Thursday, March 21

CURRENT AFFAIRS – AUG 06

రాష్ట్రీయం
01) సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ హైదరాబాద్ ప్రాంగంలో జరిగిన 7వ స్నాతకోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరైనవారు ఎవరు ?
జ: రామ్ నాథ్ కోవింద్
02) రాష్ట్రవ్యాప్తంగా 27 లక్షల మంది రైతులకు బీమా పత్రాలను ఎప్పటి నుంచి అందిస్తున్నారు ?
జ: 2018 ఆగస్టు 6 నుంచి

జాతీయం
03) ఎన్ని కోట్లకు మించి విలువ కలిగిన ఆర్థిక నేరాల్లో ఉన్న వాళ్ళు విదేశాలకు పారిపోతే వారిని పరారీలో ఉన్న ఆర్థిక నేరగాళ్ళుగా గుర్తించేందుకు ఉద్దేశించిన ఎకనమిక్ అఫెండర్స్ చట్టం 2018కి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆమోదం తెలిపారు ?
జ: రూ.100 కోట్లు
04) ఇంటర్నేషనల్ అడ్వర్టైజింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రకటించిన మార్కెటర్ ఆఫ్ ది ఇయర్ ఎవరికి దక్కింది ?
జ: అమూల్
05) Go Whats that - పేరుతో ఫోన్ లోనే టూరిజం గైడ్ ను దేశంలోనే మొదటిసారిగా ఏ నగరంలో ఆవిష్కరించారు ?
జ: చండీగఢ్
06) సంచార్ క్రాంతి యోజన పథకం కింద మహిళలు, యువతకు మొబైలీ తిహార్ పేరుతో స్మార్ట్ ఫోన్లు అందజేసిన రాష్ట్ర ప్రభుత్వం ఏది ?
జ: ఛత్తీస్ గఢ్
07) అమరుల త్యాగాలకు గుర్తుగా 2018 భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని షాహిద్ సమ్మాన్ దివస్ గా ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం ఏది ?
జ: మధ్యప్రదేశ్
08) 2018 మోహన్ బగాన్ రత్నా కు ఎంపికైనది ఎవరు?
జ: ప్రదీప్ చౌదరి
09) థర్మల్ పవర్ ప్రాజెక్టుల్లో సమస్యలపై అధ్యయనం చేసేందుకు నియమితులైన కమిటీ ఏది ?
జ: ప్రదీప్ కుమార్ సిన్హా కమిటీ ( కేబినెట్ సెక్రటరీ )
10) నేపాల్ ఇండియా మొదటి మేథో మధన సదస్సు ఎక్కడ జరిగింది ?
జ: ఖాట్మాండూ (2018 జులై 31న)
11) దేశంలోనే మొదటి ఆవు సంరక్షణ కేంద్రాన్ని రాజస్థాన్ లో ఎక్కడ ఏర్పాటు చేశారు ?
జ: బికనీర్
12) చైనాలోని నాన్ జింగ్ లో జరిగిన ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ లో రజితం గెలుచుకున్న భారతీయ ప్లేయర్ ఎవరు ?
జ: సింధు
13) కర్మన్ కౌర్ తాండీ ఏ క్రీడకి చెందిన వారు ?
జ: టెన్నిస్
14) దక్షిణాఫ్రికాలోని డర్బన్ లో జరిగిన మూడవ 2018 బ్రిక్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఉత్తమ చిత్రంగా ఎంపికైన భారతీయ సినిమా ఏది ?
జ: న్యూటన్

అంతర్జాతీయం
15) చైనాలోని నాన్ జింగ్ లో జరిగిన ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ లో బంగారు పతకం గెలిచి, మూడోసారి విశ్వవిజేతగా నిలిచిన స్పెయిన్ స్టార్ ఎవరు ?
జ: కరోలినా మారిన్
16) ఇంటర్నేషనల్ ఆర్మీ గేమ్స్ 2018 ని నిర్వహిస్తున్న దేశాలు ఏవి ?
జ: ఇరాన్, ఆర్మేనియా, రష్యా
17) 2018 మానవ అక్రమ రవాణా వ్యతిరేక ప్రపంచ దినోత్సవం యొక్క థీమ్ ఏంటి
జ: Responding to the trafficking of children and young people
18) యూకె- ఫ్రాన్స్ ఛానెల్ ఈదేందుకు ఎంపికైన మొదటి ఆసియన్ స్విమ్మర్ ఎవరు ?
జ: ప్రభాత్ కోలీ (మహారాష్ట్ర )
19) రోహింగ్యాలపై జరిగిన అకృత్యాలను విచారించేందుకు మయన్మార్ ప్రభుత్వం నియమించిన నలుగు సభ్యుల స్వతంత్ర్య కమిషన్ ఏది ?
జ: రాసారియో మనాలో కమిటీ

SI/PC/VRO/GR.IV ప్రింటెడ్ మెటీరియల్, మాక్ టెస్టులు
(200మాక్ టెస్టులు, స్పెషల్ టెస్టులు)
(మోడల్ టెస్టుల కోసం వెబ్ సైట్ ను విజిట్ చేయండి )
https://telanganaexams.com/mockmaterial/

RRB ఎగ్జామ్ కి 10 గ్రాండ్ టెస్టులు
https://telanganaexams.com/rrb-gt-tests/