Saturday, August 17

CURRENT AFFAIRS -DEC 5

తెలంగాణ
01) పదవీ విరమణ చేసిన ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి ఎవరు ?
జ: జస్టిస్ నాగార్జున రెడ్డి
02) ప్రపంచంలోనే అతిపెద్ద పరిశోధనా కేంద్రాన్ని హైదరాబాద్ లో విస్తరించనున్నట్టు తెలిపిన మొబైల్ సంస్థ ఏది ?
జ: వన్ ప్లస్ (సీఈఓ పేటే లా)
03) మాతృభాషపై ఆసక్తి పెంచేందుకు రాష్ట్ర విద్య పరిబోధన శిక్షణా సంస్థ కొత్తగా ఆన్ లైన్ లో ప్రారంభించిన తెలుగు క్విజ్ పేరేంటి ?
జ: దాసుభాషితం
04) 2018 డిసెంబర్ 21,22 తేదీల్లో ఇండియన్ కామర్స్ అసోసియేషన్ 71వ జాతీయ సదస్సును ఎక్కడ నిర్వహించనున్నారు ?
జ: హైదరాబాద్ - ఉస్మానియా యూనివర్సిటీలో

జాతీయం
05) 2018 సంవత్సరంలో దేశంలో వార్తల్లో వ్యక్తిగా ఎవరు టాప్ లో నిలిచినట్టు ప్రముఖ సెర్చింజన్ యాహూ తెలిపింది ?
జ: ప్రధాన నరేంద్ర మోడీ
06) ఏ దేశంతో కరెన్సీ మార్పిడికి భారత్ అంగీకారం కుదర్చుకుంది ?
జ: UAE
07) భారత దేశపు అతి పెద్ద బరువున్న ఉపగ్రహమైన జీ-శాట్ 11ను ఏమని పిలుస్తున్నారు ?
జ: బిగ్ బర్డ్
08) మన దేశంలో త్రివిధ దళాల్లో మెరికలతో మెరుపు దళాలను తీర్చి దిద్దారు. వాళ్ళె ఎవరెవరు ?
జ: సైన్యంలో - పారాచూట్ దళం
నౌకదళంలో - మెరీన్ కమాండోలు (మార్కోస్)
వైమానిక దళంలో - గరుడ్
09) అగస్టా వెస్ట్ ల్యాండ్ నిందితుడిని UAE భారత్ కు అప్పగించింది. అతని పేరేంటి ?
జ: క్రిస్టియన్ మిషెల్
10) అగస్టా ల్యాండ్ VVIP హెలికాప్టర్ల ఒప్పందం విలువ ఎంత ?
జ: రూ.3,600 కోట్లు
11) కృష్ణా బోర్డు ఛైర్మన్ అనారోగ్యంతో ఢిల్లీలో కన్నుమూశారు. ఆయన పేరేంటి ?
జ: ASP సిన్హా
12) ఏసీ 3 టైర్ రైళ్ళల్లో మహిళలకు ఎన్ని బెర్తులను రిజర్వ్ చేయనున్నారు ?
జ: 6 బెర్తులు
13) క్రికెట్ లో అన్ని ఫార్మాట్స్ నుంచి రిటైర్డ్ అవుతున్నట్టు ప్రకటించిన భారత జట్టు ఓపెనర్ ఎవరు ?
జ: గౌతమ్ గంభీర్
14) రిటైర్డ్ మెంట్ కు ముందు గౌతమ్ గంభీర్ ఆడిన చివరి మ్యాచ్ ఏది ?
జ: ఆంధ్రతో జరిగే రంజీ మ్యాచ్

అంతర్జాతీయం
15) 2018లో రూ.155 కోట్లతో (2.2 కోట్ల డాలర్లు) ఫోర్బ్స్ మేగజైన్ ప్రకటించిన యూట్యూబ్ లో అత్యధిక ఆదాయం పొందిన చిన్నారిగా నిలిచింది ఎవరు ?
జ: రేయాన్ ( 7యేళ్ళు)
16) హ్యాకర్లు తమ కంప్యూటర్లలోకి ప్రవేశించి పది కోట్ల మంది వినియోగదారుల సమాచారం చోరీ చేశారని ప్రకటించిన అంతర్జాతీయ వెబ్ సైట్ ఏది ?
జ: కోరా ( ప్రశ్నలు -జవాబుల వెబ్ సైట్ )
17) 2018కి ప్రతిష్టాత్మక గోల్డెన్ బాల్ (వరల్డ్ బెస్ట్ ప్లేయర్) అందుకున్న క్రొయేషియా ఫుట్ బాల్ కెప్టెన్ ఎవరు ?
జ: లుకా మోడ్రిచ్

PC/SI Mainsకి 100Mock +10 గ్రాండ్ టెస్టులు
ప్రారంభం అయ్యాయి.  ఫీజు చెల్లిస్తే 200టెస్టులు ఉచితం
https://telanganaexams.com/mocktests/

ఫ్రెండ్స్

ప్రతి రోజు మీకు www.telanganaexams.com  & www.andhraexams.com వెబ్ సైట్స్ లో అందిస్తున్న కరెంట్ ఎఫైర్స్ తో ఇకపై యూట్యూబ్ లో వీడియో ద్వారా అందిస్తున్నాం. ఇందులో స్పెషాలిటీ ఏమంటే... ఇవాళ ఇచ్చిన కరెంట్ ఎఫైర్స్ లో ముఖ్యమైన టాపిక్స్ పై మీకు వివరంగా నోట్స్ అందిస్తున్నాం.  దీంతో మీరు ఏ ఎగ్జామ్ కైనా సరే... స్టేట్ మెంట్ మోడల్స్ లో వచ్చిన ప్రశ్నలకు కూడా అవలీలగా రాసేయొచ్చు.

All the Best ( M.Vishnu Kumar, Senior Journalist)

అలాగే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కి కలిపి కరెంట్ ఎఫైర్స్ ఇక నుంచి MASTERS TV లో పెడుతున్నాం.

SUBSCRIBE అవ్వగలరు : MASTERS TV:

https://www.youtube.com/channel/UC1zxevIMCLp8vuEKe5PhlXQ

TELANGANA EXAMS: 

https://www.youtube.com/channel/UCU51N-FwR9PQJckcH0FJdiA?disable_polymer=true

ANDHRA EXAMS:

https://www.youtube.com/channel/UC2NZvwJ-Ydiavfs90Ea4Alg?disable_polymer=true