Monday, November 18

CURRENT AFFAIRS – FEB 12 &13

తెలంగాణ
01) రాష్ట్రంలో 30 జిల్లా పరిషత్ లతో పాటు ఎన్ని మండల పరిషత్ లు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ?
జ: 535
02) రాష్ట్రంలో మండల, జిల్లా పరిషత్ పాలకమండళ్ళ పదవీ కాలం ఎప్పటితో ముగుస్తోంది ?
జ: 2019 జులై 4,5 తేదీలతో
03) విభిన్న రాష్ట్రాల జానపద నృత్యాలు, హస్త కళాకృతులను 2019 ఫిబ్రవరి 14 నుంచి 17 వరకూ శిల్పారామంలో ప్రదర్శించనున్నారు. దక్షిణ మధ్య ప్రాంత సాంస్కృతిక కేంద్రం ఆధ్వర్యంలో జరిగే ఈ వేడుకల పేరేంటి ?
జ: ఆక్టేవ్ ( అష్టపది )
04) ఫిబ్రవరి 25 నుంచి 27 వరకూ 16వ బయో ఆసియా సదస్సు ఎక్కడ జరగనుంది ?
జ: హైదరాబాద్ లోని HICC లో

జాతీయం
05) కోర్టు ధిక్కారానికి పాల్పడినందుకు ఏ ఇద్దరు CBI అధికారులకు చెరో లక్ష జరిమానా, ఉదయం నుంచి సాయంత్రం దాకా న్యాయస్థానంలో కూర్చోవాలని సుప్రీంకోర్టు శిక్ష విధించింది ?
జ.: తాత్కాలిక డైరెక్టర్ ఎం.నాగేశ్వరరావు
న్యాయ సలహాదారు ఎస్. బాసురామ్
06) పౌరసత్వ బిల్లుకి వ్యతిరేకంగా ప్రఖ్యాత అస్సామీ గాయకుడు భూపేన్ హజారికాకి మరణానంతరం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఏ అవార్డును తిరస్కరిస్తున్నట్టు ఆయన కొడుకు తేజ్ హజారికా ప్రకటించారు ?
జ: భారత రత్న
07) 2019 ఫిబ్రవరి 25నాడు విచారణకు హాజరు కావాలని ట్విటర్ సీఈఓ జాక్ డార్ఫీకి సమన్లు జారీ చేసిన పార్లమెంటరీ కమిటీకి ఎవరు నాయకత్వం వహిస్తున్నారు ?
జ: ఎంపీ అనురాగ్ ఠాకూర్
08) భారతీయ యువతులను పెళ్లిచేసుకొని ఎన్ని రోజుల్లో తప్పనిసరిగా ఇక్కడ రిజిష్టర్ చేయని NRI ల పాస్ పోర్టు రద్దు చేయాలన్న బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టారు ?
జ: 30 రోజులు (రిజిష్ట్రేషన్ ఆఫ్ మ్యారేజ్ ఆఫ్ NRI బిల్ - 2019)
09) భారత్ లో తయారీ కింద నిర్మించిన మొదటి ఇంజిన్ రహిత సెమీ హైస్పీడ్ రైలు ఫిబ్రవరి 15న పట్టాలకెక్కనుంది. దీని పేరేంటి ?
జ: వందే భారత్ ( ట్రైన్ - 18)
10) ఢిల్లీలోని కరోల్ బాగ్ లో ఓ హోటల్ లో అగ్నిప్రమాదం జరిగి 17మంది చనిపోయారు. ఆ హోటల్ పేరేంటి ?
జ: అర్పిత్ ప్యాలెస్ హోటల్
11) వినియోగదారులు కోరుకునే చెల్లింపు ఛానళ్ళ ఎంపకకి గడువును టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) ఎప్పటిదాకా పొడిగించింది ?
జ: 2019 మార్చి 31 వరకూ
12) రూ.700 కోట్లతో 72వేల రైఫిళ్ళని అమెరికా నుంచి కొనుగోలు చేసేందుకు సిగ్ సావర్ కంపెనీతో భారత్ ఒప్పందం చేసుకుంది. ఈ రైఫిళ్ళ పేరేంటి ?
జ: 7.62 MM అసాల్ట్ రైఫిల్స్
13) కెనడా ఔషధ కంపెనీ ఎపోటెక్స్ ఇంటర్నేషనల్ కు చెందిన 5 యూరప్ దేశాల్లోని వాణిజ్య కార్యకలాపాలను కొనుగోలు చేసిన భారతీయ ఫార్మా కంపెనీ ఏది ?
జ: అరబిందో ఫార్మా
14) 2019-20 సంవత్సరానికి ది ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఛార్టెర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICAI) అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు ?
జ: ప్రఫుల్ల పి. చాజెద్

అంతర్జాతీయం
15) ప్రపంచంలో 9శాతం భూభాగం కలిగిన ఏ రెండు దేశాలు వృక్ష సంపదలో అగ్రభాగాన ఉన్నాయని నేచర్ సస్టెయినబిలిటీ జర్నల్ ప్రచురించింది ?
జ: భారత్, చైనా
16) అమెరికా - మెక్సికో మధ్య గోడ నిర్మాణానికి అమెరికాలో రిపబ్లికన్లు, డెమోక్రాట్ల మధ్య ఒప్పందం కుదిరింది. వీటికి ఎంత మొత్తం కావాలని ప్రెసిడెంట్ ట్రంప్ డిమాండ్ చేస్తున్నారు.
జ: 5.7 బిలియన్ డాలర్లు ( రూ.40వేల కోట్లు )
17) గ్లోబల్ ఫైర్ పవర్ సంస్థ అంచనాల ప్రకారం అంగబలంలో ప్రపంచంలోనే మొదటిస్థానంలో నిలిచిన దేశం ఏది ?
జ: చైనా (75 కోట్లు) (రెండో స్థానం 61.6 కోట్లు ఇండియా)

తక్కువ టైమ్ లో మీరు మెయిన్స్ కి ప్రిపేర్ అయ్యేలా మా మాక్ టెస్టులు ఉపయోగపడతాయి. మెయిన్స్ కోసం (1) స్టేట్ మెంట్స్ (2) జతపరచండి (3) కాలక్రమంలో రాయండి మోడల్స్ లో ఇస్తున్నాం. (మెయిన్స్ ఎగ్జామ్స్ కంటే ముందే మాక్ టెస్టులు పూర్తయ్యేలా ప్లాన్ చేస్తున్నాం.. )

SI/PC(M)/GR.1,2,3 - 40రోజుల్లో 325 TESTS

మీరు మా మాక్ టెస్టులు, గ్రాండ్ టెస్టులకు ఫీజులు చెల్లించడానికి ఈ కింది లింక్ క్లిక్ చేయండి

https://telanganaexams.com/mocktests/

మొత్తం టైమ్ టేబుల్ వివరాలను ఈ లింక్ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి:

FEB REVISED 40 DAYS PLAN-converted(1)