Tuesday, July 23

CURRENT AFFAIRS – AUG 2

రాష్ట్రీయం
01) సీఎం కేసీఆర్ నాలుగో విడత హరితహారాన్ని గజ్వేల్ లో ప్రారంభించారు. ఒకేరోజు గజ్వేల్ లో ఎన్ని మొక్కలను నాటారు ?
జ: 1.25 లక్షలు
02) పట్టణ యువతకు ఐటీ కొలువులు వచ్చేందుకు వీలుగా ఏ ప్రాంతంలో కొత్తగా ఐటీ హబ్ ను నిర్మించనున్నారు ?
జ: నిజామాబాద్
03) 2018 ఆగస్టు 2 నుంచి రాష్ట్రంలో ఎన్ని గ్రామపంచాయతీలు కొత్తగా ఆవిర్భవించాయి ?
జ: 4,378 పంచాయతీలు
04) రాష్ట్రంలో కొత్తగా ఎన్ని మున్సిపాలిటీలు ఆవిర్భవించాయి ?
జ: 68
05) సామాజిక అడవుల శాతాన్ని పెంచేందుకు అన్ని విద్యా సంస్థల్లో ఏ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్టు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి చెప్పారు ?
జ: హరిత పాఠశాల
06) రాష్ట్రంలో ఎన్ని మండలాల్లో లోటు వర్షపాతం నమోదైనట్టు ప్రభుత్వం తెలిపింది ?
జ: 272 మండలాల్లో
07) రాష్ట్రంలో అత్యధికంగా ఏ జిల్లాలో లోటు వర్షపాతం నమోదైంది ?
జ: సంగారెడ్డి జిల్లా ( 19 మండలాలు )

జాతీయం
08) రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటు పావుశాతానికి పెంచింది. దాంతో ఇప్పుడు ఎంత శాతానికి చేరింది ?
జ: 6.5శాతం
09) వస్తు సేవల పన్ను ( జీఎస్టీ ) వసూళ్ళు 2018 జులైలో ఎన్ని కోట్లు వసూలు అయినట్టు కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది ?
జ: రూ.96,483 కోట్లు
10) ఎయిరిండియా బోర్డు డైరెక్టర్లుగా ఎవరు నియమితులయ్యారు ?
జ: కార్పొరేట్ దిగ్గజాలు కుమార మంగళం, వై.సి. దేవేశ్వర్
11) 2014-17 కాలానికి ఉత్తమ పార్లమెంటేరియన్లుగా ఎవరెవరికి అవార్డులు దక్కాయి ?
జ: నజ్మా హెప్తుల్లా, హుకుమ్ దేవ్ నారాయణ్ యాదవ్, గులాం నబీ ఆజాద్, దినేశ్ త్రివేది, భర్తృహరి మహతాబ్ `

అంతర్జాతీయం
12) గణితంలో నోబల్ బహుమతిగా చెప్పే ఫీల్డ్స్ మెడల్ అందుకున్న భారతీయ ఆస్ట్రేలియన్ శాస్త్రవేత్త ఎవరు ?
జ: అక్షయ్ వెంకటేశ్

SI/PC/VRO/GR.IV ప్రింటెడ్ మెటీరియల్, మాక్ టెస్టులు
(200మాక్ టెస్టులు, స్పెషల్ టెస్టులు)
(మోడల్ టెస్టుల కోసం వెబ్ సైట్ ను విజిట్ చేయండి )
https://telanganaexams.com/mockmaterial/