Monday, September 24
Log In

CURRENT AFFAIRS- 36ప్రశ్నలు- 16AUG

రాష్ట్రీయం
1) అభివృద్ధి, సంస్కరణల విభాగంలో రాష్ట్రంలోని ఏ మున్సిపాలిటీకి  ISO 9001:2015 సర్టిఫికెట్ లభించింది ?
జ: సిద్ధిపేట మున్సిపాలిటీ
2) అమ్రుత ధార పథకం కింద రాష్ట్రంలోని నగరాలు, పట్టణాల్లో ప్రతి వ్యక్తికి సగటున ఎన్ని లీటర్ల నీటిని అందించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది ?
జ: 135 లీటర్లు
3) రాష్ట్రంలో షీ క్యాబ్స్ ఎప్పుడు ప్రారంభమయ్యాయి ?
జ: 2015 సెప్టెంబర్ 8న
4) రాష్ట్రంలో యువతీ యువకుల్లో ఉద్యోగ నైపుణ్యాల మీద శిక్షణ ఇచ్చేందుకు ఉద్దేశించిన తెలంగణ రాష్ట్ర నైపుణ్య మిషన్ - టాస్క్ ఎప్పుడు ప్రారంభమైంది ?
జ: 2015 జులై21న
5) లిమ్కా బుక్ ఆఫ్ రికార్డుల్లోకి ఎక్కిన తెలంగాణ సమగ్ర కుటుంబ సర్వేను ఎప్పుడు నిర్వహించారు ?
జ: 2014 ఆగస్టు 19న

జాతీయం
6) ఆత్మహత్యలను ప్రేరేపిస్తున్న ఏ అంతర్జాతీయ ఆటకు చెందిన సమాచారం, వెబ్ లింకులు తొలగించాలని కేంద్ర ప్రభుత్వం గూగుల్, ఫేస్ బుక్ లను కోరింది ?
జ: బ్లూ వేల్
7) ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు శ్రీ శ్రీ పండిట్ రవిశంకర్ చొరవతో ఈశాన్య రాష్ట్రాల తీవ్రవాదులు మణిపూర్ లో ముఖ్యమంత్రి ఎదుట లొంగిపోయారు.  ప్రస్తుతం మణిపూర్ సీఎం ఎవరు ?
జ: బీరేన్ షా
8) ఈనెల 31న ఇండియన్ రీజినల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ సిరీస్ లో భాగంగా IRNSS-1H  శాటిలైట్ ను అంతరిక్షంలోకి పంపుతున్నారు. అందుకోసం ఉపయోగిస్తున్న రాకెట్ పేరేంటి ?
జ: PSLV C-39
9) నిరుద్యోగ యువత కోసం నమో యువ రోజ్ గార్ కేంద్ర ను ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం ఏది ?
జ: మహారాష్ట్ర
10) భారత్ లో మొదటి ఏవియేషన్ యూనివర్సిటీని ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు ?
జ: ఉత్తరప్రదేశ్
11) సేవింగ్స్ అకౌంట్స్ లో రెండు రకాల వడ్డీరేట్లను ప్రవేశపెట్టిన బ్యాంక్ ఏది ?
జ: ఇండియన్ బ్యాంక్
12) మహిళా పారిశ్రామికవేత్తల కోసం She Means Business అనే కార్యక్రమాన్ని ఫేస్ బుక్ తో కలసి ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం ఏది ?
జ: ఒడిశా
13) ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ దళాలతో కలసి ఇంద్ర సైనిక విన్యాసాలను ఏ దేశంతో భారత్ నిర్వహిస్తోంది ?
జ: రష్యా
14) ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్ సౌర్యను కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఎక్కడ ప్రారంభించారు ?
జ: గోవా
15) 2017 హిందూ ప్లేరైట్ అవార్డ్ గిరీఝ్ ఖేమానీ, అక్షత్ నిగమ్ కు దక్కింది. వీరు రాసిన నాటకం ఏది ?
జ: In serrch of Dariya Sagar
16) కేసరీ మెమోరియల్ జర్నలిస్ట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మొదటి కేసరి మీడియా అవార్డు ఎవరికి దక్కింది ?
జ: T J S George
17) ఎగుమతులు, దిగుమతులకు సంబంధించిన ఎగ్జిమ్ బ్యాంక్ కు మేనేజింగ్ డైరక్టర్ గా ఎవరు నియమితులయ్యారు ?
జ: David Rasquinha
18) ఏ రాష్ట్ర యూనివర్సిటీల్లో అక్టోబర్ 2 గాంధీ జయంతి నాడు శెలవుదినాన్ని రద్దు చేశారు ?
జ: రాజస్థాన్
19) కశ్మీర్ లోని 6,153 మీటర్ల ఎత్తయిన స్టాక్ కంగ్రీ పర్వతాన్ని ఎక్కి రికార్డు సృష్టించిన 9యేళ్ళ బాలుడు ఎవరు ?
జ:  కామ్య కార్తికేయన్
20) ఒరంగ్ నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది ?
జ: అసోం
21) కేరళలోని పున్నాండ లేక్ లో జరిగిన స్నేక్ బోట్ రేస్ లో 65 నెహ్రూ ట్రోఫీ బోట్ రేస్ 2017 ను గెలుచుకున్న జట్టు ఏది ?
జ: గాబ్రియేల్ చుండన్
22) మొట్టమొదటి దక్షిణాసియా యువ సదస్సు -2017 ఎక్కడ జరుగుతోంది ?
జ: భువనేశ్వర్
23) పునరుద్ధరించిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ( కేంద్ర సెన్సార్ బోర్డు) లో సభ్యులుగా చోటు దక్కించుకున్న ఇద్దరు యాక్టర్స్ ఎవరు ?
జ: విద్యాబాలన్, గౌతమి
24) మెల్ బోర్న్ లో జరిగిన భారతీయ చలన చిత్రోత్సవంలో భారత జాతీయ పతాకాన్ని ఎగురవేసిన మొదటి మహిళా నటి ఎవరు ?
జ: ఐశ్వర్యా రాయ్ బచ్చన్
25) రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ (RCA) అధ్యక్ష పదవికి ఎవరు రాజీనామా  చేశారు ?
జ: లలిత్ మోడీ
26) కజకిస్తాన్ లోని ఆస్తానాలో జరిగిన 7వ ఆసియాన్ ఛాంపియన్షిప్ పోటీల్లో ఉమెన్స్  స్కీట్ పోటీల్లో కాంస్యపతకం గెలుచుకున్న ఇండియన్ ప్లేయర్ ఎవరు ?
జ: మహేశ్వరీ చౌహాన్

అంతర్జాతీయం
27) ఆగస్ట్ 15 నాడు శ్రీకృష్ణుడి 5,244వ జన్మదినం సందర్భంగా సిల్వర్ కాయిన్ ను విడుదల చేసిన దేశం ఏది ?
జ: రిపబ్లిక్ ఆఫ్ ఛద్
28) సోమాలియాని ఏ వ్యాధి రహిత దేశంగా WHO ప్రకటించింది ?
జ: పోలియో
29) 2017 ప్రపంచ ఏనుగుల దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకున్నారు ?
జ: ఆగస్ట్ 12
30) అత్యంత వేగవంతమైన మొబైల్ ఇంటర్నెట్ కలిగిన దేశంగా ఓక్లా దేన్ని గుర్తించింది ?
జ: నార్వే
(నోట్: నెదర్లాండ్స్, హంగేరి 2,3 స్థానాల్లో నిలిచాయి )
31) 2014-16 సంవత్సరాల మధ్య ఎల్ నినో పరిస్థితులకు ఏ వాయువు కారణమని నాసాకు చెందిన Orbiting Carbon observatory-2 ఉపగ్రహం గుర్తించింది ?
జ: కార్భన్ డై ఆక్సైడ్
32) పాకిస్తాన్ స్వాతంత్ర్య దినోత్సవం ఆగస్ట్ 14 సందర్భంగా 400 అడుగుల ఎత్తులో తమ దేశ జాతీయ పతాకాన్ని ఎక్కడ ఎగురవేసింది ?
జ: అట్టారీ వాఘా బోర్డర్ దగ్గర
(నోట్: దక్షిణాసియాలోనే అతి పెద్దది. ప్రపంచంలో 8వ వది)
33) సామాజిక భద్రతా దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకున్నారు ?
జ: ఆగస్ట్ 14
34) అంతర్జాతీయ లెప్ట్ హ్యాండర్స్ డే ని ఎప్పుడు జరుపుకున్నారు ?
జ: ఆగస్ట్ 13
35) ప్రపంచ అవయవదాన దినోత్సవం ఎప్పుడు జరిగింది ?
జ: ఆగస్ట్ 13
36) హ్యూగో అవార్డ్ ఫర్ బెస్ట్ నావెల్ 2017 పొందిన ఆఫ్రికన్-అమెరికన్ రచయిత్రి నోరా కె.జెమిసిన్ రాసిన పుస్తకం ఏది ?
జ: The Obelisk Gate