Tuesday, September 25
Log In

CURRENT AFFAIRS – APR 19

రాష్ట్రీయం
1) రాష్ట్రంలోని ఏ ఎత్తిపోతల పథకానికి దివంగత నీటిపారుదల సలహాదారు శ్రీ రామరాజు విద్యాసాగర్ రావు పేరును పెడుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ?
జ: డిండి ఎత్తిపోత పథకం
2) రైతు బంధం పథకంపై అధ్యయనం చేయనున్న అమెరికాకు చెందిన ప్రపంచ ప్రసిద్ధ పరిశోధనా కేంద్రం ఏది ?
జ: జే-పాల్ పరిశోధనా కేంద్రం
3) మేలుకొలుపు పుస్తకాన్ని ఎవరు రాశారు ?
జ: మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అజయ్ కల్లం
4) తెలంగాణ చలన చిత్ర అభివృద్ధి సంస్థకు కొత్త చిహ్నాన్ని ఆవిష్కరించారు. ప్రస్తుతం ఈ సంస్థ ఛైర్మన్ ఎవరు ?
జ: పి.రామ్మోహన్ రావు
5) ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫిక్కీ) మహిళా ఆర్గనైజేషన్ FLO కు నేషనల్ ప్రెసిడెంట్ గా ఎవరు ఎన్నికయ్యారు ?
జ: పింకీ రెడ్డి

జాతీయం
6) నిరంతర విద్యుత్తు పౌరుల హక్కు అనే లక్ష్యంతో ఎప్పటి లోగా అన్ని గ్రామాలకు విద్యుత్ సరఫరా చేయాలని అందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది ?
జ: 2019 మే 1 నాటికి
7) పరివర్తన యాత్ర నినాదంతో జాతీయ స్థాయి ప్రదర్శన ఇచ్చిన ఏ రైల్వేకి ప్రథమ బహుమతి లభించింది ?
జ: దక్షిణ మధ్య రైల్వే
(నోట్: గోవింద్ వల్లభ్ పంత్ పురస్కారం ఇచ్చారు. దీంతో పాటు ఆరు సామర్థ్య విభాగాలతో పురస్కారాలు లభించాయి )
8) ఆర్థిక స్వేచ్ఛా సూచీలో భారత్ కు ఎంత స్థానం లభించింది ?
జ: 130 వస్థానం
9) 4జీ డౌన్లోడ్ స్పీడ్ లో భారత్ లో అగ్రస్థానంలో నిలిచిన ప్రొవైడర్ ఏది ?
జ: ఎయిర్ టెల్ ( డౌన్లోడ్ స్పీడ్ 9.31 ఎంబీ)
10) అమెరికా లాస్ ఏంజెల్స్ లోని సైమన్ వీసెంథల్ కేంద్రం మన దేశానికి చెందిన ఎవరికి ఇంటర్నేషనల్ లీడర్షిప్ అవార్డు ప్రదానం చేసింది ?
జ: ఆధ్యాత్మిక గురువు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ వ్యవస్థాపకుడు శ్రీ శ్రీ రవి శంకర్
11) సంచార్ క్రాంతి యోజన పథకం కింద ఏ రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా 50 లక్షల మందికి స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేయనుంది ?
జ: ఛత్తీస్ గఢ్
12) ఇటీవల ప్రకటించిన జాతీయ చలన చిత్ర అవార్డుల్లో ఉత్తమ చిత్రంగా ఎంపికైన సినిమా ఏది ?
జ: విలేజ్ రాక్ స్టార్స్
13) ఇటీవల ముగిసిన కామన్వెల్త్ క్రీడల్లో హ్యాట్రిక్ కొట్టిన రెజ్లర్ ఎవరు ?
జ: సుశీల్ కుమార్ ( వరుసగా మూడోసారి కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణం గెలిచాడు )

అంతర్జాతీయం
14) అమెరికా మాజీ అధ్యక్షుడు, సీనియర్ బుష్ భార్య కన్నుమూశారు. ఆమె పేరేంటి ?
జ: బార్బరా బుష్

SI/PC/GR.II/VRO/GR.IV మాక్ టెస్టుల కోసం క్లిక్ చేయండి :

http://tsexams.com/pcvro-mock-test/

 

Comments are closed.