Thursday, July 19
Log In

CURRENT AFFAIRS 6TH JULY

రాష్ట్రీయం
1) గౌలిగూడ సెంట్రల్ బస్ స్టేషన్ కుప్పకూలింది. దీన్ని ఏ నిజాం కాలంలో నిర్మించారు ?
జ: ఉస్మాన్ అలీ ఖాన్ హయాంలో (1932 నుంచి వినియోగంలోకి వచ్చింది )
2) కేరళ సెంట్రల్ యూనివర్సిటీ ఛాన్స్ లర్ గా ఎవరు నియమితులయ్యారు ?
జ: ప్రొ.ఎస్ వీ శేషగిరి రావు
(నోట్: ఏపీకి చెందిన శేషగిరిరావు ఓయూలో జియో ఫిజిక్స్ ప్రొఫెసర్ గా, డీన్ గా పనిచేశారు )
3) బాలల అదృశ్యం కేసులు, మహిళల అక్రమ రవాణా నియంత్రణ, బాల కార్మిక వ్యవస్థకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న కార్యక్రమం ఏది ?
జ: ఆపరేషన్ ముస్కాన్
4) పోషకాలు అధికంగా ఉండి ఒబెసిటీ తగ్గేందుకు తోడ్పడే సరికొత్త జొన్న వంగడాన్ని ఇక్రిశాట్ విడుదల చేసింది. దాని పేరేంటి ?
జ: పర్భనీ శక్తి

జాతీయం
5) అంతరిక్షంలోకి వ్యోమగామిని పంపే దిశగా భారత రోదసి పరిశోధన సంస్థ ( ఇస్రో) వేసిన మొదటి అడుగు విజయవంతమైంది. ప్రయోగ సమయాల్లో ప్రమాదాల నుంచి వ్యోమగాముల ప్రాణాలు రక్షించేందుకు ఏ ప్రయోగాన్ని నిర్వహించింది ?
జ: ప్యాడ్ అబార్డ్
6) క్రికెట్ తో సహా అన్ని క్రీడలపై పెట్టే బెట్టింగ్, జూదాన్ని చట్టబద్ధం చేయాలని ఎవరు సిఫార్సు చేశారు ?
జ: న్యాయ కమిషన్
7) ఎయిర్ ఇండియా తన వెబ్ సైట్ లో తైవాన్ పేరును ఏ విధంగా మార్పుచేసింది ?
జ: చైనీస్ తైపీ
8) ప్రైవేటు రంగ బంధన్ బ్యాంక్ కి ఎండీ, CEO తిరిగి ఎవరు నియమితులయ్యారు ?
జ: చంద్రశేఖర్ ఘోష్

అంతర్జాతీయం
9) వదంతులను వ్యాప్తి చేయడాన్ని అరికట్టేందుకు పరిష్కారం చూపితే ఎన్ని లక్షలు చెల్లిస్తామని వాట్సాప్ ప్రకటించింది ?
జ: 34 లక్షలు

SI/PC/VRO/GR.IV ప్రింటెడ్ మెటీరియల్, మాక్ టెస్టులు
https://telanganaexams.com/mockmaterial/