Saturday, February 23

CURRENT AFFAIRS – APR 26&27

రాష్ట్రీయం
1) టీ యాప్ ఫోలియా అనే ఒక యాప్ తో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఎన్ని సేవలను పొందవచ్చు ?
జ: 150 సర్వీసులు
2) రాష్ట్రంలో పదో తరగతి వరకూ తెలుగును తప్పనిసరి సబ్జెక్టుగా అమలు చేయడానికి అవసరమైన నిబంధనల రూపకల్పన కమిటీకి ఎవరు కన్వీనర్ గా ఉంటారు ?
జ: పాఠశాల విద్యా కమిషనర్ కిషన్
3) అంగన్ వాడీ సేవలకు ప్రభుత్వం ప్రారంభించిన ప్రత్యేక హెల్ప్ లైన్ నెంబర్ ఎంత ?
జ: 155209
4) ప్రత్యేక పరిస్థితుల్లో దళితులను ఆదుకునేందుకు 2018-19 సంవత్సరానికి ఎస్సీ సంక్షేమ శాఖ ఎంత మొత్తంతో అత్యవసర సంక్షేమ నిధిని ఏర్పాటు చేసింది ?
జ: రూ.62 కోట్లతో
5) జూన్ 2019 లో చేపట్టే నాలుగో విడత హరితహారంలో ఏ మొక్కలకు ప్రాధాన్యత ఇవ్వాలని అటవీశాఖ నిర్ణయించింది ?
జ: వెదురు మొక్కలు
6) మన రాష్ట్రంలో రైతులకు ఉత్తమ సేవలను అందించినందుకు గాను ఏ మార్కెట్ కు ISO 9001:2015 సర్టిఫికెట్ లభించింది ?
జ: సిద్ధిపేట

జాతీయం
7) పత్రికా స్వేచ్ఛ సూచీలో భారత్ కు ఎంత ర్యాంకు వచ్చింది ?
జ: 138 (గత ఏడాది 136 వ ర్యాంకు )
(నోట్: రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ అనే అంతర్జాతీయ సంస్థ ఈ రిపోర్ట్ వెల్లడించింది )
8) పునర్వ్యస్థీకృత జాతీయ వెదురు మిషన్ ( NBM) కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. అందుకోసం ఎంత మొత్తాన్ని కేటాయించారు ?
జ: రూ.1290 కోట్లు
9) సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా కొలీజియం సిఫార్సు చేసిన ఎవరి పేరును కేంద్ర ప్రభుత్వం తిప్పి పంపింది ?
జ: జస్టిస్ కె.ఎం.జోసెఫ్
(నోట్: ఉత్తరాఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్నారు )
10) పోక్సో - 2012 చట్టం దేనికి సంబంధించింది ?
జ: చిన్నారులపై జరిగే లైంగిక దాడులకు
11) మన దేశానికి చెందిన ఏ బ్యాంకుకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రతిష్టాత్మక గోల్డెన్ పీకాక్ అవార్డు 2018 దక్కింది ?
జ: ఇండియన్ బ్యాంక్
(నోట్: ఇండియన్ బ్యాంక్ ఎండీ అండ్ సీఈఓ కిషోర్ కారత్. బిజినెస్ ఎక్స్ లెన్స్ అండ్ ఇన్నోవేషన్ లీడర్షిప్ పై జరిగిన 28వ ప్రపంచ సదస్సులో ఈ అవార్డుల ప్రదానం జరిగింది )
12) భారత ఫుట్ బాల్ జట్టు మాజీ కెప్టెన్ బైచుంగ్ భూటియా ఏ పేరుతో కొత్త రాజకీయ పార్టీని పెట్టారు ?
జ: హమ్రో సిక్కిం
13) ఇస్రో చరిత్రలోనే భారీ ఉపగ్రహం జీశాట్ 11ను ఎక్కడి నుంచి ప్రయోగించేందుకు సిద్ధం చేస్తున్నారు ?
జ: ఫ్రెంచి గయానా కౌరు అంతరిక్ష కేంద్రం నుంచి
14) జీశాట్ 11 భారీ ఉపగ్రహం బరువు ఎంత ?
జ: 5,725 కిలోలు
(నోట్: గతంలో 3,477 కిలోల బరువున్న జీశాట్ 17 ను ప్రయోగించారు. ఇందులో 42 ట్రాన్స్ పాండర్లు అమర్చారు. ఇప్పుడు 40 ట్రాన్స్ పాండర్లు అమరుస్తున్నారు )

అంతర్జాతీయం
15) అమెరికాల విదేశాంగ మంత్రిగా ఎవరికి సెనేట్ ఆమోదం తెలిపింది ?
జ: మైక్ పాంపియో ( CIA మాజీ డైరక్టర్ )
16) భారత్ - చైనా మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 2017 ఎన్ని డాలర్లను అధిగమించింది ?
జ: 80 బిలియన్ డాలర్లు.
17) చైనా ఉత్పత్తులకు ప్రధాన విపణుల్లో భారత్ స్థానం ఎంత ?
జ: 7 వ స్థానం
18) చైనాకి వజ్రాలు, నూలు ఎగుమతి చేసే దేశాల్లో భారత్ స్థానం ఎంత ?
జ: రెండు
19) 2021లో భారత్ లో జరగాల్సిన ICC ఛాంపియన్స్ ట్రోఫీని రద్దు చేశారు. దీని స్థానంలో ఏ ట్రోఫీని నిర్వహించనున్నారు ?
జ: టీ20 ప్రపంచ కప్
20) 2020లో టీ20 ప్రపంచ కప్ కు ఆతిధ్యం ఇస్తున్న దేశం ఏది ?
జ: ఆస్ట్రేలియా
21) ఎన్ని సభ్యదేశాలకు టీ20 హోదాను ఇవ్వాలని అంతర్జాతీయ క్రికెట్ మండలి నిర్ణయించింది ?
జ: 104
22) అంతర్జాతీయ క్రికెట్ మండలి ( ICC) ముఖ్య కార్వనిర్వహక అధికారి ఎవరు ?
జ: డేవ్ రిచర్డ్ సన్

RRB (గ్రూప్ C &D) 10 గ్రాండ్ టెస్టులు
https://telanganaexams.com/rrb-gt-tests/