Tuesday, September 25
Log In

CURRENT AFFAIRS – APR 4

రాష్ట్రీయం
1) ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్ - ఇండియా ర్యాంకింగ్స్ 2018 పేరుతో దేశవ్యాప్తంగా ఉన్నత విద్యామండలి విద్యాసంస్థలకు ఇచ్చిన ర్యాంకింగ్స్ లో ఓయూకి ఎంత ర్యాంక్ వచ్చింది ?
జ: 45వ ర్యాంకు
(నోట్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి 11 వ స్థానం దక్కింది )
2) మరోసారి రాజ్యసభ నాయకుడిగా ఎవరు నియమితులయ్యారు?
జ: అరుణ్ జైట్లీ

జాతీయం
3) దేశంలోనే అత్యుత్తమ ఉన్నత విద్యా సంస్థగా ఏది నిలిచింది ?
జ: బెంగళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్
4) దేశంలో ఉత్తమ ఇంజనీరింగ్ కళాశాలగా, ఉత్తర నిర్వహణ విద్యా సంస్థ ఏవి నిలిచాయి ?
జ: ఐఐటీ - మద్రాస్, ఐఐటీ - అమ్మదాబాద్
5) ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొనే సత్యా గ్రహ నుంచి స్వచ్ఛాగ్రహ అనే కార్యక్రమాన్ని ఈనెల 10న ఎక్కడ నిర్వహిస్తున్నారు ?
జ: బిహార్ లోని చంపారన్ లో
6) 12 అంకెల ఆధార్ సంఖ్య చెప్పకుండా ఇకపై వర్చువల్ ఐడీ చెబితే సరిపోయేలా జూన్ 1 నుంచి అమల్లోకి నిబంధనలు అమల్లోకి తెస్తున్నారు. వర్చువల్ ఐడీలో ఎన్ని అంకెలు ఉంటాయి ?
జ: 16 అంకెలు
7) జమ్మూకశ్మీర్ కి స్వతంత్ర్య ప్రతిపత్తి కలిగించే రాజ్యాంగంలోని ఆర్టికల్ ఏది ?
జ: 370 వ ఆర్టికల్
8) మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్ ను ఎక్కడ ప్రారంభించారు ?
జ: బాలీ స్టేషన్ (మడ్ గావ్ - గోవా)
9) ఇటీవల ఏ ప్రముఖ దేవాలయంలో ప్రపంచ స్థాయి సౌకర్యాలను కల్పించారు ?
జ: ఒడిషాలోని కోణార్క్ సూర్య దేవాలయం
10) పేదింటి ఆడపిల్లల వివాహాల కోసం రూ.25 వేల ఆర్థిక సాయం చేసే రూపశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం ఏది ?
జ: పశ్చిమ బెంగాల్ (ముఖ్యమంత్రి : మమతా బెనర్జీ )
11) 2015 ఆగస్టులో లైసెన్స్ పొందిన పేమెంట్స్ బ్యాంకులో దేని కార్యకలాపాలు మొదలైనట్టు ఆర్బీఐ ప్రకటించింది ?
జ: జియో పేమెంట్స్ బ్యాంక్
(నోట్: అప్పట్లో మొత్తం 11 సంస్థలకు ఆర్బీఐ అనుమతి ఇచ్చింది. 2016 నవంబర్ లో ఎయిర్ టెల్ మొదటగా పేమెంట్స్ బ్యాంక్ కార్యకలాపాలు ప్రారంభించింది )
12) తమ కస్టమర్లకు వాట్సాప్ సర్వీసు సేవలను అందుబాటులోకి తేనున్న బ్యాంక్ ఏది ?
జ: ఇండస్ ఇండ్ బ్యాంక్
13) ESPN స్పోర్ట్స్ పర్సన్స్ ఆఫ్ ది ఇయర్ అవార్డులు అందుకున్న భారతీయ ఆటగాళ్ళు ఎవరు ?
జ: భారతీయ బ్యాడ్మింటన్ ప్లేయర్స్ పి.వి.సింధు, కిదాంబి శ్రీకాంత్