Saturday, August 17

CURRENT AFFAIRS – DEC 1

తెలంగాణ
01) రాజస్థాన్ రాష్ట్రానికి ఎన్ని మెగావాట్ల విద్యుత్ ను సరఫరా చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది ?
జ: 500 మెగావాట్లు
02) రాష్ట్ర పర్యాటక శాఖకు మరో పురస్కారం లభించింది. ఉత్తరప్రదేశ్ లోని లఖనవూలో జరిగిన స్మార్ట్ నగరాల సదస్సులో తెలంగాణ పర్యాటక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం ఈ అవార్డు అందుకున్నారు. ఏ విభాగంలో అవార్డు దక్కింది ?
జ: పర్యావరణం, పర్యాటక రంగ అభివృద్ధి

జాతీయం
03) ఇస్రో చరిత్రలోనే 5,854 కిలోల అతి బరువైన జీశాట్ -11 ఉపగ్రహాన్ని 2018 డిసెంబర్ 5న ప్రయోగించనున్నారు. ఈ ప్రయోగం ఎక్కడ జరగనుంది ?
జ: ఫ్రెంచ్ గయానా కౌరు నుంచి
04) జీశాట్-11 భారీ ఉపగ్రహాన్ని ఏ రాకెట్ ద్వారా కక్ష్యలోకి ప్రవేశపెడతారు ?
జ: ఏరియన్ - 5
05) జీశాట్ ప్రయోగంతో 14 జిగా బైట్స్ ఫ్రీక్వెన్సీ తో పాటు అత్యధిక ట్రాన్స్ ఫాండర్స్ అందుబాటులోకి వస్తాయి. అయితే ఈ భారీ ఉపగ్రహాన్ని ఎక్కడ తయారు చేశారు ?
జ: బెంగళూరులోని యూఆర్ రావు శాటిలైట్ స్పేస్ సెంటర్ లో (రూ.500 కోట్లు బడ్జెట్ )
06) దక్షిణాసియాలో HIVతో బాధపడే యువతీ యువకులు ఏ దేశంలోనే ఎక్కువగా ఉన్నట్టు యూనిసెఫ్ తెలిపింది ?
జ: భారత్
(నోట్: 2017లో 19యేళ్ళ లోపు వారిలో 1.20 లక్షల మంది HIVతో బాధపడుతున్నట్టు యూనిసెఫ్ తెలిపింది )
07) హిమాలయ పర్వాతాల్లో 8.5తీవ్రతతో పెనుభూకంపం వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించిన శాస్త్రవేత్తల బృందం ఏది ?
జ: జవహర్ లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్సుడ్ సైంటిఫిక్ రీసెర్చ్ (బెంగళూరు) శాస్త్రవేత్త సీపీ రాజేంద్రన్ బృందం
08) స్టాక్ మార్కెట్ లో కమోడిటీ డెరివేటివ్స్ మార్కెట్ విభాగంలో ట్రేడింగ్ సమయాన్ని పెంచారు. ఉదయం ఎన్నింటికి ప్రారంభిస్తారు ?
జ: ఉదయం 9 గంటలకి (అర్థరాత్రి 11.55 గంటల దాకా )
09) ఒలింపిక్స్ లో వ్యక్తిగత క్రీడల్లో స్వర్ణం సాధించిన ఏకైక భారతీయుడైన షూటర్ అభినవ్ బింద్రాకి అంతర్జాతీయ షూటింగ్ క్రీడా సమాఖ్య నుంచి అరుదైన అవార్డు దక్కింది. అదే ఏమిటి ?
జ: బ్లూ క్రాస్ పురస్కారం
(నోట్: 2008 బీజింగ్ ఒలింపిక్స్ లో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో బింద్రా స్వర్ణం గెలుచుకున్నాడు )
10) భారత మహిళా క్రికెట్ కు కోచ్ గా వ్యవహరిస్తున్నది ఎవరు ?
జ: రమేశ్ పొవర్
11) భారత క్రికెటర్లకే కాదు ఇప్పుడు దేశంలో ఏ క్రీడాకారులకు కూడా వార్షిక కాంట్రాక్టులు ఇవ్వాలని నిర్ణయించారు ?
జ: రెజ్లర్లకు
(నోట్: బారత రెజ్లింగ్ సమాఖ్య నిర్ణయించింది. ఏ గ్రేడ్ లో రూ.30లక్షలు, బి-గ్రేడ్ లో రూ.20 లక్షలు వార్షిక ఫీజు చెల్లిస్తారు )

అంతర్జాతీయం
12) బ్రిక్స్, జీ-20 దేశాల సమావేశం ఎక్కడ జరుగుతోంది ?
జ: అర్జెంటీనాలోని బ్యూనస్ ఎయిర్స్ లో
13) ఇండో పసిఫిక్ లో శాంతి కోసం త్రైపాక్షిక కూటమిగా ఏయే దేశాలు సమావేశం అయ్యాయి ?
జ: జపాన్-అమెరికా-ఇండియా
(నోట్: ప్రధాని నరేంద్రమోడీ దీన్ని జై( JAI- Japan, America, India) సమావేశంగా పిలిచారు
14) జన్యువుల్ని ఎడిటింగ్ చేసే ప్రక్రియను చేపట్టిన హీ జియాన్ కుయ్ పై నిషేధం విధించిన దేశం ఏది ?
జ: చైనా
15) 2018 సంవత్సరానికి ఫోర్బ్స్ మేగజైన్ రూపొందించిన అమెరికాలో అగ్రస్థాయి 50 మంది టెక్నాలజీ ప్రముఖుల్లో చోటు దక్కించుకున్న భారత సంతతి మహిళలు ఎవరు ?
జ: పద్మశ్రీ వారియర్, కోమల్ మంగ్తాని, నేహా నార్ఖడే, కామాక్షి శివరామకృష్ణన్
16) యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోని పుజయిరా నుంచి ముంబైకి సముద్ర గర్బంలో ప్రయాణించే ఫ్లోటింగ్ రైళ్ళను (అండర్ వాటర్ హై స్పీడ్ రైలు) ప్రవేశపెట్టడానికి నేషనల్ అడ్వైజర్ బ్యూరో కంపెనీ (UAE) ప్రయత్నిస్తోంది. ప్రాజెక్ట్ పూర్తయితే ఎన్నివేల కిలోమీటర్ల దూరంలో ఈ రైలు ప్రయాణించనుంది ?
జ: 2 వేల కిలోమీటర్లు
17) అంటార్కిటిక్ ప్రాంతంలో ఓజోన్ పొర కోలుకుంటోందని 40యేళ్ల పాటు పరిశోధన చేసిన ఏ IIT నిపుణులు తేల్చారు ?
జ: IIT- ఖరగ్ పూర్

PC/SI Mainsకి 100Mock +10 గ్రాండ్ టెస్టులు
ప్రారంభం అయ్యాయి.  ఫీజు చెల్లిస్తే 200టెస్టులు ఉచితం
https://telanganaexams.com/mocktests/

Friends,
తెలంగాణ ఎగ్జామ్స్ నుంచి యూట్యూబ్ ఛానెల్స్ ఓపెన్ చేశాం. subsribe చేయండి
https://www.youtube.com/channel/UCU51N-FwR9PQJckcH0FJdiA?disable_polymer=true
మాస్టర్స్ టీవీ - For a Real News ( అన్ని వార్తలకు ఈ ఛానెల్ ను subscribe చేయండి)
https://www.youtube.com/channel/UC1zxevIMCLp8vuEKe5PhlXQ