Friday, May 24

CURRENT AFFAIRS – AUG 09

రాష్ట్రీయం

01) స్వీడన్ కు చెందిన ఏ అంతర్జాతీయ ఫర్నిచర్ దిగ్గజం ఇండియాలోనే మొదటిసారిగా హైదరాబాద్ లో తన స్టోర్ ఓపెన్ చేస్తోంది ?
జ: ఐకియా (రూ.1000 కోట్లు పెట్టుబడి )
02) నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్, ఇండియా ప్రకటించిన యువ శాస్త్రవేత్త - 2018 జాబితాలో చోటు దక్కించుకున్న ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, హైదరాబాద్ చెందిన ఇద్దరు పరిశోధకులు ఎవరు ?
జ: అరవింద్ కుమార్, సుష్మీ బదులిక
03) యువ శాస్త్రవేత్త - 2018 పురస్కారానికి ఎంపికైన అరవింద్ కుమార్ ఏ రంగంపై పరిశోధనలు చేస్తున్నారు ?
జ: కేన్సర్
04) యువ శాస్త్రవేత్త - 2018 కి ఎంపికైన సుష్మీ బదులిక ఏ పరిశోధనలు చేస్తున్నారు ?
జ: స్పర్శ కోల్పోయిన వారికి ఈ చర్మం అందించడం
05)వయోజన విద్యలో చేసిన కృషికి రాష్ట్ర వయోజన విద్యా వనరుల కేంద్రానికి ఏ అవార్డు దక్కింది ?
జ: నెహ్రూ లిటరసీ పురస్కారం

జాతీయం
06) దేశంలో నాలుగేళ్ళ సగటు తలసరి ఆదాయం ఎంతగా ఉన్నట్టు గణాంకాల సహాయ మంత్రి విజయ్ గోయల్ ప్రకటించారు ?
జ: రూ.79,882
07) 2001-12 నుంచి 2014-15 మధ్య కాలంలో తలసరి ఆదాయం ఎంతగా ఉండేది ?
జ: రూ.67,594
08) రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డైరక్టర్ గా ఎవరు నియమితులయ్యారు ?
జ: స్వామినాథన్ గురుమూర్తి (నాలుగేళ్ళ పాటు పదవిలో ఉంటారు )
09) 2018-19 నాటికి భారత వృద్ధి ఎంత శాతంగా నమోదు అవుతుందని IMF ఎగ్జిక్యూటివ్ బోర్డు అంచనా వేసింది ?
జ: 7.3శాతం
10) 2018 జూన్ తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ( 2017-18) కి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంత మొత్తం డివిడెండ్ ను కేంద్ర ప్రభుత్వానికి చెల్లించనుంది ?
జ: రూ.50 వేల కోట్లు
11) రజితోత్సవాలు జరుపుకుంటున్న నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ (NSE) ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ?
జ: ముంబై
12) ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) బ్రాండ్ విలువ ప్రస్తుతం ఎన్ని వేల కోట్లు ఉన్నట్టు ప్రముఖ అంతర్జాతీయ సంస్థ డఫ్ అండ్ ఫెల్ప్స్ ప్రకటించింది ?
జ: రూ.43వేల కోట్లు ( 6.3 బిలియన్ డాలర్లు )
13) అమెరికా కాంగ్రెస్ లో తొలి ముస్లిం మహిళగా ఎవరు చరిత్ర సృష్టించబోతున్నారు ?
జ: రషీదా తలైబ్
(నోట్: మిషిగన్ లోని 13వ కాంగ్రెస్ డిస్ట్రిక్ట్ లో డెమోక్రాటిక్ పార్టీ తరపున నామినేషన్ వేశారు. ఇక్కడ రిపబ్లికన్ అభ్యర్థులు బరిలోకి దిగడం లేదు. దాంతో నవంబర్ లో జరిగే ఎన్నిక ఏకగ్రీవం అవనుంది )

అంతర్జాతీయం
14) అమెరికాలో పౌర హక్కులు, గోప్యతను పరిరక్షించే స్వతంత్ర్య ఏజెన్సీ ‘‘ప్రైవసీ అండ్ సివిల్ లిబర్టీస్ ఓవర్ సైట్ బోర్డ్ సభ్యుడిగా నియమితులైన భారత సంతతి వ్యక్తి ఎవరు ?
జ: ఆదిత్య బాంజాయ్
15) ప్రపంచ మాజీ ఛాంపియన్ నికోలస్ బెట్ కెన్యాలోని నైరోబిలో చనిపోయారు. ఆయన ఏ క్రీడకి చెందినవారు ?
జ: హర్డిల్స్ అథ్లెట్
( 2015 లో జరిగిన ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ లో 400 మీటర్ల హర్డిల్స్ లో స్వర్ణం సాధించాడు)

SI/PC/VRO/GR.IV ప్రింటెడ్ మెటీరియల్, మాక్ టెస్టులు
(200మాక్ టెస్టులు, స్పెషల్ టెస్టులు)
(మోడల్ టెస్టుల కోసం వెబ్ సైట్ ను విజిట్ చేయండి )
https://telanganaexams.com/mockmaterial/

RRB ఎగ్జామ్ కి 10 గ్రాండ్ టెస్టులు (Maths  ప్రాక్టీస్ టెస్టులు ఉచితం)
https://telanganaexams.com/rrb-gt-tests/