Wednesday, May 23
Log In

CURRENT AFFAIRS – APR 30

రాష్ట్రీయం
1) ఆదిలాబాద్ లో కన్నుమూసిన రవీంద్ర శర్మ గురూజీ ఏ రంగంలో ప్రసిద్ధులు ?
జ: కళా రంగం ప్రోత్సాహానికి కళాశ్రమం స్థాపించారు
2) నాగార్జున సాగర్ లో నిర్మిస్తున్న బుద్ధవనాన్ని 2018 అక్టోబర్ 14న (బుద్ధు తొలి సందేశం ఇచ్చిన రోజు) ప్రారంభించాలని భావిస్తున్నారు. బుద్ధవనం ప్రత్యేకాధికారి ఎవరు ?
జ: మల్లేపల్లి లక్ష్మయ్య
3) ఏ రోజును డైరక్టర్స్ డే గా పాటించాలని తెలుగు చలన చిత్ర దర్శకులు నిర్ణయించారు ?
జ: మే 4 (దర్శకరత్న దాసరి నారాయణ రావు జయంతి)
4) వాటర్ మ్యాన్ ఆఫ్ తెలంగాణగా ఎవర్ని పిలుస్తారు ?
జ: విద్యాసాగర్ రావు
(నోట్: డిండి ప్రాజెక్టుకు విద్యాసాగర్ రావు పేరును పెడుతూ ప్రభుత్వం ఇటీవలే ఉత్తర్వులు జారీచేసింది )

జాతీయం
5) వేసవి సెలవుల్లో మూడు కేంద్ర మంత్రిత్వ శాఖలు చేపట్టిన స్వచ్ఛభారత్ ఇంటర్న్ షిప్ లో ఇచ్చిన లక్ష్యాలు పూర్తి చేస్తే UGC ఎన్ని క్రెడిట్ పాయింట్స్ ఇస్తుందని ప్రధాని నరేంద్రమోడీ మన్ కీ బాత్ లో ప్రకటించారు ?
జ: రెండు క్రెడిట్ పాయింట్స్
6) బ్రహ్మోస్ క్షిపణిని భారత్ - రష్యా కలసి సంయుక్తంగా అభివ్రుద్ధి చేశాయి. ఈ క్షిపణి ఎన్ని మ్యాక్ ల వేగంతో ప్రయాణిస్తుంది ?
జ: 2.8 మ్యాక్ లు (ధ్వని వేగం కన్నా 2.8 రెట్లు)
7) బ్రహ్మోస్ ఏరోస్పేస్ ఎండీ ఎవరు ?
జ: సుధీర్ మిశ్ర
8) భారత్ - పాకిస్తాన్ మొదటిసారిగా సంయుక్త విన్యాసాల్లో పాల్గొంటున్నాయి. ఈ విన్యాసాలు ఏ దేశంలో జరగనున్నాయి ?
జ: రష్యాలో ( సెప్టెంబర్ నెలలో )
9) ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసి రికార్డు సృష్టించారు సిక్కిం సీఎం పవన్ చామ్లింగ్. ఆయన మొత్తం ఎంత కాలం పనిచేశారు ?
జ: 23 యేళ్ళ 138 రోజులు
10) చామ్లింగ్ కంటే ముందు పశ్చిమబెంగాల్ సీఎంగా జ్యోతి బసు ఎంత కాలం పనిచేశారు ?
జ: 23 యేళ్ళ 137 రోజులు
11) దేశంలో వచ్చే నెలలో ఎన్ని పోస్ట్ చెల్లింపు బ్యాంకు శాఖలు మొదలవుతాయని కేంద్ర కమ్యూనికేషన్ల సహాయ మంత్రి మనోజ్ సిన్హా వెల్లడించారు ?
జ: 650 శాఖలు
12) కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి ఎవరు ?
జ: సుభాష్ చంద్ర గార్గ్

అంతర్జాతీయం
13)పర్యావరణ హితమైన ఎన్ని సార్లైనా పునర్వినియోగం (రీసైకిల్) చేసే వీలున్న కొత్త తరహా ప్లాస్టిక్ ను ఏ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు ?
జ: అమెరికాలోని కొలరాడో స్టేట్ యూనివర్సిటీ పరిశోధకులు
14) ఫార్ములా వన్ అజర్ బైజాన్ గ్రాండ్ ప్రిని గెలుచుకున్నది ఎవరు ?
జ: లూయిస్ హామిల్టన్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *