Thursday, November 15
Log In

CURRENT AFFAIRS 7TH JULY

రాష్ట్రీయం
1) గిరిజన ప్రాంతాల్లోని విద్యార్థుల సంపూర్ణ ఆరోగ్యం లక్ష్యంగా తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ ఏ పథకాన్ని ప్రారంభించింది ?
జ: గిరిబాల వికాస్
2) మూగ జీవుల సంరక్షణ కోసం భారీ జంతు పరిరక్షణ కేంద్రాన్ని GHMC ఎక్కడ నిర్మించనుంది ?
జ: ఫతుల్లగూడ (5 ఎకరాల్లో రూ.5కోట్లతో నిర్మాణం)
3) తెలంగాణ భాషా దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు ?
జ: సెప్టెంబర్ 9

జాతీయం
4) ప్రధాని నరేంద్రమోడీని ఢిల్లీలో కలుసుకున్న భూటాన్ ప్రధాని ఎవరు ?
జ: షెరింగ్ తోబెగే
5) జాతీయ హరిత ట్రైబ్యునల్ ఛైర్ పర్సన్ గా ఎవరు నియమితులయ్యారు ?
జ: ఆదర్శకుమార్ గోయెల్
6) ఇటీవల తరుచుగా వినిపిస్తున్న మాస్టర్ ఆఫ్ రోస్టర్ అనే పదం ఏ శాఖకు సంబంధించింది ?
జ: న్యాయశాఖకు
(నోట్: సుప్రీంకోర్టులో కేసుల కేటాయింపులో భారత ప్రధాన న్యాయమూర్తిదే అని చెప్పడానికి ఉద్దేశించిన పదం ఇది )
7) ఆయుష్మాన్ భారత్ పథకం CEO ఎవరు ?
జ: ఇందు భూషణ్
8) ప్రముఖ సంగీత విద్వాంసుడు మంగళంపల్లి బాలమురళీ కృష్ణ పేరిట ఏపీ సర్కార్ ఏర్పాటు చేసిన తొలి అవార్డును ఎవరికి ప్రదానం చేశారు ?
జ: వాయులీన విద్వాంసుడు అన్నవరపు రామస్వామికి
9) జాతీయ మానవ హక్కుల కమిషన్ లోగోను ఖరారు చేసింది. దీన్ని రూపొందించినది ఎవరు ?
జ: మహారాష్ట్రకు చెందిన బన్సిలాల్ కెట్కి

అంతర్జాతీయం
10) అవెన్ ఫీల్డ్ కేసులో పాకిస్తాన్ సుప్రీంకోర్టు మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కు ఎంతకాలం శిక్ష విధించింది ?
జ: 10 యేళ్ళ జైలు
11) అమెరికా - చైనా వాణిజ్య యుద్ధం మొదలైంది. ఎన్ని డాలర్ల చైనా ఉత్పత్తులపై అమెరికా 25శాతం ట్యాక్సులు విధించింది ?
జ: 34 బిలియన్ డాలర్లు
12) 2018 పిఫా ప్రపంచ కప్ లో పాల్గొంటున్న జట్ల సంఖ్య ఎంత ?
జ: 32
13) ఈ ఏడాదిలో వరల్డ్ ఎర్త్ అవర్ ఎప్పుడు జరిగింది ?
జ: మార్చి 24
14) 2022 వింటర్ ఒలింపిక్స్ ఎక్కడ జరగనున్నాయి ?
జ: బీజింగ్
15) ఐక్యరాజ్య సమితిలో అధికారిక భాషలు ఎన్ని ?
జ: ఆరు

SI/PC/VRO/GR.IV ప్రింటెడ్ మెటీరియల్, మాక్ టెస్టులు
https://telanganaexams.com/mockmaterial/