Sunday, August 19
Log In

CURRENT AFFAIRS- 31ప్రశ్నలు – 28th JULY

రాష్ట్రీయం
1) ప్రాణాంతకమైన తట్టు, రుబెల్లా వ్యాధుల నుంచి రక్షణ వచ్చే నెల 17 నుంచి రాష్ట్రంలో ఏ టీకాను ప్రవేశపెడుతున్నారు ?
జ: తట్టు, రుబెల్లా (MR)
2) తట్టు, రుబెల్లా వ్యాధుల నివారణ కోసం వేసే టీకాలను ఏయే వయస్సు వారికి ఇస్తారు ?
జ: 9 నెలల నుంచి 15 యేళ్ళ మధ్య వయస్సున్న పిల్లలకు
3) తట్టు కారణంగా ప్రతి యేటా దేశంలో ఎంతమంది పిల్లలు చనిపోతున్నారు ?
జ: 39 వేల మంది ( ప్రపంచంలో 1,14,900)
4) తట్టు, రుబెల్లా వ్యాధుల కారణంగా ‘పుట్టుకతో వచ్చే జబ్బు’ ను ఏ సంవత్సరంలోగా పూర్తిగా నిరోధించాలని కేంద్ర సర్కార్ లక్ష్యంగా పెట్టుకుంది ?
జ: 2020 నాటికి
5) తట్టు, రుబెల్లా వ్యాధుల కోసం పిల్లలకు ఎప్పుడెప్పుడు టీకాలు వేయించాలి ?
జ: 12 నెలలకు మొదటిసారి, 24 నెలలకు రెండోసారి
6) ఫోర్బ్స్ మేగజైన్ జాబితాలో ఆసియా-200లోని ఉత్తమ సంస్థల్లో నిలిచిన హైదరాబాద్ కంపెనీలు ఏవి ?
జ: కెల్టన్ టెక్ సొల్యూషన్ ( మార్కెట్ విలువు 77 మిలియన్ డాలర్లు - దాదాపు రూ.500కోట్లు)
7) మహిళల అక్రమ రవాణా నిరోధం కోసం కృషి చేసినందుకు గాను రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ మురళీధర్ భగవత్ కు ఏ సంస్థ అవార్డు దక్కింది ?
జ: మహారాష్ట్ర మహిళా కమిషన్
8) గురుకుల విద్యార్థునులు మాలావత్ పూర్ణ, శ్రీ విద్య సాహసం చేశారు. ఐరోపాలోనే ఎత్తయిన పర్వత శిఖరం అధిరోహించారు. ఆ శిఖరం పేరేంటి ?
జ: ఎల్ బ్రస్ (రష్యా) (ఎత్తు : తూర్పున - 18,442 అడుగులు, పశ్చిమాన - 18,510 అడుగులు)
9) టర్కీలో జరుగుతున్న డెఫ్లింపిక్స్ టెన్నిస్ మిక్స్ డ్ డబుల్స్ లో కాంస్యం సాధించిన తెలంగాణ క్రీడాకారిణి ఎవరు ?
జ: జఫ్రీన్
10) గ్రామీణ క్రీడ అయిన ప్రొ కబడ్డీ పోటీలు ఎప్పుడు, ఎక్కడ ప్రారంభమవుతున్నాయి ?
జ: జులై 28, హైదరాబాద్ లో
11) ప్రొకబడ్డీ లీగ్ పోటీలో మొత్తం ఎన్ని జట్లు ఉన్నాయి ?
జ: 12 జట్లు

జాతీయం
12) మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం వర్ధంతి సందర్బంగా ఆయన స్వస్థలమైన రామేశ్వరంలోని పేకరుంబులో స్మారక కేంద్రాన్ని ఎవరు ప్రారంభించారు ?
జ: ప్రధాని నరేంద్ర మోడీ
13) వీలర్ ఐలాండ్ కు అబ్దుల్ కలాం పేరు పెట్టినట్టు అధికారికంగా ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం ఏది ?
జ: ఒడిశా ( ముఖ్యమంత్రి: నవీన్ పట్నాయక్ )
(నోట్: ఇక్కడ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ మిస్సైల్ కాంప్లెక్స్ ఉంది. ఇక్కడి నుంచే మిస్సైల్స్ ప్రయోగాలు చేస్తారు )
14) బీహార్ ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ తో ఎవరు ప్రమాణం చేయించారు ?
జ: గవర్నర్ కేసరినాథ్ త్రిపాఠీ
15) బీహార్ ఉప ముఖ్యమంత్రిగా ఎవరు బాధ్యతలు స్వీకరించారు ?
జ: సుశీల్ మోదీ
16) భారత రచయిత్రి అరుంధతీ రాయ్ రాసిన ఏ నవలకు బుకర్ ప్రైజ్ ఎంపిక జాబితాలో చోటు దక్కింది ?
జ: ది మినిస్ట్రీ ఆఫ్ అట్ మోస్ట్ హ్యాపీనెస్
17) దేశంలోని ఎన్ని ట్రిపుల్ ఐటీలకు చట్టబద్ధమైన హోదా కల్పిస్తూ రాజ్యసభ బిల్లును ఆమోదించింది ?
జ: 15 ట్రిపుల్ ఐటీలు
18) బెంగళూరులో కన్నుమూసిన కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎవరు ?
జ: ఎన్. ధరం సింగ్
19) కార్పొరేట్ ప్రమాణాల పటిష్టత, పెట్టుబడిదారుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు ఉద్దేశించిన కంపెనీల చట్ట సవరణ బిల్లుకు లోక్ సభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లును ప్రవేశపెట్టిన
కేంద్ర మంత్రి ఎవరు ?
జ: కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖ సహాయమంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్
20) యాక్సిస్ బ్యాంక్ ఎండీగా పనిచేస్తున్న ఎవరి పదవీకాలాన్ని మరో మూడేళ్ళు పెంచారు ?
జ: ఎండీ, CEO శిఖా శర్మ
21) గొట్టాల ద్వారా ప్రయాణించే హైపర్ లూప్ ట్రావెల్ పై పరిశోధనలు చేస్తున్న బిట్స్ పిలానీ విద్యార్థుల టీమ్ పేరేంటి ?
జ: టీం హైపర్ లూప్ ఇండియా
22) హైపర్ లూప్ ను మొదట కనిపెట్టిన వారు ఎవరు ?
జ: టెస్లా, స్పెస్ ఎక్స్ దిగ్గజ కంపెనీల అధినేత ఎలాన్ మస్క్ (2013లో) (అమెరికా)
23) ఫోర్బ్స్ మేగజైన్ ఆసియా-200 ఉత్తమ సంస్థల జాబితాలో చోటు దక్కించుకున్న భారతీయ కంపెనీలు ఏవి ?
జ: మన్ పసంద్ బేవరేజెస్ ( వడోదరా - గుజరాత్ ), కెల్టన్ టెక్ సొల్యూషన్ ( హైదరాబాద్ ), 8కే మైల్స్ సాఫ్ట్ వేర్ సర్వీసెస్ (చెన్నై)
24) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగ నియామక పత్రాన్ని అందుకున్న క్రీడాకారిణి ఎవరు ?
జ: పీ.వీ. సింధు
25) రాజీవ్ ఖేల్ రత్న, అర్జున అవార్డుల ఎంపిక కమిటీలో ఏయే క్రీడాకారులకు చోటు దక్కింది ?
జ: వీరేంద్ర సెహ్వాగ్, పి.టి. ఉష
26) క్రీడా శిక్షకులకు ఇచ్చే ద్రోణాచార్య అవార్డుల కమిటీకి ఎవరు అధ్యక్షుడిగా వ్యవహరించనున్నారు ?
జ: భారత్ బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీ చంద్

అంతర్జాతీయం
27) బ్రిక్స్ దేశాల కార్మికమంత్రుల సమావేశం ఎక్కడ జరిగింది ?
జ: చాంగ్ కింగ్ నగరం (చైనా )
28) రెండు రోజుల పాటు చాంగ్ కింగ్ నగరంలో జరిగిన బ్రిక్స్ దేశాల కార్మిక మంత్రుల సమావేశానికి భారత్ తరపున ఎవరు హాజరయ్యారు ?
జ: బండారు దత్తాత్రేయ (కేంద్ర కార్మికశాఖ మంత్రి )
29) ప్రపంచంలోనే సంపన్నుడుగా ఎవరు నిలిచారు ?
జ: అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్
(నోట్: బిల్ గేట్స్ ను మించిన సంపద ఉంది.)
30) జెఫ్ బెజోస్ సంపద విలువ ఎంతకు చేరింది ?
జ: 90.9 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.5.90 లక్షల కోట్లు)
31) ప్రస్తుతం మైక్రో సాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ సంపద విలువ ఎంత ?
జ: 90.7 మిలియన్ డాలర్లు ( దాదాపు రూ.5.89 లక్షల కోట్లు )