Saturday, August 17

CURRENT AFFAIRS – DEC 2 & 3

తెలంగాణ
01) నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ నేచురోపతి, ఆయుష్, తెలంగాణ రాష్ట్రం సహకారంతో సెంటర్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ యోగా అండ్ నేచురోపతి ఆధ్వర్యంలో 3 రోజుల యోగా ఫెస్ట్ ఎక్కడ జరుగుతోంది ?
జ: హైదరాబాద్ (రవీంద్ర భారతి)
02) ప్రపంచ యూత్ చెస్ ఒలింపియాడ్ లో రజతం నెగ్గిన తెలంగాణ తొలి గ్రాండ్ మాస్టర్ ఎవరు ?
జ: ఎరిగైసి అర్జున్
03) HIV చికిత్సకు సంబంధించిన కొత్త ఔషధాన్ని ఏ దేశంలో విడుదల చేసినట్టు హైదరాబాద్ కు చెందిన లారస్ ల్యాబ్స్ ప్రకటించింది ?
జ: దక్షిణాఫ్రికాలో

జాతీయం
04) జీ20 శిఖరాగ్ర సమావేశాల్లో పాల్గొన్న ప్రధాని నరేంద్రమోడీ ఆతిథ్య దేశం అర్జెంటీనా అధ్యక్షుడితో సమావేశం అయ్యారు. ఆయన పేరేంటి ?
జ: మార్సియో
05) 2022లో జి-20 సదస్సుకు ఆతిథ్యం ఇస్తున్న దేశం ఏది ?
జ: భారత్
(నోట్: ఆ ఏడాది 75వ స్వాతంత్ర్య దినోత్సవ సంబురాలను జరుపుకుంటున్నాం)
06) జీ-20 సదస్సుల్లో పాల్గొన్న భారత ప్రధాని నరేంద్ర మోడీకి అంతర్జాతీయ ఫుట్ బాట్ సమాఖ్య (ఫిఫా) అధ్యక్షుడు తన పేరుతో ఉన్న జెర్సీని బహుకరించారు. ప్రస్తుతం ఫిఫా ప్రెసిడెంట్ ఎవరు ?
జ: గియాని ఇన్ ఫాంటినో
07) 2019 జనవరి26న జరిగే గణ తంత్ర దినోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరవుతున్న దేశాధ్యక్షుడు ఎవరు ?
జ: దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమాఫోసా
08) కొత్త CEC (ప్రధాన ఎన్నికల కమిషనర్) గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు ?
జ: సునీల్ అరోరా
(నోట్: 2021 అక్టోబర్ వరకూ ఈ పదవిలో ఉంటారు )
09) సూపర్ సోనిక్ బ్రహ్మోస్ క్రూయిజ్ క్షిపణి, రెండు స్టెల్త్ ఫ్రిగేట్ యుద్ధ నౌకలతో పాటు సైనిక ఆయుధ సంపత్తి కొనుగోలుకు ఎంత మొత్తానికి కేంద్ర రక్షణ శాఖ ఆమోదం తెలిపింది
జ: రూ.3వేల కోట్లు
10) సాగునీటి ప్రాజెక్టు కోసం ఏ రాష్ట్ర ప్రభుత్వానికి షిర్డీ ట్రస్ట్ రూ.500కోట్ల రుణాన్ని మంజూరు చేసింది ?
జ: మహారాష్ట్ర ప్రభుత్వానికి
11) ప్రయోగాత్మక పరీక్షలో 180 కిలోమీటర్ల కన్నా ఎక్కువ వేగంతో పరుగులు పెట్టిన రైలు ఏది?
జ: ట్రైన్ 18
12) ONGC, ఆయిల్ ఇండియాకి చెందిన ఎన్ని గ్యాస్ -చమురు క్షేత్రాలను ప్రైవేటు, విదేశీ సంస్థలకు విక్రయించాడానికి ప్రభుత్వం ఆరుగురు సభ్యులతో ఓ కమిటీని ఏర్పాటు చేసింది ?
జ: 149 క్షేత్రాలు
(నోట్: నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ రాజీవ్ కుమార్ నాయకత్వంలో )
13) అండమాన్ దీవుల్లోని ఆదివాసీ తెగ సెంటినలీస్ తో 1999లో నెలల తరబడి జీవనం చేసినది ఎవరు ?
జ: మధుమాల ఛటోపాధ్యాయ
14) ఐక్యరాజ్యసమితిలో ఇండియన్ పర్మినెంట్ మిషన్ డిప్యూటీ చీఫ్ గా నియమితులైన ఏపీ నివాసి ఎవరు ?
జ: కాకనూరు నాగరాజు ( IFS అధికారి)
15) 2018 డిసెంబర్ 2నాటికి భోపాల్ విషవాయువు దుర్ఘటన జరిగి 34 యేళ్ళయింది. ఈ సంఘటన ఎప్పుడు జరిగింది ?
జ: 1984 డిసెంబర్ 2నాడు
16) భోపాల్ లో మిథైల్ ఐసోసైనేడ్ ( మిక్) అనే విష వాయువు వెలువడి 8వేలమంది ప్రాణాలు కోల్పోగా, 5 లక్షల మందికి పైగా విషయ వాయు ప్రభావానికి గురయ్యారు. ఈ వాయువు లీక్ అవడానికి కారణమైన పరిశ్రమ ఏది ?
జ: యూనియన్ కార్భైడ్ ఇండియా లిమిటెడ్
17) టాటా ఓపెన్ ఇండియా ఇంటర్నేషనల్ ఛాలెంజర్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో డబుల్స్ టైటిల్ గెలుచుకుంది ఎవరు ?
జ: సుమీత్, అర్జున్

అంతర్జాతీయం
18) అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జి HW బుష్ (94) కన్ను మూశారు. ఆయన అమెరికాకి ఎన్నో అధ్యక్షుడిగా పనిచేశారు ?
జ: 41వ అధ్యక్షుడు ( 20 January 1989 – 20 January 1993)
19) అర్జెంటీనాలో జరిగిన జీ-20 దేశాల సదస్సులో పారిస్ ఒప్పందం అమలుకు ఎన్ని దేశాల ప్రతిజ్ఞ చేశాయి ?
జ: 19 దేశాలు ( అమెరికా మినహా)
20) భూమి బరువు తగ్గడంతో పాటు భూమిపై రోజు రోజుకీ వాయువులు కోల్పోతున్న అంశంపై నాసా ఏ రాకెట్ ద్వారా పరిశోధనలు చేయనుంది ?
జ: విజన్స్-2 ( విజువలైజింగ్ అయాన్ ఔట్ ఫ్లో వయా న్యూట్రల్ ఆటమ్ సెన్సింగ్) రాకెట్

PC/SI Mainsకి 100Mock +10 గ్రాండ్ టెస్టులు
ప్రారంభం అయ్యాయి.  ఫీజు చెల్లిస్తే 200టెస్టులు ఉచితం
https://telanganaexams.com/mocktests/

Friends,
తెలంగాణ ఎగ్జామ్స్ నుంచి యూట్యూబ్ ఛానెల్స్ ఓపెన్ చేశాం. subsribe చేయండి
https://www.youtube.com/channel/UCU51N-FwR9PQJckcH0FJdiA?disable_polymer=true
మాస్టర్స్ టీవీ - For a Real News ( అన్ని వార్తలకు ఈ ఛానెల్ ను subscribe చేయండి)
https://www.youtube.com/channel/UC1zxevIMCLp8vuEKe5PhlXQ