Friday, September 20

CURRENT AFFAIRS – DEC 13

తెలంగాణ

01) రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం ఎంతమంది ఓట్లు వేశారు ?
జ: 2 కోట్ల 5 లక్షల 80వేల 470మంది (2,05,80,470మంది)
పురుషులు: 1,03,17,064 మంది
మహిళలు : 1,02,63,214 మంది
02) రాష్ట్ర శాసనసభ ఎన్నికల ఫలితాలను ప్రకటిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఎప్పుడు గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది ?
జ: 2018 డిసెంబర్ 12న
03) 2018 డిసెంబర్ 15 నుంచి 25 వరకూ 32వ జాతీయ పుస్తక ప్రదర్శనను హైదరాబాద్ లో ఎక్కడ నిర్వహించనున్నారు ?
జ: తెలంగాణ కళా భారతి (NTR స్టేడియం)
04) హైదరాబాద్ బుక్ ఫెయిర్ సొసైటీ అధ్యక్షుడు ఎవరు ?
జ: జూలూరి గౌరీ శంకర్

జాతీయం

05) ఢిల్లీలో రెండ్రోజుల పాటు జరిగే పార్టనర్స్ ఫోరమ్ 2018 సదస్సును ఎవరు ప్రారంభించారు ?
జ: ప్రధాని నరేంద్ర మోడీ
06) మిజోరం ముఖ్యమంత్రిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేయనున్నారు?
జ: మిజో నేషనల్ ఫ్రంట్ అధ్యక్షుడు జోరంథంగా
07) మిజోరం అసెంబ్లీలో ఎన్ని సీట్లు ఉన్నాయి ?
జ: 40 స్థానాలు ( MNF కి 26 సీట్లు దక్కాయి )
08) ఇండియా డిస్కస్ త్రోయర్, 2010 కామన్వెల్త్ గేమ్స్ గోల్డ్ మెడలిస్ట్ కృష్ణ పునియా ఏ అసెంబ్లీ నియోజకవర్గంలో గెలవడం ద్వారా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు ?
జ: రాజస్తాన్ లోని సాదుల్ పూర్
(నోట్: ఈ స్వస్థలం హర్యానాలోని హిస్సార్ జిల్లా)
09) భారత నావికాదళం అమ్ముల పొదిలోకి మొట్టమొదటి జలాంతర్గామి సంరక్షణ వాహనం వచ్చి చేరింది. దాని పేరేంటి ?
జ: డీప్ సబ్ మెర్జెన్స్ రెస్క్యూ వెహికిల్ ( DSRV)
10) DSRV ఏ నావల్ బేస్ కేంద్రంగా పనిచేయనుంది ?
జ: ముంబై కేంద్రంగా
(నోట్: దీన్ని స్కాట్ లాండ్ లోని JFD సంస్థ తయారు చేసింది )
11) 2018 డిసెంబర్ 19న ఏపీ- శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ రెండో ప్రయోగ వేదిక నుంచి ప్రయోగించనున్న ఉపగ్రహ వాహక నౌక పేరేంటి ?
జ: GSLV F-11
12) GSLV F-11 శాటిలైట్ ద్వారా ఏ ఉపగ్రహాన్ని ఇస్రో ప్రయోగించనుంది ?
జ: జీ శాట్ 7ఏ
13) 2250 కిలోల బరువున్న జీశాట్ 7ఏని దేని కోసం ఉపయోగిస్తారు ?
జ: అత్యాధునిక మిలటరీ కమ్యూనికేషన్స్ శాటిలైట్ ఇది ఎయిర్ ఫోర్స్ వ్యవస్థలకు సేవలు అందిస్తుంది.
14) ఈ ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటును ఎంతశాతంగా ఏషియన్ డెవలప్ మెంట్ బ్యాంక్ ( ADB) కొనసాగించింది ?
జ: 7.3శాతం
15) రైల్వే కార్యాలయాల్లో రాజభాష హిందీని సమర్థంగా అమలు చేసినందుకు ఏ జోన్ కి రైల్వే మంత్రి రాజభాష ప్రథమ బహుమతిని ప్రకటించారు ?
జ: దక్షిణ మధ్య రైల్వే జోన్
16) విమానాల తరహాలోనే రైళ్ళల్లోనూ బ్లాక్ బాక్సులు పెట్టనున్నారు. వీటిని ఏమని పిలుస్తారు ?
జ: లోకో క్యాబ్ ఆడియో, వీడియో రికార్డింగ్ సిస్టమ్ ( LCAVR)
17) ఈ ఏడాది గూగుల్ సెర్చ్ ఇంజన్ లో భారతీయ క్రీడాభిమానులు అత్యధికంగా వాడిన పదం ఏది ?
జ: ఫిఫా వరల్డ్ కప్ 2018
18) భారత టేబుల్ టెన్నిస్ (టీటీ) స్టార్ ప్లేయర్ మనిక భత్రాకి ఏ అంతర్జాతీయ అవార్డు దక్కింది ?
జ: బ్రేక్ థ్రూ టేబుల్ టెన్నిస్ స్టార్
(నోట్: ఈ పురస్కారం పొందిన తొలి భారత టీటీ ప్లేయర్ మనిక)
19) అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ సమాఖ్య (ITTF) ఎక్కడ జరిగిన కార్యక్రమంలో మనికకు బ్రేక్ థ్రూ టేబుల్ టెన్నిస్ స్టార్ అవార్డు బహుకరించింది ?
జ: దక్షిణ కొరియాలోని ఇంచియోన్ లో
20) భారత రెజ్లింగ్ సమాఖ్య (WFI) ఏయే రెజ్లర్లను ఎ గ్రేడింగ్ లోకి మారుస్తూ నిర్ణయం తీసుకుంది ?
జ: సుశీల్ కుమార్, సాక్షి మలిక్

అంతర్జాతీయం

21) అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోని సోయజ్ CAPSULE కి పడిన 2మిల్లీ మీటర్ల రంధ్రాన్ని పూడ్చేందుకు ఆకాశంలో 6 గంటల పాటు స్పేస్ వాక్ చేసిన రష్యన్ ఆస్ట్రో నాట్స్ ఎవరు ?
జ: ఒలెగ్ కొనొనెన్కో, సెర్జీప్రొకోప్యెవ్

మాస్టర్స్ అకాడమీ నుంచి వచ్చిన 3 యూట్యూబ్ ఛానెల్స్ SUBSCRIBE చేయండి

తెలంగాణ ఎగ్జామ్స్ ఛానెల్:

https://www.youtube.com/channel/UCU51N-FwR9PQJckcH0FJdiA?disable_polymer=true
మాస్టర్స్ టీవీ
https://www.youtube.com/channel/UC1zxevIMCLp8vuEKe5PhlXQ?disable_polymer=true
ఆంధ్రఎగ్జామ్స్ :
https://www.youtube.com/channel/UC2NZvwJ-Ydiavfs90Ea4Alg?disable_polymer=true