Tuesday, July 23

CURRENT AFFAIRS – AUG 03

రాష్ట్రీయం
01) నేర పరిశోధనలో కీలకంగా మారే ఏ విధానాన్ని డీజీపీ మహేందర్ రెడ్డి ఆవిష్కరించారు ?
జ: ముఖ కవళికల గుర్తింపు విధానం ( FRS)
02) కేసీఆర్ కిట్ అమలు చేయడానికి ఏ వర్గానికి చెందిన వారికి గరిష్టంగా రెండు కాన్పుల షరతు ఎత్తివేశారు ?
జ: ఆదివాసీలకు
03) యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) ప్రభుత్వం ఎప్పటి నుంచి ఎప్పటి వరకూ క్షమాభిక్ష పథకాన్ని అమలు చేస్తోంది ?
జ: ఆగస్టు 1 నుంచి అక్టోబర్ 31 వరకూ

జాతీయం
04) జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ కు (NCBC) కి రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించే కీలకమైన బిల్లుకు లోక్ సభ ఆమోదం తెలిపింది. దీన్ని ఎన్నో రాజ్యాంగ సవరణ ద్వారా తీసుకొచ్చారు ?
జ: 123వ రాజ్యాంగ సవరణ బిల్లు
05) జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ -1993 (NCBC) ఎప్పుడు కేంద్ర సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖ పర్యవేక్షణలో ఏర్పాటు చేశారు ?
జ: 1993 ఆగస్టు 14న
06) జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ కు (NCBC) ఏర్సాటుకు సుప్రీంకోర్టు ఏ కేసులో ఇచ్చిన తీర్పే కారణం ?
జ: ఇంద్రా సాహ్ని కేసులో
07) ప్రస్తుతం ఓబీసీలకు ఎంత శాతం రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయి ?
జ: 27శాతం
08) దేశంలో మొత్తం ఎన్ని నగరాలను స్మార్ట్ సిటీలుగా ఎంపిక చేశారు ?
జ: 100
09) దేశంలో ఎంపిక చేసిన 100 స్మార్ట్ సిటీల్లో ఇప్పటికి ఎన్ని ప్రాజెక్టులు చేపట్టారు ? వాటి విలువ ఎంత ?
జ: మొత్తం ప్రాజెక్టులు 5,151; మొత్తం ప్రాజెక్టుల విలువ: రూ.2.05 లక్షల కోట్లు
10) ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ వృద్ధి రేటు ఎంతంగా ఉంటుందని మోర్గాన్ స్టాన్లీ అంచనా వేసింది ?
జ: 7.5శాతం
11) శత్రు క్షిపణులను చిత్తు చేసే అధునాతన సూపర్ సోనిక్ నిరోధక క్షిపణి పరీక్షను భారత్ విజయవంతంగా ప్రయోగించింది. దీన్ని ఎక్కడి నుంచి ప్రయోగించారు ?
జ: బాలాసోర్ లోని అబ్దుల్ కలాం దీవి నుంచి
12) అడ్వాన్సుడ్ ఎయిర్ డిఫెన్స్ ను విజయవంతంగా ప్రయోగించారు. ఇది ఎన్ని కిలోమీటర్ల ఎత్తులో ఎదురుగా వచ్చే క్షిపణులను అడ్డగిస్తుంది ?
జ: 15 నుంచి 25 కిమీ.
13) దేశీయంగా అభివృద్ధి చేసిన తేలికపాటి యుద్ధ విమానం తేజస్ నౌకాదళ వెర్షన్ ను ఎక్కడ విజయవంతంగా ప్రయోగించారు ?
జ: బెంగళూరులో
14) దేశీయంగా అభివృద్ధి చేసిన తేలికపాటి యుద్ధ విమానం తేజస్ ను ఏ కంపెనీ తయారు చేస్తోంది ?
జ: HAL
15) నాలుగున్నరేళ్ళలో అత్యధికంగా ONGC త్రైమాసిక లాభం ఎంత సాధించింది ?
జ: రూ.6,144 కోట్లు
16) పాపులారిటీ పరంగా దేశంలో ఏ యూనివర్సిటీకి అన్ని విద్యా సంస్థల్లో కెల్లా అగ్రస్థానంలో నిలిచింది ?
జ: ఢిల్లీ యూనివర్సిటీ

అంతర్జాతీయం
17) అమెరికా మార్కెట్లో మొదటిసారిగా 1 ట్రిలియన్ డాలర్లు (లక్ష కోట్లు) (దాదాపు రూ.68లక్షల కోట్లు) మార్కెట్ విలువ సాధించిన కంపెనీ ఏది ?
జ: యాపిల్
18) రష్యాపై విధించిన ఆంక్షల ప్రభావం భారత్ పై పడకుండా జాతీయ రక్షణ అధీకృత చట్టం (NDAA) బిల్లుకు ఆమోదం తెలిపిన దేశం ఏది ?
జ: అమెరికా
19) 2019 సంవత్సరానికి ఎంత మొత్తం రక్షణ బడ్జెట్ ను అమెరికా కాంగ్రెస్ ఆమోదించింది ?
జ: 716 బిలియన్ డాలర్లు ( దాదాపు రూ.49లక్షల కోట్లు )
20) ఆస్ట్రేలియాలో డెంగ్యూ రహిత పట్టణాన్ని శాస్త్రవేత్తలు సృష్టించారు. క్వీన్స్ లాండ్ దీవిలోని టౌన్స్ విల్లే లో ఈ ప్రయోగం చేశారు. అందుకోసం దోమల్లో ప్రవేశపెట్టిన బ్యాక్టీరియా పేరేంటి ?
జ: వోల్బచియా

SI/PC/VRO/GR.IV ప్రింటెడ్ మెటీరియల్, మాక్ టెస్టులు
(200మాక్ టెస్టులు, స్పెషల్ టెస్టులు)
(మోడల్ టెస్టుల కోసం వెబ్ సైట్ ను విజిట్ చేయండి )
https://telanganaexams.com/mockmaterial/