Sunday, December 16

CURRENT AFFAIRS APR 29

రాష్ట్రీయం
1) రాష్ట్ర ప్రభుత్వం సమాచారం అంతా ఒకే దగ్గర లభించేలా రూపొందిస్తున్న టీ వెబ్ ను ఎప్పుడు ప్రారంభించనున్నారు?
జ: 2018 జూన్ 2
(నోట్: ఇందులో ప్రభుత్వ శాఖలు, కార్పొరేషన్లు, సంస్థలు నిర్వహించే 265 వెబ్ సైట్లను మానిటరింగ్ చేస్తారు )
2) 2018 మే 6న ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ తో కలిసి దక్కన్ డైలాగ్ 2018 పేరుతో సదస్సును ఎక్కడ నిర్వహించనున్నారు ?
జ: హైదరాబాద్ లో
3) 400 ఎకరాల్లో గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ ను ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు ?
జ: యాదాద్రి భువనగిరి జిల్లా దండు మల్కాపురంలో
4) ప్రతి నెలా ఏ రోజున జిల్లా కేంద్రాల్లో సివిల్ రైట్స్ డే నిర్వహించాలని ఎస్సీ, ఎస్టీ కమిషన్ నిర్ణయించింది ?
జ: 30వ తేదీన
5) తెలంగాణ ఆర్థిక సంఘం ఛైర్మన్ ఎవరు ?
జ: గొడిశాల రాజేశం గౌడ్
6) చైనాలోని షాంఘైలో జరుగుతున్న ఆర్చరీ ప్రపంచ కప్ లో కాంపౌండ్ మిక్స్ డ్ పెయిర్ విభాగంలో పతకం గెలుచుకున్నతెలుగు అమ్మాయి ఎవరు ?
జ: జ్యోతి సురేఖ

జాతీయం
7) చారిత్రక ఎర్రకోటను వచ్చే ఐదేళ్ళపాటు నిర్వహణ, అభివృద్ధి పనులు చేపట్టడానికి కేంద్ర ప్రభుత్వం ఎవరికి కాంట్రాక్ట్ కి ఇచ్చింది ?
జ: దాల్మియా భారత్ గ్రూప్
8) జాతీయ స్థాయి స్మార చిహ్నాన్ని ప్రైవేటు కంపెనీకి అప్పగించడం దేశ చరిత్రలో ఇదే ప్రథమం. కిందటేడాది సెప్టెంబర్ 17న దీనికి సంబంధించిన ఏ పథకాన్ని రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ ప్రకటించారు ?
జ: స్మారక చిహ్నాల దత్తత పథకం
9) పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన తేలికపాటి యుద్ధ విమానం ద్వారా ఆకాంశం నుంచి ఆకాశంలోకి దూసుకుపోయే ఏ క్షిపణిని విజయవంతంగా ప్రయోగించారు ?
జ: బీవీఆర్ క్షిపణి
10) మన దేశంలో తేజస్ యుద్ధ విమానాన్ని ఏయే సంస్థలు సంయుక్తంగా రూపొందించాయి ?
జ: హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, DRDO, ఏరోనాటికల్ అభివృద్ధి సంస్థ
11) 2018-19 ఆర్థిక సంవత్సరంలో దేశ ఆర్థిక వృద్ధి రేటు ఎంతకు చేరుకుంటుందని నీతి ఆయోగ్ ప్రకటించింది ?
జ: 7.5శాతం
12) నో టాయిలెట్ - నో రైస్ పేరుతో ఏ రాష్ట్రంలో జారీ చేసిన ఉత్తర్వులు వివాదస్పదం అయ్యాయి ?
జ: పుదుచ్చేరి
(నోట్: లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ ఈ ఉత్తర్వులు ఇచ్చారు )
13) భారత దేశంలో అత్యంత సుదీర్ఘ కాలం ముఖ్యమంత్రిగా కొనసాగి, గతంలో జ్యోయతి బసు రికార్డును ఎవరు అధిగమించారు ?
జ: సిక్కిం సీఎం పవన్ చామ్లింగ్

https://telanganaexams.com/si-pc-mocktests/