Thursday, March 21

CURRENT AFFAIRS – APR 5

రాష్ట్రీయం
1) రూ.10.60 కోట్లతో రాష్ట్రంలో మొదటిసారిగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ను త్వరలో ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు?
జ: జీడిమెట్లలో
2) ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన్ కింద చిన్న నీటి వనరులకు కేంద్ర ప్రభుత్వం ఎంత నిధులు విడుదల చేసింది.
జ: రూ.21.68 కోట్లు
(నోట్: రాష్ట్రంలో 176 నీటి వనరుల మరమ్మత్తులు, నవీకరణ, పునరుద్దరణు 2019 మార్చిలోగా పూర్తి చేయాలి )
3) పేదింటి ఆడపిల్లల వివాహాలకు కళ్యాణ లక్ష్మి పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం రూ.1,00,116 లకు పెంచింది. రాష్ట్రంలోనే మొదటి చెక్కును ఎక్కడ అందజేశారు
జ: సిద్ధిపేట జిల్లా మర్కూక్ మండలంలోని ఎర్రవల్లిలో
4) దేశంలోనే మొదటిసారిగా మసాలా దినుసుల తయారీ కేంద్రాన్ని ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఎక్కడ నెలకొల్పనున్నారు ?
జ: ఓల్డ్ జీడిమెట్ల పైపులైన్ రోడ్డులో
5) రామ్ మనోహర్ లోహియా 108వ జయంతి సందర్భంగా లోహియా పురస్కారాన్ని ఎవరికి ప్రదానం చేశారు ?
జ: రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి

జాతీయం
6) ప్రభుత్వ వ్యవహారాల్లో షెడ్యూల్డ్ కులాలను ప్రస్తావించేటప్పుడు వారిని దళిత్ అని కాకుండా ఏ పేరుతో పేర్కొనాలని కేంద్ర సామాజిక, న్యాయ, సాధికరత మంత్రిత్వ శాఖ లేఖలు రాసింది ?
జ: షెడ్యూల్డ్ కులాలు
(నోట్: రాజ్యాంగంలోని అధికరణం 341, రాష్ట్రపతి ఉత్తర్వులను అనుసరించి షెడ్యూల్డ్ కాస్ట్స్ అనే పేర్కొనాలి )
7) ఏ రాష్ట్ర ప్రభుత్వం ఐదుగురు బాబా (సాధువులకు) రాష్ట్ర సహాయ మంత్రి హోదా కల్పించింది ?
జ: మధ్యప్రదేశ్
8)రూ.40 వేల కోట్లతో S-400 ట్రయంఫ్ క్షిపణులు కొనుగోలు ఒప్పందం భారత్ ఏ దేశంతో కుదుర్చుకుంది ?
జ: రష్యా
9) ఇటీవల దేశంలోని ఏ పుణ్యక్షేత్రంలోని రత్న భాండాగారాన్ని 15మందితో కూడిన అధ్యయన బృందం సభ్యులు తలుపులు తెరిచారు ?
జ: ఒడిశాలోని పూరీ శ్రీక్షేత్రంలో
10) సైబర్ బెదిరింపులు ఎదుర్కోవడంలో ప్రపంచ వ్యాప్తంగా భారత్ ఎన్నో స్థానంలో ఉంది ?
జ: మూడో స్థానం
(నోట్: 2017లో అత్యధిక సైబర్ దాడులు ఎదుర్కొని 2వ స్థానంలో నిలిచింది.  మొదటి రెండు స్థానాల్లో అమెరికా, చైనా ఉన్నాయి )
11) 2018-19 సంవత్సరంలో భారత్ ఆర్థిక వృద్ధి ఎంతగా ఉంటుందని ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ ( ఇండ్ - రా) వెల్లడించింది ?
జ: 7.4శాతం
12) ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులకు ప్రత్యేక గుర్తింపు సంఖ్యను ఇచ్చే భూ-ధార్ కార్యక్రమం ఏ రాష్ట్రంలో ప్రవేశపెడుతున్నారు ?
జ: ఆంధ్రప్రదేశ్
13) NRI లు భారత్ లోని తమ స్నేహితులు, బంధువులు, కుటుంసభ్యులకు డబ్బులు పంపడానికి సోషల్ పే అనే కొత్త సేవను ప్రవేశపెట్టిన బ్యాంక్ ఏది ?
జ: ICICI

అంతర్జాతీయం
14) అమెరికాలో యూట్యూబ్ ప్రధాన కార్యాలయం ఎక్కడ  ఉంది ?
జ: కాలిఫోర్నియాలోని శాన్ బ్రూనోలో
15) ఉగ్రవాదులు, మిలిటెంట్ సంస్థల పేర్లను ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి అప్ డేట్ చేసింది.  ఇందులో పాకిస్తాన్ కు చెందిన ఎన్ని పేర్లు ఉన్నాయి.
జ: 139
16) ఐక్యరాజ్యసమితి ప్రకటించిన ఉగ్రవాదుల జాబితాలో మొదటి పేరు ఎవరిది ?
జ: అయ్మన్ అల్ జవహరి(అల్ ఖైదా మాజీ అధినేత ఒసామాబిన్ లాడెన్ వారసుడు)
17) బరిలోకి దిగకుండానే 2018 కామన్వెల్త్ క్రీడల్లో  మొదటి పతకం ఖాయం చేసుకున్న క్రీడాకారిణి ఎవరు ?
జ: రాబర్ట్ సన్  (51కిలోల విభాగంలో నేరుగా సెమీస్ చేసిన ఆస్ట్రేలియా ప్లేయర్)

మాక్ టెస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి :

http://tsexams.com/pcvro-mock-test/