిబ్రవరి 18

అంతర్జాతీయం
20) ఎప్పటి కల్లా అంగారుకుడిపైకి మానవ సహిత అంతరిక్ష యాత్రను చేపడుతున్నట్టు అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా) ప్రకటించింది ?
జ: 2030 మధ్యకల్లా
21) అమెరికాలో ఎమర్జన్సీ విధించడాన్ని వ్యతిరేకిస్తూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై ఎన్ని రాష్ట్రాలు దావా వేశాయి ?
జ: 16 రాష్ట్రాలు

తక్కువ టైమ్ లో మీరు మెయిన్స్ కి ప్రిపేర్ అయ్యేలా మా మాక్ టెస్టులు ఉపయోగపడతాయి. మెయిన్స్ కోసం (1) స్టేట్ మెంట్స్ (2) జతపరచండి (3) కాలక్రమంలో రాయండి మోడల్స్ లో ఇస్తున్నాం. (మెయిన్స్ ఎగ్జామ్స్ కంటే ముందే మాక్ టెస్టులు పూర్తయ్యేలా ప్లాన్ చేస్తున్నాం.. )

SI/PC(M)/GR.1,2,3 - 325 TESTS

మీరు మా మాక్ టెస్టులు, గ్రాండ్ టెస్టులకు ఫీజులు చెల్లించడానికి ఈ కింది లింక్ క్లిక్ చేయండి

https://telanganaexams.com/mocktests/

మొత్తం టైమ్ టేబుల్ వివరాలను ఈ లింక్ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి:

FEB REVISED 40 DAYS PLAN-converted(1)