Saturday, March 23

CURRENT AFFAIRS – APR 20

రాష్ట్రీయం
1) రాష్ట్రంలోని ఏ నీటిపారుదల ప్రాజెక్టుకు కేంద్ర వన్యప్రాణి బోర్డు నుంచి అనుమతి లభించింది ?
జ: సీతారామ ప్రాజెక్టు ( కిన్నెరసాని - భద్రాద్రి కొత్తగూడెం జిల్లా )
2) రాష్ట్రంలో బోదకాలు బాధితులకు నెలవారిగా ఎంత మొత్తం ఫించన్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ?
జ: రూ.1000 ( మే నెల నుంచి )
(నోట్: రాష్ట్రంలో మొత్తం 44,653 మందిని గుర్తించారు )
3) గృహ నిర్మాణ ప్రక్రియలో అవలంభిస్తున్న విధానాలకు గుర్తింపుగా ప్రధానమంత్రి ఎక్స్ లెన్స్ అవార్డుతో దేశంలోనే ఘనత సాధించిన మొదటి సంస్థగా ఏది నిలిచింది ?
జ: గ్రేటర్ మున్సిపల్ కార్పోరేషన్ ఆఫ్ హైదరాబాద్ (GHMC)
4) డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ నిర్మాణంలో మెరుగైన పనితీరు కనబరుస్తున్న ఏ సంస్థ కు హడ్కో అవార్డు దక్కింది ?
జ: తెలంగాణ హౌసింగ్ కార్పోరేషన్
5) హైదరాబాద్ మోట్రో ప్రయాణీకుల కోసం ఏ క్యాబ్ సంస్థతో హైదరాబాద్ మెట్రో రైలు ఒప్పందం కుదుర్చుకుంది ?
జ: ఉబర్
6) ప్రతిష్టాత్మక యుధ్ వీర్ స్మారక పురస్కారం దక్కించుకున్న హైదరాబాద్ యువకుడు ఎవరు ?
జ: సయ్యద్ ఉస్మాన్ అజహర్ మక్సూసీ
(నోట్: ఉచిత అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్న యువకుడు )
7) బీజీ-3కి ఉపయోగించే ఏ కలుపు మందును నిషేధించాలని వ్యవసాయశాఖ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది ?
జ: గ్లైపోసెట్

జాతీయం
8) ఫార్చ్యూన్ విడుదల చేసిన 50 మంది ప్రపంచ గొప్ప నేతల్లో చోటు సంపాదించిన భారతీయ కుబేరుడు ఎవరు ?
జ: ముకేశ్ అంబానీ (24వ స్థానం )
9) టైమ్ మేగజైన్ రూపొందించిన ప్రపంచంలోని 100మంది ప్రభావశీల వ్యక్తుల జాబితాలో చోటు దక్కించుకున్న మన దేశానికి చెందిన ప్రముఖులు ఎవరు ?
జ: ఓలా సంస్థ సహ వ్యవస్థాపకుడు భవీష్ అగర్వాల్
10) బాలీవుడ్ నటులు దీపికా పదుకొణె
క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ
మైక్రో సాఫ్ట్ CEO సత్య నాదెళ్ళ
11) లైంగిక వేధింపుల నివారణకు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్ ఎంత ?
జ: 1098
12) నగదు కొరత ఉండటంతో తమ పాయింట్ ఆఫ్ సేల్ (POS) మిషన్ల నుంచి ఎలాంటి ఛార్జీలు లేకుండా రూ.2వేలు డ్రా చేసుకోడానికి అనుమతి ఇచ్చిన బ్యాంకు ఏది ?
జ: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)
13) స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఛైర్మన్ ఎవరు ?
జ: రజనీశ్ కుమార్
14) ఏపీలో డిప్యూటీ కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు ఎవరు ?
జ: కిదాంబి శ్రీకాంత్
15) సెంచురీ పరుపుల ప్రచారకర్తగా ఎవరు నియమితులయ్యారు ?
జ: టెన్నిస్ స్టార్ సానియా మీర్జా

అంతర్జాతీయం
16) క్యూబా కొత్త అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు ?
జ: డియాజ్ కైనల్
17) అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ ( IMF) చీఫ్ ఎవరు ?
జ: క్రిస్టీన్ లగార్డె
18) కామన్వెల్త్ దేశాల కూటమికి అధినేతగా ఎవరిని నియమించే అవకాశముంది ?
జ: యువరాజు ఛార్లెస్
19) సౌర కుటుంబం వెలుపల జీవ గ్రహాల ఉనికి కనుక్కోడానికి టెస్ (Transiting Explanet Survey Sattellite) ఉపగ్రహాన్ని ప్రయోగించిన సంస్థ ఏది ?
జ: నాసా ( అమెరికా అంతరిక్ష సంస్థ )
20) 250 యేళ్ళ తర్వాత జపాన్ లో భగ్గుమంటున్న అగ్నిపర్వతం ఏది ?
జ: కిరిషిమా కనుమల్లో
21) ఇస్లామిక్ రాజ్యమైన సౌదీ అరేబియాలో 35 యేళ్ళ తర్వాత తొలిసారి సినిమా థియేటర్ ప్రారభమైంది. ఇందులో ప్రదర్శించిన మొదటి సినిమా ఏది ?
జ: బ్లాక్ పంథర్ (హాలీవుడ్ మూవీ )
(నోట్: రియాద్ లో AMC ఎంటర్ టైన్ మెంట్ సంస్థ నిర్మించింది )