Tuesday, September 25
Log In

CURRENT AFFAIRS – APR 2, 3

రాష్ట్రీయం
1) రాష్ట్రంలో సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల సమస్యలను గుర్తించి, ఖాయిలా పడ్డ వాటిని ఆదుకునేందుకు ఏర్పాటైన రాష్ట్ర పారిశ్రామిక ఆరోగ్య కేంద్రాన్ని ఎవరు ప్రారంభించారు ?
జ: రాష్ట్ర పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్
2) 2017-18 సంవత్సరంలో సింగరేణికి ఎంత లాభం వచ్చినట్టు సంస్థ ప్రకటించింది ?
జ: రూ.12 వందల కోట్లు
3) విద్యుదుత్పత్తిలో జాతీయ స్థాయిలో సింగరేణికి ఎన్నో స్థానం లభించింది ?
జ: 5 వ స్థానంలో

జాతీయం
4) 1976లో పౌర హక్కుల రక్షణ చట్టం ను 1989లో ఏ చట్టంగా పేరు మార్చారు ?
జ: ఎస్టీ, ఎస్టీల వేధింపుల నిరోధక చట్టం
5) నాస్కామ్ అధ్యక్షురాలిగా ఎవరు బాధ్యతలు స్వీకరించారు ?
జ: దేవయాని ఘోష్
6) అసోచామ్ - యెస్ ఇనిస్టిట్యూట్ రూపొందించిన నివేదిక ప్రకారం ప్రపంచంలోని 200 అగ్రశ్రేణి యూనివర్సిటీలలో మన దేశానికి చెందిన ఏయే సంస్థలకు స్థానం దక్కింది
జ: ఐఐటీ ఢిల్లీ, ఢిల్లీ విశ్వ విద్యాలయం
7) SBI జీవిత బీమా ఎండీ CEO గా ఎవరు నియమితులయ్యారు ?
జ: సంజీవ్ నౌతియాల్
8) పద్మభూషణ్ అందుకున్న భారత్ క్రికెటర్ ఎవరు ?
జ: ఎం.ఎస్.ధోనీ

అంతర్జాతీయం
9) చైనా అంతరిక్ష కేంద్రం తియాంగాంగ్ - 1 ప్రస్థానం ముగిసింది. భూ వాతావరణంలోకి ప్రవేశించి మండిపోయింది. దీన్ని ఎప్పుడు ప్రయోగించారు ?
జ: 2011 సెప్టెంబర్ 29 న ప్రయోగించారు
(నోట్: 2022 కల్లా సొంతంగా ఒక అంతరిక్ష కేంద్రం ఏర్పాటు చేసుకోవాలనుకున్నారు. అయితే 2016 మార్చి నుంచి ఇది పనిచేయడం లేదు)
10) తియాంగాంగ్ - 1 అంతరిక్ష కేంద్రం శకలాలు ఎక్కడ పడ్డాయి ?
జ: దక్షిణ పసిఫిక్ సముద్రంలో
11) మహిళలకు కూడా పురుషులతో పాటు సమానంగా వేతనాలు చెల్లించాలంటూ మొదలైన ఆన్ లైన్ ఉద్యమాన్ని బ్రిటన్ ఎంపీ ప్రారంభించారు. దాని పేరేంటి ?
జ: పే మీ టూ హ్యాష్ ట్యాగ్
12) దక్షిణాఫ్రికా పోరాటయోధుడు నెల్సన్ మండేలా మాజీ భార్య కన్నుమూశారు. ఆమె పేరేంటి ?
జ: విన్నీ మడికిజెల మండేలా

RRB MOCK TESTS, GRAND TESTS

అర్థమెటిక్, రీజనింగ్ ప్రశ్నలపై స్పెషల్ క్లాసులు

http://tsexams.com/rrb-mock-tests-grand-tests/