Wednesday, October 23

CURRENT AFFAIRS – FEB 1

తెలంగాణ
01) ఆక్వా ఎక్స్ ఇండియా 2019 ఎక్కడ ప్రారంభమైంది ?
జ: హైదరాబాద్ లోని హైటెక్స్ లో
02) రాష్ట్రంలో చెల్లప్ప కమిషన్ గడువును 2019 జులై 31 వరకూ పొడిగించారు. ఈ కమిషన్ దేనికి సంబంధించినది ?
జ: గిరిజనుల ఆర్థిక, సామాజిక పరిస్థితుల అధ్యయనం
03) ఉస్మానియా యూనివర్సిటీలో ఏ శాఖ ఏర్పాటై వందేళ్లయిన సందర్భంగా శతాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్నారు ?
జ: తెలుగు శాఖ
04) కల్వకుంట్ల కవిత ఉత్తమ పార్లమెంటేరియన్ గా కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. ఏ సంస్థ వీటిని ప్రకటించింది ?
జ: ఫేమ్ ఇండియా మ్యాగజైన్

జాతీయం
05) దేశంలో నిరుద్యోగం 45యేళ్ళ గరిష్టానికి చేరింది. పట్టణాల్లో, గ్రామాల్లో ఎంతశాతం నిరుద్యోగిత ఉన్నట్టు జాతీయ నమూనాల సర్వే కార్యాలయం ( NSSO) తేల్చింది ?
జ: పట్టణాల్లో : 7.8శాతం, గ్రామీణంలో 5.3శాతం
06) 2017-18 ఆర్థిక సంవత్సరానికి భారత వృద్ధి రేటు అంచనాలను ప్రభుత్వం సవరించింది. గతంలో 6.7శాతం వృద్ధి రేటును తాజాగా ఎంతకు సవరించారు ?
జ: 7.2 శాతం
07) రూ.31వేల కోట్ల రూపాయల రుణాల అవకతవకలపై ఏ బ్యాంకింగ్ సంస్థపై కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ దర్యాప్తు ప్రారంభించింది ?
జ: DHFL పై
08) ఢిల్లీ నగరపాలక సంస్థ హెడ్డాఫీస్ లో ఏర్పాటు చేసిన 150 చదరపు మీటర్ల మహాత్ముడి మృణ్మయ కుడ్య చిత్రాన్ని ఎవరు ఆవిష్కరించారు ?
జ: ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు
09) మహిళా సాధికారికత, సమానత్వాన్ని దృష్టిలో పెట్టుకొని ఇకపై భూగర్భ గనుల్లో మహిళలకు కూడా ప్రవేశం కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది. అందుకోసం ఏ చట్టాన్ని సవరిస్తూ కేంద్ర కార్మిక మంత్రిత్వశాఖ ఆదేశాలిచ్చిది ?
జ: గనుల చట్టం 1952
10) కొన్ని కేన్సర్ వ్యాధుల చికిత్సకు ఉపయోగించే ఏ జనరిక్ టాబ్లెట్ ను అమెరికాలో విక్రయించేందుకు హైదరాబాద్ కు చెందిన నాట్కో దరఖాస్తు చేసింది ?
జ: ఇబ్రూటినిబ్

అంతర్జాతీయం
11) కత్తి, ఇనుప రేకులు, గాజు పెంకులు గుచ్చుకొని గాయమైతే టెటనస్ టాక్సైడ్ (టీటీ) టీకా చేయించుకుంటాం. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనలతో దీన్ని ఇకపై ఏ పేరుతో సరఫరా చేయనున్నారు ?
జ: టెటనస్ డిఫ్తీరియా ( టీడీ)
12) ధనుర్వాతంతో పాటు కంఠసర్పి కూడా రాకుండా టీడీ టీకాను తయారు చేశారు. ప్రస్తుతం ఈ టీకా ఎన్ని దేశాల్లో వాడుకలో ఉంది ?
జ: 133 దేశాల్లో

SI/PC(M)/GR.1,2 & 3- 50రోజుల్లో 325 TESTS

మొత్తం టైమ్ టేబుల్ వివరాలను ఈ లింక్ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి:

50 DAYS PLAN TS SI-PC (M) & TSPSC GR.2

మీరు మాక్ టెస్టులు, గ్రాండ్ టెస్టులకు ఫీజులు చెల్లించడానికి ఈ కింది లింక్ క్లిక్ చేయండి

https://telanganaexams.com/mocktests/