Sunday, October 14
Log In

CURRENT AFFAIRS-30 ప్రశ్నలు-22JULY

రాష్ట్రీయం


1) జులై 20 నాటికి మూడో విడత హరితహారంలో భాగంగా ఎక్కువ మొక్కలు నాటిన జిల్లా ఏది ?
జ: నిజామాబాద్ (72 లక్షల మొక్కలు)
(నోట్: రెండో స్థానంలో ఖమ్మం (62) లక్షలు )
2) తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మొదటి వేతన సవరణ సంఘాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది. దీనికి ఎవర్ని అధ్యక్షుడిగా నియమించనుంది ?
జ: మాజీ సీఎస్ ప్రదీప్ చంద్ర
3) తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయబోయే కొత్త PRC నివేదిక సమర్పించాక ఎప్పటి నుంచి అమలు చేయున్నారు ?
జ: 2018 జులై 1 నుంచి
4) తెలంగాణ రాష్ట్ర మానవాభివృద్ధి నివేదిక - 2017 ప్రకారం హైదరాబాద్ లో తలసరి ఆదాయం ఎంత ?
జ: 1.04 లక్షలు (రూ.1,04,587)
(నోట్: ఇందులో మహిళల తలసరి ఆదాయం రూ.69,081 మాత్రమే)
5) సేవా రంగం వాటాలో టాప్ లో నిలుస్తున్న హైదరాబాద్ కు ఏడాదికి ఎంత ఉంది ?
జ: 78,755 కోట్లు (2011-12 అంచనాల ప్రకారం)
6) అక్షరాస్యతలో రాష్ట్రంలోనే అగ్రగామిగా ఉన్న హైదరాబాద్ లో ఎంత శాతంగా ఉంది ?
జ: 71.6 శాతం (రంగారెడ్డిలో 47 శాతం- రెండో స్థానం)
7) హైదరాబాద్ లో ప్రతి వెయ్యి మంది శిశు జననాలకు 20 మంది చనిపోతుంటే... రంగారెడ్డి జిల్లాలో ఈ సంఖ్య ఎంత ?
జ: 33 మంది
8) ఆదాయం పన్ను రాబడిలో టాప్ గా నిలిచిన తెలంగాణ ఎంత శాతం వృద్ధిని సాధించింది ?
జ: 44శాతం (జాతీయ స్థాయి సగటు 19.2శాతం )


9) దాశరధి కృష్ణమాచార్యుల 93వ జయంతి సందర్భంగా ఈసారి దాశరది పురస్కారాన్ని ఎవరికి ప్రదానం చేయనున్నారు ?
జ: ప్రొ. ఎన్ గోపి
10) 2015లో దాశరధి పురస్కారాన్ని మొదటగా ఎవరికి ప్రదానం చేశారు ?
జ: తిరుమల శ్రీనివాసాచార్య
(నోట్: 2016 లో రెండో పురస్కారం జె.బాపురెడ్డికి )
11) ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్యం పేరుతో హైదరాబాద్ లో ఈనెల 24 నుంచి నిర్వహించే ఆసియా-పసిఫిక్ సదస్సులో పాల్గొంటున్న పెద్ద దేశం ఏది ?
జ: చైనా

జాతీయం


12) 60యేళ్ళు ఆ పైన వయస్సు ఉండే సీనియర్ సిటిజన్ల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన కొత్త పథకం పేరేంటి ?
జ: ప్రధానమంత్రి వయ వందన యోజన
13) ప్రధానమంత్రి వయ వందన యోజన కొత్త పెన్షన్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం తరపున ఏ సంస్థ నిర్వహిస్తోంది ?
జ: Life Insurance Corporation of India
14) ప్రధానమంత్రి వయ వందన యోజన కొత్త పెన్షన్ పథకాన్ని ఢిల్లీలో ఎవరు ప్రారంభించారు ?
జ: కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ
15) దేశంలో 1.50 లక్షల గ్రామపంచాయతీలను ఆప్టికల్ ఫైబర్ కేబుల్ ద్వారా ఇంటర్నెట్ కు అనుసంధానించే రెండో దేశ ప్రాజెక్టుకు కేంద్రం ఓకే చెప్పింది. ఈ ప్రాజెక్ట్ పేరేంటి ?
జ: భారత్ నెట్
16) భారత్ నెట్ ద్వారా మొదటి దశలో గడచిన మార్చి నాటికి ఎన్ని గ్రామ పంచాయతీలకు OFC సౌకర్యం కల్పించారు ?
జ: 1.00 లక్ష
17) భారత్ నెట్ ప్రాజెక్టకు కేంద్రం ఎంత మొత్తాన్ని కేటాయించింది ?
జ: రూ.42,068 కోట్లు
18) గంటకు 160కిమీ వేగంతో ఢిల్లీ - ఆగ్రా మధ్య నడుస్తున్న రైలు ఏది ?
జ: గతిమన్ ఎక్స్‌ప్రెస్‌
19) త్వరలో 160-200 కి.మీ. వేగంతో నడిచే గతిమన్ ఎక్స్‌ప్రెస్‌ రైలును ఏయే మార్గాల ద్వారా ప్రవేశపెడుతున్నట్టు రైల్వేమంత్రి సురేష్ ప్రభు వెల్లడించారు ?
జ: ఢిల్లీ-ముంబై, ఢిల్లీ-కోల్‌క‌తా
20) ప్రైవేట్ - పబ్లిక్ భాగస్వామ్యంతో (PPP) దేశంలో ఎన్ని IIITలను స్థాపించనున్నారు ?
జ: 20 IIIT లు
21) HPCL లో 51 శాతం వాటాని కొనుగోలు చేసేందుకు ఏ సంస్థకు కేంద్రం అనుమతి ఇచ్చింది ?
జ: ONGC ( Oil and Natural Gas Corporation Limited )
22) జపాన్ తో కుదుర్చుకున్న పౌర అణు సహకార ఒప్పందం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది ?
జ: 20 జులై 2017
23) కాన్పూర్, బరేలీ ఎయిర్ పోర్టుల పేర్లను ఏవిధంగా మారుస్తూ ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ తీర్మానం చేసింది ?
జ: కాన్పూర్ - గణేష్ శంకర్ విద్యార్థి, బరేలి - నాథ్ నగరీ
24) హరియార్ ఛత్తీస్ గఢ్ క్యాంపెయిన్ కింద వచ్చే ఆగస్టులోపు ఎన్ని మొక్కలు నాటాలని చత్తీస్ గఢ్ సర్కార్ నిర్ణయించింది ?
జ: 7 కోట్లు

అంతర్జాతీయం


25) భారత్ లో మిస్సైల్ డిఫెన్స్ సిస్టమ్ ను ఆధునీకరించి, అభివృద్ధి చేసేందుకు DRDO కు ఏ దేశం సహకరించనుంది ?స
జ: ఇజ్రాయెల్ ( ప్రాజెక్ట్ రూ.17 వేల కోట్లు )
26) ఉగ్రవాదంపై పోరు చేయడం లేదన్న కారణంతో ఏ దేశానికి అమెరికా సాయం నిలిపేసింది ?
జ: పాకిస్థాన్
27) ఇంటర్నేషనల్ సోలార్ అలయెన్స్ లో కొత్తగా చేరిన దేశం ఏది ?
జ: ఆస్ట్రేలియా
28) UK ఇండియా బిజినెస్ కౌన్సిల్ చీఫ్ గా ఎవరు నియమితులయ్యారు ?
జ: లార్డ్ డేవీస్
29) ఇండియాలో అడోబ్ సిస్టమ్స్ ఆపరేషన్స్ కోసం MD గా ఎవరు నియమితులయ్యారు ?
జ: షన్ముఘ్ నటరాజన్
30) 2022 World Short course Swimming Championships ఎక్కడ నిర్వహించనున్నారు ?
జ: కజన్ ( రష్యాలో )