Thursday, March 21

CURRENT AFFAIRS APR 01

రాష్ట్రీయం
1) రాష్ట్రంలో ఇబ్బందుల్లో ఉన్న పరిశ్రమలను ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం రేపటి నుంచి ప్రారంభించే కేంద్రం పేరేంటి ?
జ: తెలంగాణ పారిశ్రామిక ఆరోగ్య కేంద్రం ( ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ )
2) పేదింటి ఆడపిల్లల పెళ్ళిళ్ళ కు ప్రభుత్వం ఆర్థిక సాయం చేసే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకు ఏప్రిల్ 1, 2018 నుంచి ఎంత మొత్తం చెల్లించనున్నారు ?
జ: రూ.1,00,116 లు ( గతంలో రూ.75,116 లుగా ఉండేవి )
3) రేషన్ కార్డుదారులు ఇకపై ఏ రేషన్ షాపు నుంచైనా బియ్యం, ఇతర నిత్యావసర వస్తువులు పొందేలా రేషన్ పోర్టబిలిటీ విధానాన్ని ఎప్పటి నుంచి అమల్లోకి తెస్తున్నారు ?
జ: ఏప్రిల్ 1 , 2018
(నోట్: పౌరసరఫరాల శాఖ కమిషనర్ సి.వి. ఆనంద్. దీంతో 2.75కోట్ల మందికి ప్రయోజనం కలుగుతుంది )
4) 2018 ఆసియా పరిధిలోని 300మంది యంగ్ ఇన్నోవేటర్స్ లో తొలి 30 మందిలో ఒకరిగా నిలిచిన హైదరాబాద్ HCU విద్యార్థి ఎవరు ?
జ: రాహుల్ గాయమ్
5) కుఫ్టి, పిప్పల్ కోటి, గోముత్రి ప్రాజెక్టుల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఈ రిజర్వాయర్లు ఏ జిల్లాలో ఉన్నాయి ?
జ: ఆదిలాబాద్

జాతీయం
6) వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరడంతో దేశంలోనే మొదటగా ఏ నగరంలో యూర్-6 (BS 6) ప్రమాణాలతో కూడిన పెట్రోల్, డీజెల్ లు అమ్మకాలను ఏప్రిల్ 1, 2018 నుంచి మొదలుపెట్టారు ?
జ: న్యూ ఢిల్లీలో
7) యూరో -6 కి చెందిన పెట్రోల్, డీజెల్ ను హైదరాబాద్ లో ఎప్పటి నుంచి విక్రయిస్తారు ?
జ: 2019 జనవరి 1 నుంచి ( దేశంలోని 13 నగరాల్లో ఆ రోజు నుంచే మొదలవుతాయి)
8) భారతీయుల మెదడు నమూనాను ఏ పరిశోధనా కేంద్రం తయారు చేస్తోంది ?
జ: జాతీయ మెదడు పరిశోధనా కేంద్రం ( NBRC)
9) హరియణాలోని ఫరిదాబాద్ లో కన్నుమూసిన MK కచ్రూ ఏ రంగానికి చెందిన వారు ?
జ: ఇండియన్ ఎయిర్ లైన్స్ మాజీ పైలట్
(నోట్: 1971 జనవరిలో శ్రీనగర్ నుంచి జమ్ముకి వెళ్తున్న విమానం హైజాక్ అయినప్పుడు ఈయనే పైలట్. )
10) BCCI అవినీతి నిరోధక యూనిట్ (ACU) కొత్త చీఫ్  గా ఎవరు నియమితులయ్యారు ?
జ: అజిత్ సింగ్
(నోట్: గతంలో పనిచేసిన నీరజ్ కుమార్ పదవీ కాలం ముగిసింది.  )
11) దేశమంతటా ఆటంకంలేని వస్తువుల రవాణా కోసం ప్రవేశపెట్టిన ఈ-వే బిల్ విధానం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది ?
జ: ఏప్రిల్ 1, 2018 నుంచి
(నోట్: రూ.50 వేల కంటే ఎక్కువ విలువ గల వస్తువుల రవాణా జరిగితే ఈవే బిల్ తప్పనిసరి )

అంతర్జాతీయం
12) ఇటీవల మరణించిన ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్స్ అంత్యక్రియలు ఎక్కడ జరిగాయి ?
జ: లండన్ లోని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ కళాశాల దగ్గర్లో
(నోట్: 2018 మార్చి 14న ఆయన చనిపోయారు.  ఎ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైమ్ అనే పుస్తకం రాశారాయన)

 

SI/PC/GR.IV/VRO కోచింగ్ 
8-10గంటల Studyతో Perfect Planning
https://tsexams.com/coaching-starts/

RRB MOCK TESTS, GRAND TESTS

అర్థమెటిక్, రీజనింగ్ ప్రశ్నలపై స్పెషల్ క్లాసులు

http://tsexams.com/rrb-mock-tests-grand-tests/