Wednesday, May 23
Log In

CURRENT AFFAIRS – APR 21 & 22

రాష్ట్రీయం
1) తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగాల్లో క్రీడాకారులకు ఎంత శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నట్టు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు ?
జ: 2 శాతం రిజర్వేషన్
2) నిరుద్యోగ యువతకి ఉపాధి కల్పిస్తూ దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచినందుకు ఏ జిల్లా కలెక్టర్ కి కేంద్ర ప్రభుత్వ అవార్డు లభించింది ?
జ: కరీంనగర్ జిల్లా కలెక్టర్ సర్పరాజ్ అహ్మద్
3) రాష్ట్రంలో ఎన్ని పంచాయతీలకు త్వరలో ఎన్నికలు జరుగుతాయి ?
జ: 12,751 పంచాయతీలు (1,13,380 వార్డులు )
4) నిబంధనల ప్రకారం గ్రామపంచాతీయల కొత్త పాలక మండలి ఎప్పుడు బాధ్యతలు చేపట్టాలి ?
జ: 2018 ఆగస్టు 1 కల్లా

జాతీయం
5) దేశంలో తొలి నగదు రహిత దీవిగా ఏది నిలచింది ?
జ: మణిపూర్ లోని కరంగ్ (97 శాతం డిజిటల్ విధానంలోనే చెల్లిస్తారు )
6) ఎన్నేళ్ల లోపు చిన్నారులపై అత్యాచారం చేస్తే మరణశిక్ష విధించాలని కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది ?
జ: 12 యేళ్ళ లోపు
7) భారత ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా అభిశంసనకు ఎంతమంది సభ్యులు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడికి నోటీస్ ఇచ్చారు ?
జ: 64మంది
8) ఢిల్లీలో మరణించిన సచార్ కమిటీ సారధి, ఢిల్లీ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎవరు ?
జ: రాజీందర్ సచార్
9) పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరు ?
జ: కిరణ్ బేడీ
10) దేశంలో మొట్టమొదటి 100 బిలియన్ డాలర్ల కంపెనీగా అవతరించనున్న కంపెనీ ఏది ?
జ: TCS (టాటా కన్సల్టన్సీ సర్వీసెస్ )
11) శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ (SVBC) ఛైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు ?
జ: దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు
12) టీటీడీ పాలకమండలి అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు ?
జ: పుట్టా సుధాకర్ యాదవ్

అంతర్జాతీయం
13) అణు పరీక్షలు, ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం జరపబోమని ప్రకటించిన దేశం ఏది ?
జ: ఉత్తర కొరియా

రూ.200 స్పెషల్ డిస్కౌంట్
SI/PC/GR.II/VRO/RRB మాక్ టెస్టులకు ఆఫర్స్

రూ.200 స్పెషల్ డిస్కౌంట్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *