Wednesday, March 20

CURRENT AFFAIRS – APR 25

రాష్ట్రీయం
1) జోగులాంబ గద్వాల జిల్లాలో 33 వేల ఎకరాల ఆయకట్టుకు నీరందించేందుకు రూ.581 కోట్లతో ఏ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ?
జ: గట్టు ఎత్తిపోతల పథకం
2) పర్యావరణానికి మేలు చేసే చర్యలు చేపట్టినందుకు జీఎంఆర్ విమానాశ్రయానికి ఏ సంస్థ నుంచి హరిత పురస్కారం లభించింది ?
జ: ఆసియా-పసిఫిక్ గ్రీన్ ఎయిర్ పోర్ట్స్ - 2018
3) 32వ అంతర్జాతీయ విత్తన పరీక్ష అసోసియేషన్ (ఇస్టా) కాంగ్రెస్ ను 2019 జూన్ 26 నుంచి జులై 3 వరకూ ఎక్కడ నిర్వహించనున్నారు ?
జ: హైదరాబాద్ లో
(నోట్: ఇస్టా కాంగ్రెస్ సెక్రటరీ జనరల్ డాక్టర్ ఆండ్రేయాస్ వాయీస్ )

జాతీయం
4) 2018 ఏప్రిల్ 24న జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం సందర్భంగా రాష్ట్రీయ గ్రామస్వరాజ్ అభియాన్ కార్యక్రమాని ప్రధాని నరేంద్ర మోడీ ఏ రాష్ట్రంలో ప్రారంభించారు ?
జ: మధ్యప్రదేశ్ లో (రాంనగర్ )
5) జాతీయ పంచాతీయ రాజ్ దినోత్సవం సందర్భంగా తెలంగాణకి ఈ-పంచాయతీ విశిష్ట పురస్కారం లభించింది. ప్రధాని నరేంద్రమోడీ చేతుల మీదుగా ఈ అవార్డును ఎవరు అందుకున్నారు ?
జ: రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ నీతూ ప్రసాద్
6) దిగంబర్ పూర్ గ్రామపంచాయతీని దేశంలోనే ఉత్తమ పంచాయతీగా ప్రకటించారు. ఇది ఏ రాష్ట్రంలో ఉంది ?
జ: పశ్చిమబెంగాల్
7) భారత్ లో 2018 సివిల్ సర్వీసెస్ డే ను ఏ రోజున జరుపుకుంటారు ?
జ: ఏప్రిల్ 21
(1947లో ఇదే రోజున అప్పటి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లను ఉద్దేశించి మాట్లాడారు )
8) 2017-18 ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ రంగానికి ఎన్ని లక్షల కోట్ల రుణాలను ఇచ్చినట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది ?
జ: రూ.10లక్షల కోట్లు దాటాయి
9) అణు, క్రిమియుద్ధం వచ్చినప్పుడు ఎదుర్కునే సామర్థ్యాన్ని పరిశీలించేందుకు భారత వాయు సేన చేపట్టిన విన్యాసాల పేరేంటి ?
జ: గగన్ శక్తి
10) ఇంటిగ్రేటెడ్ టౌన్ షిప్ ఆఫ్ ది ఇయర్ - ఇండియా విభాగంలో గోల్డన్ గ్లోబ్ టైగర్స్ అవార్డు ఏ సంస్థకు దక్కింది ?
జ: శ్రీ సిటీ (సత్యవేడు - ఆంధ్రప్రదేశ్ )
11) బసవ సాగర్ డ్యామ్ ఏ రాష్ట్రంలో ఉంది ?
జ: కర్ణాటక
12)ఆసియా వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ పోటీలు వచ్చే ఏడాది ఏ దేశంలో జరగనున్నాయి ?
జ: భారత్

అంతర్జాతీయం
13) అమెరికాలో H1B వీసాదారుల భార్య లేదా భర్తలు ఉద్యోగం చేసుకునేందుకు వీలుగా జారీ చేసే ఏ వీసాలను రద్దు చేయాలని నిర్ణయించారు ?
జ: H-4
14) అత్యంత దృఢమైన, పర్యావరణ హిత దీర్ఘకాలికంగా మన్ని ఉండే ఏ కాంక్రీటును లండన్ శాస్త్రవేత్తలు తయారు చేశారు ?
జ: గ్రాఫీన్ కాంక్రీట్
15) 2018 మాంటే కార్లో మాస్టర్స్ టెన్నిస్ టోర్నమెంట్ విజేత ఎవరు ?
జ: రాఫెల్ నాదల్
16) కింగ్ డమ్ ఆఫ్ ఇస్వటినీ (Kingdom of Eswatini) గా పేరు మార్చుకున్నదేశం ఏది ?
జ: స్వాజిలాండ్

రూ.200 స్పెషల్ డిస్కౌంట్ ( ఈనెల 25 వరకూ పొడిగింపు )
SI/PC/GR.II/VRO మాక్ టెస్టులకు ఆఫర్స్
https://telanganaexams.com/discount/

RRB (గ్రూప్ C &D) 10 గ్రాండ్ టెస్టులు
(డిస్కౌంట్ రేటు ఈనెల 25 వరకూ పొడిగింపు)
https://telanganaexams.com/rrb-gt-tests/