Tuesday, November 13
Log In

CURRENT AFFAIRS – AUG 30th

రాష్ట్రీయం
01) 2018-19 సంవత్సరానికి మెడికల్, డెంటల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ప్రభుత్వం క్రీడల కోటకి సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన జీఓ నెంబర్ ఎంత ?
జ: జీవో 7
02) రాష్ట్రంలో కొత్తగా ఎన్ని పోస్ట్ పేమెంట్ బ్యాంకులు ఏర్పాటు చేస్తున్నట్టు తెలంగాణ CPMG బ్రిగేడియర్ చంద్రశేఖర్ వెల్లడించారు ?
జ: 23 బ్యాంకులు ( సెప్టెంబర్ 1 నుంచి ప్రారంభం)

జాతీయం
03) కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యం, కరువు సాయం ఎంతకు పెంచాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది ?
జ: 2శాతం
04) వేసవి కాలంలో గంగానదిలో నీళ్ళు తగ్గిపోవడంపై అధ్యయనం చేసిన IIT ఏది ?
జ: IIT- ఖరగ్ పూర్
05) 2022లో గగనయాన్ ప్రయోగాన్ని ఏ రాకెట్ ద్వారా నిర్వహించాలని ఇస్రో నిర్ణయించింది ?
జ: GSLV Mk-III
06) అటల్ జీ నే కహా - అనే పుస్తకం రాసింది ఎవరు ?
జ: బ్రిజేంద్ర రేహి
07) 2018 సంవత్సరానికి ఆసియా సొసైటీ గేమ్ ఛేంజర్ గా ఎంపికైన భారత సంతతి వ్యక్తి ఎవరు ?
జ: ఇంద్రా నూయీ (పెక్సికో ఛైర్మన్ అండ్ CEO)
08) హెప్టాథ్లాన్ లో పసిడి పతకం నెగ్గిన భారత అథ్లెట్ ఎవరు ?
జ: స్వప్న బర్మన్
(నోట్: ఏషియాడ్ చరిత్రలో భారత్ కు ఇదే తొలి స్వర్ణం )
09) ఆసియా క్రీడల్లో పురుషుల ట్రిపుల్ జంప్ లో స్వర్ణ పతకం సాధించింది ఎవరు ?
జ: అర్పీండర్ సింగ్
10) భారత స్ప్రింటర్ ద్యుతీ చంద్ ఆసియా క్రీడల్లో రెండో పతకాన్ని ఎందులో సాధించింది ?
జ: మహిళ 200 మీటర్ల పరుగులో
11) ఆసియా క్రీడల్లో రెండు పతకాలు సాధించిన ద్యుతీ చంద్ ఏ రాష్ట్రానికి చెందిన వారు ?
జ: ఒడిశా
12) నొప్పి నివారిణి వోలినికి బ్రాండ్ అంబాసిడర్ గా నియమితులైన ప్రముఖ క్రికెటర్ ఎవరు ?
జ: విరాట్ కోహ్లీ
13) 2018 జాతీయ క్రీడల దినోత్సవాన్ని ఇటీవల ఎప్పుడు జరుపుకున్నారు ?
జ: ఆగస్ట్ 29
( దీనికి సంబంధించిన అదనపు సమాచారం కోసం www.telanganaexams.com లో జనరల్ నాలెడ్జ్ విభాగంలో చూడగలరు )

అంతర్జాతీయం
14) వినియోగదారులు వీడియోలను వీక్షించేందుకు ఫేస్ బుక్ ప్రవేశపెట్టిన కొత్త ఫీచర్ ఏది ?
జ: వాచ్
15) 2019 అక్టోబర్ 27 నుంచి ప్రారంభమయ్యే ఆసియన్ యూత్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ పోటీలు ఎక్కడ జరుగుతాయి ?
జ: నార్త్ కొరియా (ప్యోంగ్యాంగ్ లో జరుగుతాయి)

SI/PC/VRO/GR.IV - 200 మాక్ టెస్టులు

ఎగ్జామ్స్ ముందు ప్రాక్టీస్ టెస్టులే కీలకం 

http://telanganaexams.com/mocktests/

ఈ లింక్ ద్వారా గూగుల్ ప్లే స్టోర్ నుంచి Telangana exams app ని డౌన్లోడ్ చేసుకోండి. 

https://play.google.com/store/apps/details?id=com.s2techno.telanganexams