Monday, November 18

CURRENT AFFAIRS – FEB 18 & 19

తెలంగాణ
01) రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన ములుగు, నారాయణ్ పేట జిల్లాలకు ఎవరు ఇంఛార్జ్ కలెక్టర్లుగా బాధ్యతలు స్వీకరించారు ?
జ: నారాయణపేట్ - రోనాల్డ్ రోస్, ములుగు - వెంకటేశ్వర్లు
02) రాష్ట్రంలో హరియానాకి చెందిన ఏ ఆవుల పెంపకానికి వాతావరణం అనుకూలంగా ఉన్నట్టు తెలంగాణ రాష్ట్ర పశుగణాభివృద్ధి గుర్తించింది ?
జ: సాహివాల్
03) సాహివాల్ ఆవుల పెంపకాన్ని (5 ఆవులు కొనుగోలు చేస్తున్నారు ) ఏయే జిల్లాల్లో పైలట్ ప్రాజెక్ట్ గా అమలు చేయనున్నారు ?
జ: నల్గొండ, మహబూబ్ నగర్, మెదక్, ఖమ్మం జిల్లాలు
04) తెలంగాణ రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా ఎవరిని గవర్నర్ నియమించారు ?
జ: జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్
05) రాష్ట్రంలోని మున్సిపాలిటీలో ఆస్తి పన్నుల ఎగవేతను అడ్డుకునేందుకు ఉద్దేశించిన ఏ ప్రాజెక్టుకు ప్రధాని అవార్డు దక్కింది ?
జ: పురపాలక ఆస్తుల మ్యాపింగ్ ప్రాజెక్ట్
06) ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ( పీఎం-కిసాన్) పథకం కింద రాష్ట్రంలోని 10 లక్షల మంది రైతులకు ఎంతమొత్తం చొప్పున కేంద్ర ప్రభుత్వ జమ చేయనుంది ?
జ: రూ.2 వేలు చొప్పున
07) రాష్ట్రంలో ఎప్పటి లోగా జడ్పీ ఛైర్ పర్సన్ల ఎన్నిక పూర్తి కానుంది ?
జ: 2019 జూన్ 10 లోగా

జాతీయం
08) అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికులు, చిరుద్యోగుల కోసం ఉద్దేశించిన ఫించన్ పథకం ఇటీవలే అమల్లోకి వచ్చింది. దాని పేరేంటి ?
జ: ప్రధానమంత్రి శ్రమ యోగి మాన్ ధాన్ ( PMSYM)
09) ప్రస్తుత CRPF డైరక్టర్ జనరల్ ఎవరు ?
జ: ఆర్ ఆర్ భట్నాగర్
10) గడచిన ఐదేళ్ళల్లో ప్రభుత్వ ప్రచార కార్యక్రమాలకు ఎంత మొత్తం ఖర్చయింది ?
జ: రూ.3,044 కోట్లు
11) అరుదైన నిజాం నగలను ఢిల్లీలో ఎక్కడ ప్రదర్శనకు పెట్టారు ?
జ: నేషనల్ మ్యూజియంలో (ఇప్పటికి 3సార్లు ఇక్కడ ప్రదర్శించారు. 2001లో, 2007లో)
12) మొత్తం ఎన్ని రకాల నిజాం నగలు ఢిల్లీలోని నేషనల్ మ్యూజియంలో ప్రదర్శనకు పెట్టారు
జ: 173 రకాలు
13) బీమా రక్షణతో పాటు పొదుపు కూడా కలసి ఉండే మైక్రో బీమా పాలసీని LIC అమల్లోకి తెచ్చింది. దాని పేరేంటి ?
జ: మైక్రో బచత్
14) అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు అనేక హెల్ప్ లైన్ నంబర్లకు ఫోన్ చేసే బదులు ఇకపై ఒకే నెంబర్ ను కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. ఆ నెంబర్ ఎంత ?
జ: 112
15) అత్యవసర సమయాల్లో గతంలో అమల్లో ఉన్న నెంబర్లు ఏవి ?
జ: పోలీస్ - 100, అగ్నిమాపక శా్ - 101, ఆరోగ్యం - 108, మహిళల హెల్ప్ డెస్క్ 1090
16) అత్యవసర సమయాల్లో సాయం కోసం చేసే హెల్ప్ లైన్ నెంబర్. 112ను దేశంలోని ఎన్ని రాష్ట్రాల్లో 2019 ఫిబ్రవరి 19 నుంచి అమల్లోకి తెచ్చారు ?
జ: 16 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు
17) 112 ఇండియా యాప్ ను డౌన్లోడ్ చేసుకొని ఆపదలో ఉన్న మహిళలు ఏ బటన్ నొక్కితే అత్యవసర సాయం అందుతుంది ?
జ: షౌట్ ఫీచర్
18) మన దేశానికి చెందిన EMI శాట్ తో పాటు 29 విదేశీ ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టేందుకు ఉద్దేశించిన PSLV-C45 ప్రయోగాన్ని శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీశ్ ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి ప్రయోగించనున్నారు ?
జ: 2019 మార్చి 21న

అంతర్జాతీయం
19) గాల్లోని కాలుష్య కారకాలు ఇకపై ఇంట్లోకి రాకుండా స్మార్ట్ కిటికీలను ఏ దేశానికి చెందిన శాస్త్రవేత్తలు రూపొందించారు ?
జ: చైనా సైన్స్ అండ్ టెక్నాలజీ వర్సిటీ ( USTC)
20) (నోట్: పాదర్శకంగా ఉండే సిల్వర్-నైలాన్ ఎలక్ట్రోడ్లతో కిటికీకి మెష్ అల్లి, దానికి థర్మోక్రోమిక్ పూతను అద్దారు)
నగదు అక్రమ చలామణికి పాల్పడినట్టు వచ్చిన ఆరోపణల్లో అరెస్ట్ అయిన మాల్దీవుల మాజీ అధ్యక్షుడు ఎవరు ?
జ: అబ్దుల్లా యమీన్

తక్కువ టైమ్ లో మీరు మెయిన్స్ కి ప్రిపేర్ అయ్యేలా మా మాక్ టెస్టులు ఉపయోగపడతాయి. మెయిన్స్ కోసం (1) స్టేట్ మెంట్స్ (2) జతపరచండి (3) కాలక్రమంలో రాయండి మోడల్స్ లో ఇస్తున్నాం. (మెయిన్స్ ఎగ్జామ్స్ కంటే ముందే మాక్ టెస్టులు పూర్తయ్యేలా ప్లాన్ చేస్తున్నాం.. )

SI/PC(M)/GR.1,2,3 - 325 TESTS

మీరు మా మాక్ టెస్టులు, గ్రాండ్ టెస్టులకు ఫీజులు చెల్లించడానికి ఈ కింది లింక్ క్లిక్ చేయండి

https://telanganaexams.com/mocktests/

మొత్తం టైమ్ టేబుల్ వివరాలను ఈ లింక్ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి:

FEB REVISED 40 DAYS PLAN-converted(1)