Friday, November 16
Log In

CURRENT AFFAIRS AUG 14

రాష్ట్రీయం
01) తెలంగాణ గిడ్డంగుల సంస్థ ఎండీగా ఎవరు నియమితులయ్యారు ?
జ: వి.భాస్కర్ రావు

జాతీయం
02) లోక్ మాజీ స్పీకర్ సోమ్ నాథ్ ఛటర్జీ కోల్ కతాలో కన్నుమూశారు. ఆయన ఏ లోక్ సభ నియోజకవర్గం నుంచి గతంలో పోటీ చేశారు ?
జ: జాదవ్ పూర్
03) లోక్ సభ స్పీకర్ గా సోమ్ నాథ్ ఛటర్జీ ఎప్పటి నుంచి ఎప్పటి వరకూ పనిచేశారు.
జ: 2004 నుంచి 2009 వరకూ
04) పార్లమెంటేరియన్ గా తన అనుభవాలతో కూడిన పుస్తకాన్ని సోమ్ నాథ్ ఛటర్జీ రాశారు. ఆ పుస్తకం పేరేంటి ?
జ: Keeping The Faith : Memoirs Of A Parliamentarian, The Collected Speeches of Somnath Chatterjee
05) డిజిటల్ విధానంలో ఎన్ క్రిప్షన్ పద్దతిలో ప్రశ్నాపత్రాలను తయారు చేసేందుకు ఏ సంస్థతో కలసి CBSE పనిచేస్తోంది ?
జ: మైక్రో సాఫ్ట్
06) దేశంలో ఎన్ని రకాల పురుగుమందులపై నిషేధం విధిస్తూ కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది ?
జ: 18 రకాలు
07) పరిశుభ్ర రైల్వేలకు ఏటా ఇచ్చే స్వచ్ఛ్ రైల్ - స్వచ్చ్ భారత్ ర్యాంకుల జాబితాలో చోటు దక్కించుకున్న తెలుగు రాష్ట్రాలకు చెందిన రెండు స్టేషన్లు ఏవి ?
జ: వరంగల్, తిరుపతి
08) భారతదేశంలో కాలుష్యం తగ్గిస్తే మరో నాలుగేళ్ళు ఆయుష్యు పెరుగుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. దీని కారణంగా ఏటా ఎంత మొత్తం నష్టపోతున్నట్టు పేర్కొంది ?
జ: రూ.35లక్షల కోట్లు
09) దేశంలో అత్యంత సంపద గల మహిళగా ఎవరు ఉన్నట్టు కొటక్ వెల్త్ అండ్ హురన్ నివేదిక తెలిపింది ?
జ: గోద్రెజ్ స్మితా కృష్ణ ( రూ.37,570 కోట్లు )
10) దేశాభిమానాన్ని చూరగొనే బ్రాండ్స్ జాబితాలో దేశంలో అగ్రస్థానంలో నిలిచిన ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఏది ?
జ: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
(నోట్: బ్రిటన్ కు ఆన్ లైన్ మార్కెట్ రీసెర్చ్, డేటా అనలిటిక్స్ సంస్థ యాగవ్ ఈ సర్వే నిర్వహించింది )

అంతర్జాతీయం
11) టర్కీ అధ్యక్షుడు థైప్ ఎర్డోగన్ ఆర్థిక విధానాలతో ఆ దేశ కరెన్సీ విలువ పడిపోతోంది. ఆ ప్రభావం యూరప్ స్టాక్ మార్కెట్లపై పడుతోంది. టర్కీ కరెన్సీ పేరేంటి ?
జ: లీరా

SI/PC/VRO/GR.IV మాక్ టెస్టులు రాయండి 

http://telanganaexams.com/mocktests/

200 మాక్ టెస్టుల టార్గెట్ పూర్తయింది

http://telanganaexams.com/200-mock_details/