Friday, May 25
Log In

CURRENT AFFAIRS-26ప్రశ్నలు – 31JULY

రాష్ట్రీయం
1) బోనం- తెలంగాణ ప్రాణం పేరుతో హైదరాబాద్ సరూర్ నగర్ స్టేడియంలో నిర్వహించిన బోనాలు కార్యక్రమానికి గిన్నిస్ బుక్ రికార్డు దక్కింది.  ఇందులో ఎంతమంది మహిళలు పాల్గొన్నారు ?
జ: 2500 మంది
2) 3వ విడత హరితహారం కార్యక్రమం విజయవంతం అయ్యేందుకు ప్రభుత్వం ఏ దళాలను ఏర్పాటు చేసింది ?
జ: హరిత దళం (గ్రీన్ బ్రిగేడ్లు)
3) బృహత్ ప్రణాళికల కోసం రాష్ట్రంలోని ఎన్ని పట్టణాలకు GIS మ్యాపింగ్ పూర్తి చేశారు ?
జ: 37 పట్టణాలు

జాతీయం
4) డిజిటల్ లావాదేవీల ప్రోత్సాహంలో మొదటి స్థానంలో నిలిచిన దేశం ఏది? ( Digital Evolution Index )
జ: భారత్
5) పారామిలటరీ బలగాల్లో పనిచేస్తూ అమరులైన జవాన్ల కుటుంబాలకు ఆర్థిక చేయూత కోసం మూడు నెలల్లో రూ.10.18 కోట్లు విరాళాలు వచ్చాయి. ఈ నిధి పేరేంటి ?
జ: భారత్ కే వీర్
6) 50 యేళ్ళ నాడు కూలిపోయిన ఎయిర్ ఇండియా విమాన శకలాలు ఫ్రాన్స్ లో బయటపడుతున్నాయి. 1966 జనవరి 24న కూలిన ఈ విమానంలో చనిపోయిన ప్రముఖ వ్యక్తి ఎవరు ?
జ: భారత అణు పితామహుడు హోమీబాబా
7) నిరక్షరాస్యులైన వయోజనులకు కనీసం విద్యను అందించేందుకు దేశంలో నడుస్తున్న కార్యక్రమం పేరేంటి ?
జ: సాక్షర భారత్
8) ఏ కేసుల్లో తొందరపడి అరెస్టులు చేయరాదని సుప్రీంకోర్టు  ఆదేశాలు ఇచ్చింది ?
జ: వరకట్న వేధింపుల కేసు
9) డీజెల్ వినియోగం తగ్గించుకోవడానికి బొగ్గుతో దేన్ని ఉత్పత్తి చేయాలని కేంద్రానికి నీతి ఆయోగ్ సూచించింది ?
జ: మిథనాల్
10) ఈ ఏడాది చివరికల్లా 48 MI-17 చాపర్ల కొనుగోలుకు భారత్ ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకోనుంది ?
జ: రష్యాతో
11) 1986 నాటి భోఫోర్స్ శతఘ్నుల కుంభకోణం మరోసారి వార్తల్లోకి వస్తోంది.  భోఫోర్స్ సంస్థ ఏ దేశానికి చెందినది ?
జ: స్వీడన్
12) CANDI పేరుతో డిజిటల్ బ్యాంకింగ్ బ్రాంచ్ ని కెనరా బ్యాంక్ ఏ సిటీలో ఏర్పాటు చేసింది ?
జ: బెంగళూరు
13) ప్రపంచంలోనే మొట్టమొదటి గ్రీన్ మెట్రో సిస్టమ్ కలిగిన మెట్రో స్టేషన్ ఏది ?
జ: ఢిల్లీ మెట్రో
14) జపాన్ దేశం నుంచి ఆర్డర్ ఆఫ్ ది రైజింగ్ సన్ అవార్డుకు ఎంపికైన కేంద్ర మాజీ మంత్రి ఎవరు ?
జ: అశ్వినీ కుమార్
15) అప్నీ గాడీ - అప్నీ రోజ్ గార్ పేరుతో 100 ఉబెర్ మోటో బైక్స్ స్కీమ్ ను ప్రారంభించిన రాష్ట్రం ఏది ?
జ: పంజాబ్
16) మృగవని నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది ?
జ: తెలంగాణ
17) BWF ప్రపంచ ర్యాంకింగ్ ల్లో పీవీ సిందు ర్యాంక్ ఎంత ?
జ: 5 వ
18) లాగోస్ ఓపెన్ బ్యాండ్మింటన్ టోర్నీలో సింగిల్స్ టైటిల్ సొంతం చేసుకున్న భారతీయ ప్లేయర్ ఎవరు ?
జ: చిట్టబోయిన రాహుల్
19) ఆసియాన్ యూత్ అండ్ జూనియర్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ జూనియర్ కేటగిరీలో కాంస్యపతకం గెలుచుకున్న లవ్ ప్రీత్ సింగ్ ఎన్ని కేజీల విభాగంలో పోటీ పడ్డారు ?
జ: 105 కేజీలు

అంతర్జాతీయం
20) రామన్ మెగసెసే అవార్డు పొందిన జపాన్ చరిత్రకారుడు ఎవరు ?
జ: యోషియాకీ ఇషిజవా
21) రామన్ మెగసెసే అవార్డులను ఏ దేశ మాజీ ప్రధాని పేరు ప్రదానం చేస్తారు ?
జ: పిలిప్పీన్స్
22) 7వ సార్క్ దేశాల Artists camp and Exhibition of Paintings లో పాల్గొనని దేశం ఏది ?
జ: ఆఫ్ఘనిస్తాన్
23) 2017 గ్లోబల్ టైగర్ డే ను ఎప్పుడు నిర్వహించారు ?
జ: జులై 29
24) మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినంను ఎప్పుడు పాటిస్తారు ?
జ: జులై 30
25) సిమోర్ఘ్ అనే శాటిలైట్ మోసుకెళ్ళే రాకెట్ ను విజయవంతంగా ప్రయోగించిన దేశం ఏది ?
జ: ఇరాన్
26) 2017 ఏసియాన్ ఫుట్ బాల్ కాన్ఫడరేషన్ అండర్ 19 ఛాంపియన్షిప్ ను నిర్వహిస్తున్న దేశం ఏది ?
జ: ఇండోనేషియా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *