Saturday, November 17
Log In

CURRENT AFFAIRS – AUG 16

రాష్ట్రీయం
01) కంటివెలుగు కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ ఎక్కడ ప్రారంభించారు ?
జ: మెదక్ జిల్లా మల్కాపూర్
02) రాష్ట్ర తలసరి విద్యుత్ వినియోగం ఎన్ని యూనిట్లు గా ఉంది ?
జ: 1,507 (జాతీయ స్థాయిలో 1,122 యూనిట్లు )
03) సినీ పరిశ్రమలోని కార్మికుల సంక్షేమం, సమస్య పరిష్కారానికి కేంద్ర సలహామండలిని కేంద్ర కార్మికశాఖ ఏర్పాటు చేసింది. దీనికి హైదరాబాద్ కు చెందిన ఎవర్ని ఛైర్మన్ గా నియమించారు ?
జ: వల్లూరు జయప్రకాశ్ నారాయణ
04) 14యేళ్ళకే గ్రాండ్ మాస్టర్ అయిన తొలి తెలంగాణ క్రీడాకారుడు ఎవరు ?
జ: ఇరిగేసి అర్జున్
05) ఏ చెస్ టోర్నీలో విజేతగా నిలిచిన అర్జున్... 14యేళ్ళకే గ్రాండ్ మాస్టర్స్ హోదా పొందాడు ?
జ: అబుదాబి మాస్టర్స్ చెస్ టోర్నీలో

జాతీయం
06) పేదలకు ఉచిత వైద్యాన్ని అందించే ప్రధానమంత్రి జన్ ఆరోగ్య అభియాన్ ఎప్పుడు ప్రారంభం అవుతుందని ప్రధాని నరేంద్రమోడీ ప్రకటించారు ?
జ: 2018 సెప్టెంబర్ 25న
07) దాదాపు 60యేళ్ళ క్రితం భారత్ లోని ఓ ప్రదర్శనశాల నుంచి చోరీ అయిన 12వ శతాబ్దం నాటి ఏ విగ్రహాన్ని లండన్ పోలీస్ అధికారులు తిరిగి భారత్ కు అప్పగించారు ?
జ: గౌతమ బుద్ధుడు
08) అసోం ముఖ్యమంత్రి ఎవరు ?
జ: శర్వానంద సోనోవాల్
09) 2022 కల్లా మానవ సహిత అంతరిక్ష యాత్రను ఏ పేరుతో చేపడతామని ఇస్రో ఛైర్మన్ కె. శివన్ వెల్లడించారు ?
జ: గగన్ యాన్
10) సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్ర (షార్ ) సంచాలకులు ఎవరు ?
జ: ఎస్. పాండియన్
11) సామాజిక మాధ్యమాల్లో నకిలీ వార్తలు, వదంతుల గురించి ప్రభుత్వ ఉద్యోగులను అప్రమత్తం చేసేందుకు కేంద్ర ఐటీ శాఖకు చెందిన సెంటర్ ఫర్ డెవలప్ మెంట్ ఆఫ్ అడ్వాన్సుడ్ కంప్యూటింగ్ ఏ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది ?
జ: www.infosecawareness.in/
12) భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ (తొలి వన్డే కెప్టెన్ )ముంబైలో చనిపోయాడు. ఆయన పేరేంటి ?
జ: అజిత్ వాడేకర్

అంతర్జాతీయం
13) సౌర వ్యవస్థ చుట్టూ హైడ్రోజన్ గోడ వ్యాపించి ఉందని నాసా ప్రయోగించిన ఏ పరికరం గుర్తించింది ?
జ: న్యూ హారిజాన్స్

రూ.500 లకే మాక్ టెస్టులు http://telanganaexams.com/500rs-mock/

SI/PC/VRO/GR.IV ప్రింటెడ్ మెటీరియల్, మాక్ టెస్టులు:  http://telanganaexams.com/mockmaterial/