Sunday, August 19
Log In

CURRENT AFFAIRS – AUG 08

రాష్ట్రీయం

01) 2018 ఆగస్టు 7 జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఎవరి పేరున 30 మంది చేనేత కళాకారులకు మంత్రి కేటీఆర్ అవార్డులు ప్రదానం చేశారు ?
జ: కొండా లక్ష్మణ్ బాపూజీ
02) రాష్ట్ర ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన రీజినల్ రింగ్ రోడ్డుకి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. మొత్తం ఎన్ని కిలోమీటర్లలో ఈ రోడ్డును నిర్మించనున్నారు ?
జ: 338 కి.మీ ( మొదటి దశలో : 152 కిమీ, రెండో దశలో 186 కిమీ )
03) రీజినల్ రింగ్ రోడ్డును మొదటి దశలో ఏయే ప్రాంతాల ద్వారా చేపడతారు ?
జ: సంగారెడ్డి - నర్సాపూర్ - తూప్రాన్ - గజ్వేల్ - జగ్దేవ్ పూర్ - భువనగిరి - చౌటుప్పల్
04) రీజినల్ రింగ్ రోడ్డును రెండో దశలో ఏయే ప్రాంతాల ద్వారా చేపడతారు ?
జ: చౌటుప్పల్ - యాచారం - కడ్తాల్ - షాద్ నగర్ - చేవెళ్ళ - శంకరపల్లి - కంది ( సంగారెడ్డి)
05) నాలుగో విడత హరితహారంను ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ రోజున గజ్వేల్ నుంచి ప్రారంభించారు ?
జ: 2018 ఆగస్టు 1

జాతీయం
06) చెన్నైలో మరణించిన మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి ఎన్నిసార్లు తమిళనాడు ముఖ్యమంత్రిగా పనిచేశారు ?
జ: ఐదు సార్లు
07) సుప్రీంకోర్టు జడ్జీలుగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు ?
జ: జస్టిస్ ఇందిరా బెనర్జీ, జస్టిస్ వినీత్ శరణ్, జస్టిస్ జోసెఫ్
08) లంచం ఇచ్చే వారికి గరిష్టంగా ఏడేళ్ళ జైలు శిక్ష విధించే కొత్త చట్టానికి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఎప్పుడు ఆమోదం తెలిపారు ?
జ: 2018 జులై 31 న
09) పునరుజ్జీవ కాలం నుంచి ప్రపంచవ్యాప్తంగా వెల్లడైన వివిధ ముఖ్యమైన భావాలు, ఆలోచనలతో మాజీ మంత్రి జైపాల్ రెడ్డి రాసిన పుస్తకాన్ని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఢిల్లీలో ఆవిష్కరించారు. ఆ పుస్తకం పేరేంటి ?
జ: టెన్ ఐడియాలజీన్ : ది గ్రేట్ అసిమ్మెట్రీ బిట్వీన్ అగ్రేరియనిజం అండ్ ఇండస్ట్రియలిజమ్
10)ఎస్కార్ట్స్ సీఎండీగా ఎవరు నియమితులయ్యారు ?
జ: నిఖిల్ నందా ( నిఖిల్ తండ్రి రాజన్ నందా అనారోగ్యంతో మరణించారు )
11) ఈ ఏడాది రాజీవ్ గాంధీ జాతీయ సద్భావన అవార్డుకు ఎంపికైన వారు ఎవరు ?
జ: గోపాల కృష్ణ గాంధీ
12) 2018- 19 ఆర్థిక సంవత్సరానికి భారత్ వృద్ధి రేటు ఎంతగా ఉంటుందని అంతర్జాతీయ సంస్థ మోర్గాన్ స్టాన్లీ నివేదిక అంచనా వేసింది ?
జ: 7.5శాతం

అంతర్జాతీయం
13) అక్రమంగా ఉంటున్న విదేశీయులకు క్షమాభిక్ష కార్యక్రమం ప్రకటించిన దేశం ఏది ?
జ: యూఏఈ

SI/PC/VRO/GR.IV ప్రింటెడ్ మెటీరియల్, మాక్ టెస్టులు
(200మాక్ టెస్టులు, స్పెషల్ టెస్టులు)
(మోడల్ టెస్టుల కోసం వెబ్ సైట్ ను విజిట్ చేయండి )
https://telanganaexams.com/mockmaterial/

RRB ఎగ్జామ్ కి 10 గ్రాండ్ టెస్టులు (Maths  ప్రాక్టీస్ టెస్టులు ఉచితం)
https://telanganaexams.com/rrb-gt-tests/