Monday, September 24
Log In

CURRENT AFFAIRS – AUG 13

రాష్ట్రీయం
01) ఔషధ రంగంలో నాలుగేళ్ళలో ఎంత మొత్తం పెట్టుబడులు వచ్చినట్టు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది ?
జ: రూ.10,222 కోట్లు
02) నటుడు గొల్లపూడి మారుతీరావు కుమాడురు దివంగత శ్రీనివాస్ పేరుతో ఇస్తున్న ఉత్తమ కొత్త దర్శక పురస్కారం 2017 కు ఎవరు ఎంపికయ్యారు ?
జ: కొంకణ్ సేన్ శర్మ ( ఏ డెత్ ఇన్ ద గంజ్ చిత్రానికి )

జాతీయం
03) ఏ రాష్ట్రంలో శాసనమండలి ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలపనుంది ?
జ: ఒడిశా
04) మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు బాధ్యతలు స్వీకరించారు ?
జ: తాహిల్ రమణి
05) 12యేళ్ళ లోపు బాలికలపై అత్యాచారం చేస్తే మరణశిక్ష సహా కఠిన శిక్షలు వేయడానికి ఉద్దేశించిన క్రిమినల్ లా (సవరణ) చట్టం - 2018 కి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆమోదం తెలిపారు. ఇది ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది ?
జ: 2018 ఏప్రిల్ 21 నుంచి
06) 2018 ఆగస్ట్ 15 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జనధన్ ఖాతాల్లో ఓవర్ డ్రాఫ్ట్ పరిమితిని ఎంతకు పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది ?
జ: రూ. 10 వేలు ( గతంలో రూ.5వేలుగా ఉంది )
07) జనధన్ యోజన పథకాన్ని మొదట ఎప్పుడు ప్రకటించారు ?
జ: 2014 ఆగస్టు15 (2015 ఆగస్టు 14 నాటికి ఏడాదికి పూర్తియింది ))
08) ఆఫ్రికన్ దేశాల్లో మొక్కజొన్నను నాశనం చేస్తున్న ఫాల్ ఆర్మీ వామ్ - స్పొడోప్తెరా పురుగు ఇప్పుడు దేశంలో ఏ రాష్ట్రంలో మొక్కజొన్నపై దాడి చేస్తున్నట్టు భారత వ్యవసాయ పరిశోధనా మండలి గుర్తించింది ?
జ: కర్ణాటక రాష్ట్రంలోని శివమొగ్గలో
09) రూ.800కోట్లతో చంద్రయాన్-2 మిషన్ ను ఎప్పుడు చేపడుతున్నట్టు ఇస్రో ఛైర్మన్ కె.శివన్ తెలిపారు ?
జ: 2019 జనవరి 3

అంతర్జాతీయం
10) సూర్యుడిపై ప్రయోగాలు జరిపేందుకు పార్కర్ ప్రోబ్ ను నాసా విజవంతంగా ప్రయోగించింది. ఎక్కడి నుంచి ఈ ప్రయోగం జరిగింది ?
జ: కేప్ కెనవెరాల్ లోని కెన్నెడీ అంతరిక్ష కేంద్రం
11) వలసవాదం, రాజకీయాలు, మత ఛాందస వాదంపై పోరాడిన భారత సంతతి వ్యక్తి, నోబెల్ బహుమతి గ్రహీత, రచయిత లండన్ లో కన్నుమూశారు. ఆయన పేరేంటి ?
జ: విఎస్ నైపాల్
12) భారత్ తో సైనిక సహకార ఒప్పందం ఈ ఏడాది జూన్ తో ముగుస్తుండటంతో తమ దేశం నుంచి సైనిక సిబ్బంది, హెలికాప్టర్లను వెనక్కి తీసుకోవాలని తేల్చి చెప్పిన దేశం ఏది ?
జ: మాల్దీవులు
13) మాల్దీవుల ప్రస్తుత అధ్యక్షుడు ఎవరు ?
జ: అబ్దుల్లా యామీన్

రూ.500 లకే మాక్ టెస్టులుhttp://telanganaexams.com/500rs-mock/

SI/PC/VRO/GR.IV ప్రింటెడ్ మెటీరియల్, మాక్ టెస్టులు:  http://telanganaexams.com/mockmaterial/