Monday, November 18

CURRENT AFFAIRS – FEB 10-11

తెలంగాణ
01) సన్సద్ ఆదర్శ గ్రామ్ యోజన కింద రాష్ట్రంలో ఎన్ని పంచాయతీలను ఎంపీలు దత్తత తీసుకున్నారు ?
జ: 45 ( మొదటి విడత - 22, రెండో విడత -15, మూడో విడత-8)
02) కోర్టులో కేసు నడుస్తున్న EVM లను ఓపెన్ చేసినందుకు సస్పెండ్ అయిన వికారాబాద్ జిల్లా కలెక్టర్ ఎవరు ?
జ: సయ్యద్ ఒమర్ జలీల్
03) నేపాల్ లోని మేరా పర్వతంపై 108 సూర్య నమస్కారాలు చేసిన ఎవరికి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు దక్కింది ?
జ: మరిపెల్లి ప్రవీణ్
(నోట్: 2017లో నేపాల్ లోని 6,150 మీటర్ల ఎత్తులో ఉన్న మేరా పర్వతంపై మైనస్ 7 డిగ్రీల ఉష్ణోగ్రతలో 45 నిమిషాలు 19 సెకన్ల వ్యవధిలో 108 సూర్యనమస్కారాలు చేశారు. ఇతనిది జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలం వెల్లుల్ల గ్రామం)
04) తెలంగాణకి జాతీయ స్థాయిలో మెప్మా అవార్డు దక్కింది. ఏ విభాగంలో ఈ అవార్డు ఇచ్చారు ?
జ: వీధి వ్యాపారుల సంక్షేమం, వారి రక్షణకు చట్టాన్ని అమలు చేసినందుకు
(నోట్: తెలంగాణ మెప్నా మిషన్ డైరక్టర్ శ్రీదేవి )
05) కొలకలూరి బాగీరధి, విశ్రాంతమ్మ పురస్కారాలను ఈనెల 28న పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయంలో ఎవరికి ప్రదానం చేయనున్నారు ?
జ: భాగరధి పురస్కారం(విమర్శ కేటగిరి) - బిక్కి కృష్ణ (కవిత్వం - డిక్షన్)
విశ్రాంతమ్మ అవార్డు (పరిశోధనా విభాగం) - రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి (నుడి గుడి )
06) తెలంగాణ ప్రజాకవిగా పిలిచే మలావఝల సదాశివుడు స్మారక పురస్కారం 2018 కు ఎవరు ఎంపికయ్యారు ?
జ: ప్రముఖ సాహితీవేత్త కోడూరి విజయ్ కుమార్
(నోట్: రచనలు - అక్వేరియంలో బంగారు చేప, ఒక రాత్రి - మరొక రాత్రి )

జాతీయం
07) అఖిల భారత సాంకేతిక విద్యామండలి (AICTE) ఛైర్మన్ ఎవరు ?
జ: అనిల్ సహస్ర బుద్దే
08) భారత వైమానిక దళానికి అమెరికా నుంచి వచ్చిన నాలుగు భారీ హెలికాప్టర్లు ఏవి ?
జ: షినూక్ సైనిక హెలికాప్టర్లు
09) 40యేళ్ళ లోపు వయస్సున్న అసంఘటిత రంగంలోని కార్మికులకు ఈనెల 15 నుంచి ఏ ఫించన్ పథకాన్ని అమలు చేయనున్నారు ?
జ: ప్రధానమంత్రి శ్రమ్ యోగి మాన్ ధన్ (PMSYM)

అంతర్జాతీయం
10) తమ దేశ కోర్టు వ్యవహారాల్లో హిందీని అధికార భాషగా గుర్తిస్తూ ఉత్తర్వులు ఇచ్చిన దేశం ఏది ?
జ: అబుదాబి (అరబిక్, ఇంగ్లీష్ తో పాటు)
11) వచ్చే ఎన్నేళ్ళలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవడం వల్ల 169యేళ్ళల్లోనే హయ్యస్ట్ టెంపరేచర్స్ గా ఉంటాయని బ్రిటన్ శాస్త్రవేత్తలు అంచనా వేశారు ?
జ: 5 యేళ్ళల్లో ( 2014- 2023)
12) 2019 ఫిబ్రవరి 27, 28ల్లో ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ఉన్ తో అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ఎక్కడ సమావేశం అవుతారు ?
జ: హనోయి (వియత్నాం రాజధాని )

తక్కువ టైమ్ లో మీరు మెయిన్స్ కి ప్రిపేర్ అయ్యేలా మా మాక్ టెస్టులు ఉపయోగపడతాయి. మెయిన్స్ కోసం (1) స్టేట్ మెంట్స్ (2) జతపరచండి (3) కాలక్రమంలో రాయండి మోడల్స్ లో ఇస్తున్నాం. (మెయిన్స్ ఎగ్జామ్స్ కంటే ముందే మాక్ టెస్టులు పూర్తయ్యేలా ప్లాన్ చేస్తున్నాం.. )

SI/PC(M)/GR.1,2,3 - 40రోజుల్లో 325 TESTS

మీరు మా మాక్ టెస్టులు, గ్రాండ్ టెస్టులకు ఫీజులు చెల్లించడానికి ఈ కింది లింక్ క్లిక్ చేయండి

https://telanganaexams.com/mocktests/

మొత్తం టైమ్ టేబుల్ వివరాలను ఈ లింక్ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి:

FEB REVISED 40 DAYS PLAN-converted(1)