Monday, November 18

CURRENT AFFAIRS – FEB 16 & 17

తెలంగాణ
01) రాష్ట్రంలో కొత్తగా ఏయే జిల్లాల ఏర్పాటుతో మొత్తం 33 జిల్లాలకు చేరాయి ?
జ: ములుగు, నారాయణపేట
02) కొత్తగా ఏర్పడ్డ ములుగు, నారాయణపేట జిల్లాల్లో ఎన్ని మండలాలు, గ్రామాలు ఉన్నాయి ?
జ: ములుగు: 9 మండలాలు, 336 గ్రామాలు,
నారాయణపేట : 11 మండలాలు, 246 గ్రామాలు
03) ప్రత్యామ్నాయ అడవుల పెంపకం, నిధుల ఖర్చుపై పర్యవేక్షణకు తెలంగాణ కంపా ( కాంపెన్ సేటరీ ఎఫారెస్టేషన్ మేనేజ్ మెంట్ ప్లానింగ్ అథారిటీ ) ఏర్పాటైంది. దీనికి ఛైర్మన్ గా ఎవరు వ్యవహరిస్తారు ?
జ: ముఖ్యమంత్రి ( సీఎం కేసీఆర్ )
04) చిన్న వయస్సులోనే ఎవరెస్ట్ శిఖరం అధిరోహించిన తెలంగాణ బిడ్డ మలావత్ పూర్ణ మరో ప్రపంచ రికార్డును సాధించింది. అర్జెంటీనాలో అకాన్కాగో పర్వతాన్ని అధిరోహించిన తొలి గిరిజన యువతిగా గుర్తింపు పొందింది. దీని ఎత్తు ఎంత ?
జ: 6,692 మీటర్లు
05) కేంద్ర పట్టణ గృహ నిర్మాణ శాఖ నుంచి స్వచ్ఛత ఎక్స్ లెన్సీ పురస్కారం అందుకున్న రాష్ట్రానికి చెందిన మున్సిపల్ కార్పోరేషన్ ఏది ?
జ: GHMC (హైదరాబాద్ మహానగర్ పాలక సంస్థ )
06) అమెరికాకి చెందిన బహుళజాతి కంపెనీ బెర్కషైర్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ ఇచ్చే ఇండియాస్ బెస్ట్ కంపెనీ పురస్కారం 2018 కి ఏ సంస్థకి ప్రకటించారు ?
జ: సింగరేణి సంస్థ
07) జాతీయ ఆరోగ్య మిషన్ పథకాల ముఖ్య అధికారిగా ఎవరు నియమితులయ్యారు ?
జ: డాక్టర్ మాధవి
08) సింగరేణి సంస్థకి చెందిన కాకతీయ ఖని ఉపరితల గని-2( KTK OC-2) తవ్వకాలకు గతంలో కేంద్ర పర్యావరణశాఖ ఇచ్చిన ఆదేశాలను కొట్టివేసింది ?
జ: జాతీయ హరిత ట్రైబ్యునల్ (NGT)

జాతీయం
09) భారత్ లో తయారు అయిన తొలి సెమీ హైస్పీడ్ రైలు, వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను ప్రధాని నరేంద్ర మోడీ ఎక్కడ ప్రారంభించారు ?
జ: ఢిల్లీలో రైల్వే స్టేషన్ లో
10) రియల్ ఎస్టేట్ డెవలప్ వర్క్ అసోసియేషన్స్ ఆఫ్ ఇండియా (క్రెడాయ్ ) జాతీయ సదస్సు 2019ని 2019 ఆగస్టు 5,6,7 తేదీల్లో ఎక్కడ నిర్వహిస్తున్నారు ?
జ: ఇజ్రాయెల్
11) పుల్వామా దాడిలో చనిపోయిన సైనికుల కోసం కేంద్ర హోంశాఖ ప్రారంభించిన ఆన్ లైన్ పోర్టల్ ఏది ?
జ: భారత్ కే వీర్
12) పుల్వామా దాడితో పాకిస్తాన్ దిగుమతులపై కస్టమ్స్ డ్యూటీని ఎంతకు పెంచుతున్నట్టు కేంద్రం ప్రకటించింది ?
జ: 200శాతం డ్యూటీ
13) 2017-18 సంవత్సరంలో పాకిస్తాన్ నుంచి దిగుమతుల విలువ ఎంత ?
జ: రూ.3,482.3 కోట్లు

తక్కువ టైమ్ లో మీరు మెయిన్స్ కి ప్రిపేర్ అయ్యేలా మా మాక్ టెస్టులు ఉపయోగపడతాయి. మెయిన్స్ కోసం (1) స్టేట్ మెంట్స్ (2) జతపరచండి (3) కాలక్రమంలో రాయండి మోడల్స్ లో ఇస్తున్నాం. (మెయిన్స్ ఎగ్జామ్స్ కంటే ముందే మాక్ టెస్టులు పూర్తయ్యేలా ప్లాన్ చేస్తున్నాం.. )

SI/PC(M)/GR.1,2,3 - 40రోజుల్లో 325 TESTS

మీరు మా మాక్ టెస్టులు, గ్రాండ్ టెస్టులకు ఫీజులు చెల్లించడానికి ఈ కింది లింక్ క్లిక్ చేయండి

https://telanganaexams.com/mocktests/

మొత్తం టైమ్ టేబుల్ వివరాలను ఈ లింక్ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి:

FEB REVISED 40 DAYS PLAN-converted(1)