Tuesday, September 25
Log In

CURRENT AFFAIRS – APR 28

రాష్ట్రీయం
1) సివిల్స్ 2017 ఫలితాల్లో దేశంలోనే మొదటి ర్యాంకు సాధించిన తెలంగాణ బిడ్డ ఎవరు ?
జ: అనుదీప్
(నోట్: మెట్ పల్లి, జగిత్యాల జిల్లా )

జాతీయం
2) ప్రధాని నరేంద్రమోడీ, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ మధ్య హార్ట్ టు హార్ట్ సమ్మిట్ ఎక్కడ జరుగుతోంది ?
జ: వుహాన్ ( చైనా)
3) సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఇందూ మల్హోత్రా ప్రమాణం చేశారు. మల్హోత్ర ప్రమాణంతో సుప్రీంకోర్టులో జడ్జీల సంఖ్య ఎంతకు చేరింది ?
జ: 25
4) సుప్రీంకోర్టులో మొత్తం ఎంతమంది న్యాయమూర్తులు ఉండవచ్చు ?
జ: 31మంది
5) ప్రస్తుతం ప్రమాణం చేసిన ఇందూ మల్హోత్రాతో పాటు సుప్రీంకోర్టులో మరో మహిళా న్యాయమూర్తి కూడా ఉన్నారు. ఆమె పేరేంటి ?
జ: జస్టిస్ భానుమతి
(నోట్: 2014 ఆగస్టు నుంచి కొనసాగుతున్నారు )
6) చెన్నైలో జరుగుతున్న సౌత్ ఇండియా మీడియా సమ్మిట్ 2018 ను ఎవరు ప్రారంభించారు ?
జ: తమిళనాడు గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్
7) సైన్యానికి రూ.3,687 కోట్ల విలువైన 127 MM తుపాకులతో కూడిన నాగ్ క్షిపణి వ్యవస్థను సమకూర్చబోతున్నారు. ఈ వ్యవస్థను రూపొందించింది ఎవరు ?
జ: DRDO
8)నాగ్ క్షిపణి వ్యవస్థలోని 127MM తుపాకులు ఎన్ని కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలవు ?
జ: 24 కిలోమీటర్ల దూరంలోని
9) 2017 ఏడాదికి సరస్వతి సమ్మాన్ అవార్డు ఎవరికి దక్కింది ?
జ: ప్రముఖ గుజరాతీ రచయిత సీతాన్షు యశశ్చంద్ర
(నోట్: వాఖర్ అనే కవితా సంకలనానికి ఈ అవార్డు దక్కింది )
10) చైన్నైలో చనిపోయిన ఈరంకి శర్మ ఏ రంగానికి చెందిన వారు ?
జ: సీనియర్ దర్శకుడు - సినిమా రంగం
11) వరుసగా 12వ ఏడాదీ కూడా భారత సార్వ భౌమ రేటింగ్ ను ఫిచ్ ప్రకటించింది. ఆ రేటింగ్ ఏది ?
జ: BBB మై మనస్
12) 5,380 మీటర్ల ఎత్తులో ఉన్న కిలిమంజారోని అధిరోహించిన అతి చిన్న వయస్కుడిగా ఎవరు రికార్డు సృష్టించారు ?
జ: సమన్యు యాదవ్ ( ఏడేళ్ళు )
(నోట్: ఏపీలోని కర్నూలు జిల్లా బాలాజీ నగర్ కు చెందిన బుడతడు)

అంతర్జాతీయం
13) ఉత్తర, దక్షిణ కొరియాల దేశాధ్యక్షులు కిమ్ జంగ్ ఉన్, మూన్ జె ఇన్ ల శిఖరాగ్ర సమావేశం ఎక్కడ జరిగింది ?
జ: పాన్ మున్జోమ్ (ఉభయ కొరియాల శాంతి గ్రామం. పీస్ హౌస్ లో )
14) అమెరికా విదేశాంగమంత్రిగా ఎవరు ప్రమాణం చేశారు ?
జ: మైక్ పాంపియో (CIA మాజీ డైరక్టర్ )
15) అమెరికాలోని ఇండియానా పలిస్ లో ఎడ్యుకేషన్ సెంటర్ ను ఏర్పాటు చేస్తున్న భారత ఐటీ దిగ్గజం ఏది ?
జ: ఇన్ఫోసిస్
(నోట్: అమెరికన్ వర్కర్లకి బిగ్ డేటా, క్లౌడ్, కోర్ టెక్నాలజీ మొదలైన డిజిటల్ నైపుణ్యాల్లో శిక్షణ ఇవ్వనుంది )`