Saturday, August 17

CURRENT AFFAIRS – DEC 4

తెలంగాణ
01) రాష్ట్రంలో దివ్యాంగుల సంక్షేమానికి చేస్తున్న సేవలను కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ఏ అవార్డును ప్రకటించింది ?
జ: బెస్ట్ స్టేట్ ఇన్ ప్రమోటింగ్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్ విత్ డిజెబిలిటీ
02) రేషన్ లావాదేవీలు సామాన్యులు కూడా తెలుసుకునేలా రూపొందించిన ఏ యాప్ కి కంప్యూటర్ సొసైటీ ఆఫ్ ఇండియా ఈ గవర్నెస్ అవార్డు లభించింది ?
జ: టీ-రేషన్
(నోట్: 13 అప్లికేషన్లతో నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ సహకారంతో దీన్ని రూపొందించారు )
03) జాతీయ షూటింగ్ ఛాంపియన్షిప్ లో 2 కాంస్యాలు సాధించిన తెలంగాణ అమ్మాయిలు ఎవరు ?
జ: జాహ్రా ముఫద్దల్ దీసావాల, రష్మి రాథోడ్, దండు కాత్యాయని రాజు

జాతీయం
04) 2019 మార్చితో ముగిసే ఆర్థిక సంవత్సరానికి భారత్ జీడీపీ వృద్ధి రేటు ఎంతగా ఉంటుందని అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజ సంస్థ మూడీస్ అంచనా వేసింది ?
జ: 7.2 శాతం
05) భారత నావికాదళంలోకి త్వరలో 56 కొత్త యుద్ధ నౌకలు, ఆరు జలంతర్గాములు చేరనున్నాయి. దీంతో చైనా, పాక్ కంటే మనదే పై చేయి అవుతుందని నేవీ చీఫ్ చెబుతున్నారు. ప్రస్తుతం ఆ పదవిలో ఉన్నది ఎవరు ?
జ: నేవీ చీఫ్ అడ్మిరల్ సునీల్ లాంబా
06) ఆర్థిక మంత్రిత్వ శాఖలో ఖర్చుల విభాగం కార్యదర్శిగా ఉన్న ఎవరిని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా నియమించారు ?
జ: అజయ్ నారాయణ్ ఝా
07) జీరో బడ్జెట్ ప్రకృతి వ్యవసాయం గా రైతులు అనుసరిస్తున్న పాలేకర్ వ్యవసా విధానాన్ని ఇకపై ఏమని పేరు మారుస్తున్నారు ?
జ: సుభాష్ పాలేకర్ ప్రకృతి వ్యవసాయం
08) చరిత్రలోనే తొలిసారిగా ఏ ఏడాదిలో నిర్వహించే ఒలింపిక్స్ కి భారత్ బిడ్డింగ్ వేయనుంది ?
జ: 2032 లో జరిగే ఒలింపిక్స్
(నోట్: 2032 ఒలింపిక్స్ కి సంబంధించి బిడ్ 2022లో మొదలవుతుంది. అతిథ్య నగరం పేరును 2025లో ప్రకటిస్తారు )

అంతర్జాతీయం
09) అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్ W.H. బుష్ భౌతికకాయాన్ని వాషింగ్టన్ కి తీసుకెళ్ళేందుకు అధ్యక్షుడి అధికారిక విమానం ఎయిర్ ఫోర్స్ వన్ ని ఉపయోగిస్తున్నారు. అయితే దివంగత అధ్యక్షుడి గౌరవార్ధం ఈ విమానానికి తాత్కాలికంగా ఏమని పేరు పెట్టారు ?
జ: స్పెషల్ ఎయిర్ మిషన్ 41
10) పెట్రోలియం ఎగుమతి దేశాల సంఘం (ఒపెక్ ) నుంచి వచ్చే నెలలో వైదొలుగుతున్నట్టు ప్రకటించిన దేశం ఏది ?
జ: ఖతార్
11) ప్రస్తుతం ఏటా 7.7 కోట్ల టన్నులుగా ఉన్న సహజవాయువు ఎగుమతులను ఎంతకు పెంచాలని ఖతార్ నిర్ణయించింది ?
జ: 11 కోట్ల టన్నులు
12) రాజకీయ విభేదాలతో సౌదీ, బహ్రెయిన్, ఈజిప్టు దేశాలు ఖతార్ తో ఎప్పుడు సంబంధాలు తెంచుకున్నాయి ?
జ: 2017 జూన్ లో

PC/SI Mainsకి 100Mock +10 గ్రాండ్ టెస్టులు
ప్రారంభం అయ్యాయి.  ఫీజు చెల్లిస్తే 200టెస్టులు ఉచితం
https://telanganaexams.com/mocktests/

ఫ్రెండ్స్

ప్రతి రోజు మీకు www.telanganaexams.com  & www.andhraexams.com వెబ్ సైట్స్ లో అందిస్తున్న కరెంట్ ఎఫైర్స్ తో ఇకపై యూట్యూబ్ లో వీడియో ద్వారా అందిస్తున్నాం. ఇందులో స్పెషాలిటీ ఏమంటే... ఇవాళ ఇచ్చిన కరెంట్ ఎఫైర్స్ లో ముఖ్యమైన టాపిక్స్ పై మీకు వివరంగా నోట్స్ అందిస్తున్నాం.  దీంతో మీరు ఏ ఎగ్జామ్ కైనా సరే... స్టేట్ మెంట్ మోడల్స్ లో వచ్చిన ప్రశ్నలకు కూడా అవలీలగా రాసేయొచ్చు.

Today Topic: ఇప్పుడు పోలెండ్ లో వాతావరణ సదస్సు - అప్పుడు ప్యారిస్ వాతావరణ సదస్సులో ఏం జరిగింది ?

All the Best ( M.Vishnu Kumar, Senior Journalist)

అలాగే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కి కలిపి కరెంట్ ఎఫైర్స్ ఇక నుంచి MASTERS TV లో పెడుతున్నాం.

SUBSCRIBE అవ్వగలరు : MASTERS TV:

https://www.youtube.com/channel/UC1zxevIMCLp8vuEKe5PhlXQ

TELANGANA EXAMS: 

https://www.youtube.com/channel/UCU51N-FwR9PQJckcH0FJdiA?disable_polymer=true

ANDHRA EXAMS:

https://www.youtube.com/channel/UC2NZvwJ-Ydiavfs90Ea4Alg?disable_polymer=true