Tuesday, October 16
Log In

CURRENT AFFAIRS-32 ప్రశ్నలు-25th JULY

రాష్ట్రీయం

1) కేటీఆర్ గురించి వచ్చిన ‘‘ఫ్యూచర్ ప‌ర్‌ఫెక్ట్‌ కేటీఆర్’’ పుస్తకాన్ని ఎవరు రాశారు ?
జ: దిలీప్ కొణతల ( డిజిటల్ మీడియా, ఐటీ, ఈసీ విభాగాల డైరక్టర్)
2) గ్రేడ్ - 2మునిసిపాలిటీ హోదా పొందిన పట్టణం ఏది ?
జ: నారాయణ్ పేట్
3) ఏవియేషన్ లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా కోర్పు అందించేందుకు GMR సంస్థ ఎవరితో ఒప్పందం కుదుర్చుకుంది ?
జ: రాజీవ్ గాంధీ నేషనల్ ఏవియేషన్ యూనివర్సిటీ

జాతీయం

4) భారత ఎన్నో రాష్ట్రపతిగా రామ్‌నాథ్ కోవింద్‌ ప్రమాణ స్వీకారం చేయనున్నారు ?
జ: 14వ రాష్ట్రపతిగా
5) భారత రాష్ట్రపతిగా రామ్‌నాథ్ కోవింద్‌ తో ఎవరు ప్రమాణం చేయిస్తారు ?
జ: భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జె.ఎస్. ఖేహర్
6) భారత రాష్ట్రపతిగా బాధ్యతలు చేపడుతున్న రామ్‌నాథ్ కోవింద్‌ దేశానికి ఎన్నో దళిత రాష్ట్రపతి ?
జ: రెండో
(నోట్: మొదటి దళిత రాష్ట్రపతి కె.ఆర్.నారాయణన్ ( 1997)
7) రాష్ట్రపతి అధికారిక వాహనం పేరేంటి ?
జ: లిమోసీన్
8) హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లో ప్రభుత్వ వాటాను ONGC కి విక్రయించేందుకు సంబంధించిన ప్రక్రియకు ఎవరి అధ్యక్షతన ముగ్గురు మంత్రుల కమిటీ బృందం ఏర్పడింది ?
జ: కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ
9) యాత్రా స్థల పునరుజ్జీవనం, ఆధ్యాత్మిక బలోపేతంనకు సంబంధించిన కేంద్ర పథకం పేరేంటి ?
జ: ప్రసాద్
10) నౌకాయానానికి సంబంధించిన వివాదాల పరిష్కారానికి 1861, 1890 నాటి చట్టాలను రద్దు చేసి.. దాని స్థానంలో ఏ బిల్లును రాజ్యసభలో రహదారులు, నౌకాయాన శాఖ సహాయమంత్రి మన్ సుఖ్ మాండవీయ ప్రవేశపెట్టారు ?
జ: అడ్మిరాల్టీ-2017 ( పరిధి, నౌకా సంబంధ నష్టాలకు పరిహారం)
11) అడ్మిరాల్టీ కోర్టు చట్టం - 1861, కలోనియల్ కోర్ట్స్ ఆఫ్ అడ్మిరాల్టీ చట్టం-1890 ప్రకారం నౌకా సంబంధ నష్టాల పరిహారంపై వచ్చే వివాదాలు ఏయే కోర్టుల్లో మాత్రమే పరిష్కరించే వారు ?
జ: కలకత్తా, మద్రాస్, బొంబాయి హైకోర్టుల్లో
(నోట్: కొత్త చట్టం అమల్లోకి వస్తే కర్ణాటక, గుజరాత్, ఒడిషా, కేరళ, హైదరాబాద్ తో పాటు కేంద్రప్రభుత్వం పేర్కొనే ఏ ఇతర హైకోర్టుల్లోనైనా పరిష్కరించే వీలుంది )


12) మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం మైనపు విగ్రహాన్ని జైపూర్ నుంచి తమిళనాడు రామేశ్వరంలో కలాం పేరుతో నిర్మించిన విజ్ఞాన కేంద్రంలో నెలకొల్పేందుకు తరలించారు. ఆ మైనపు విగ్రహాన్ని ఎవరు రూపొందించారు ?
జ: జైపూర్ వ్యాక్స్ మ్యూజియం
13) సేవా కార్యక్రమాల్లో ముందుండే ఇన్ఫోసిస్ ఫౌండేషన్ కు ఛైర్మన్ ఎవరు ?
జ: సుధా నారాయణ మూర్తి
14) అనారోగ్యంతో కన్నుమూసిన భారత దేశ తొలి ఉపగ్రహం ’ఆర్యభట్ట’ సూత్రధారి ఎవరు ?
జ: ప్రొఫెసర్ యూ.ఆర్.రావు
(నోట్: 1975లో ప్రయోగించిన ఆర్యభట్టతో పాటు చంద్రయాన్-1, మంగళ్ యాన్, ఆదిత్య సోలార్ మిషన్ లాంటి అనేక ఇస్రో కీలక ప్రాజెక్టుల్లో కీలకపాత్ర పోషించారు )
15) కేంద్ర ప్రభుత్వ మహిళా ఉద్యోగుల రక్షణ కోసం కేంద్ర ప్రారంభించిన ఆన్ లైన్ ప్లాట్ ఫామ్ ఏది ?
జ: షీ బాక్స్
(నోట్: షీ బాక్స్ అంటే - సెక్సువల్ హరాస్మెంట్ ఎలక్ట్రానిక్ బాక్స్ )
16) చైనా సరిహద్దు ప్రాంతమైన తవాంగ్ కు వెళ్ళేందుకు ఏ రాష్ట్రంలోని సేలా పాస్ గుండా రెండు సొరంగ మార్గాలు నిర్మించాలని BRO నిర్ణయించింది ?
జ: అరుణాచల్ ప్రదేశ్
17) ఏ రెండు టెలిఫోన్ దిగ్గజాల విలీనానికి కాంపిటీషన్ కమిషన్ (CCI) ఆమోదం తెలిపింది ?
జ: ఐడియా, వొడాఫోన్
18) సహారా లైఫ్ ఇన్సూరెన్స్ ను ఏ సంస్థ కొనుగోలు చేయడానికి వ్యాల్యుయేషన్ నివేదిక రెడీ అవుతోంది ?
జ: ICICI ప్రుడెన్షియల్


19) 2016 డిసెంబర్ 30న కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన భీమ్ యాప్ డౌన్లోడ్స్ సంఖ్య 1.6 కోట్లకు చేరింది. దీని ఫుల్ ఫామ్ ఏంటి ?
జ: భారత్ ఇంటర్ ఫేస్ ఫర్ మనీ ( భీమ్ )
20) ఏ ఆహార పంట జన్యుమార్పిడిపై సుప్రీంకోర్టులో వివాదం నడుస్తోంది ?
జ: ఆవాలు
21) సైన్స్ రంగంలో విశేష కృషి చేసిన ఎవరికి ఇందిరాగాంధీ పురస్కారం లభించింది ?
జ: ప్రముఖ పాత్రికేయుడు పల్లవ బగ్లా
(నోట్: బగ్లా ND TV సైన్స్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు )
22) యూనిసెఫ్ సౌహార్ద్ర రాయబారిగా మరో రెండేళ్ళపాటు పొడిగింపు పొందిన బాలీవుడ్ నటుడు ఎవరు ?
జ: అమితాబ్ బచ్చన్
(నోట్: భారత్ లో పోలియో నివారణకు సంబంధించి బచ్చన్ యూనిసెఫ్ రాయబారిగా పనిచేశారు. ఇప్పుడు మీజిల్స్, రుబెల్లా టీకాల ప్రాధాన్యత, వ్యాప్తి, చైతన్యం కోసం పనిచేస్తారు )
23) యూఎస్ ఓపెన్ బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ విజేత ఎవరు ?
జ: హెచ్.ఎస్. ప్రణయ్
24) లోథా కమిటీ సిఫార్సులు దేనికి సంబంధించినవి ?
జ: క్రికెట్
(నోట్: భారత్ క్రికెట్, BCCI ప్రక్షాళన కోసం సుప్రీంకోర్టు నియమించిన కమిటీ)
25) ఐసీసీ ప్రపంచకప్ మహిళల జట్టు కెప్టెన్ గా ఎవరు ఎంపికయ్యారు ?
జ: మిథాలీ రాజ్
26) కామన్వెల్త్ యూత్ గేమ్స్ ఎక్కడ ముగిశాయి ?
జ: నసావు ( బహమాస్ దేశంలో )
27) కామన్వెల్త్ యూత్ గేమ్స్ లో భారత్ కు ఎన్ని పతకాలు దక్కాయి ?
జ: 11 పతకాలు ( ఏడో స్థానం )
(నోట్: 4 స్వర్ణాలు, ఒక రజతం, ఆరు కాంస్యాలు )

అంతర్జాతీయం

28) డోక్లామ్ ప్రాంతం విషయంలో భారత్ - చైనా మధ్య ఉద్రిక్తతలను చల్లార్చేందుకు ఎవరెవరి మధ్య సమావేశం జరుగుతోంది ?
జ: భారత్, చైనా జాతీయ భద్రతా సలహాదారులు అజిత్ దోభాల్, యాంగ్ జీచి
29) ఈనెల 27,28 తేదీల్లో బ్రిక్స్ కూటమి దేశాల జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం ఎక్కడ జరుగుతోంది ?
జ: బీజింగ్
30) ఏ దేశాధ్యక్షుడు ఆదేశాలతో ఆ దేశ పార్లమెంటుకు సైన్యం తాళాలు వేసిందని ప్రతిపక్షం ఆరోపిస్తోంది. ఆ దేశం ఏది ? అధ్యక్షుడి పేరేంటి ?
జ: మాల్దీవులు ( అధ్యక్షుడు యామీన్ అబ్దుల్ గయూమ్ )
31) ఊబకాయం (ఒబెసిటీ)కి బ్రాండ్ అంబాసిడర్ గా ఎవర్ని నియమించనున్నట్టు అబుదాబీలోని బుర్జీల్ ఆసుపత్రి యాజమాన్యం తెలిపింది ?
జ: ఎమన్ అహ్మద్ ( ఈజిప్ట్)
(నోట్: ఈజిప్టు నుంచి ముంబైలోని సైఫీ ఆసుపత్రికి ఆమె వచ్చినప్పుడు 500 కిలోల బరువు నుంచి రెండు నెలల్లో 330 కిలోలకు తగ్గించారు. ప్రస్తుతం బుర్జీల్ ఆసుపత్రిలో చికిత్స తర్వాత 150 కిలోలకు చేరింది)
32) ప్రపంచంలోనే మొదటిసారిగా సముద్రజలాల్లో తేలియాడే పవన విద్యుత్ ను ఏ దేశంలో ఏర్పాటు చేశారు ?
జ: స్కాట్ లాండ్

 

( Friends, ఈ టెస్టులకు సంబంధించిన ప్రశ్నలు, జవాబులు... గతంలో లాగా అన్ని FB గ్రూపుల్లో పోస్ట్ చేయడం సాధ్యం కావడం లేదు.  అందువల్ల... మీ FB ఫ్రెండ్ రిక్వెస్ట్ ను telanganaexams కు పంపండి.  అలాగే ఎక్కువమందికి మన యాప్, వెబ్ సైట్ చేరేలాగా ప్రతి పోస్టును మీ FB లేదా వాట్పాప్ గ్రూపుల్లో షేర్ అయ్యేలా పోస్ట్ చేయగలరని మనవి. )